వ్యక్తిత్వ వికాసం
సంకల్ప బలంతో
సక్సెస్
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఈ స్వతంత్ర్య భారతంలో తాము పౌరులమనీ, ఈ
దేశానికి సి వ చేయడానికి కట్టుబడి ఉన్నామనీ భావించేవారు ఎందరు? చాలా కొద్దిమంది... అటువంటివాళ్లను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో స్థిరపడి ఉండవచ్చు. కానీ తన దేశం పట్ల ఆయనకున్న
నిబద్దత ఆయనను తిరిగి మన దేశానికి వచ్చేలా చేసింది. మొదట ప్రజలు ఆయనను
విశ్వసించనప్పటికీ, అహింసాయుతమైన పద్దతుల ద్వారా, తాను దేశానికి స్వాతంత్య్రం సాధించగలననే ధృడ విశ్వాసం ఆయనకు ఉండేది...
మహాత్మాగాంధీ విద్యార్థిగా ఉన్నత విద్య కోసం లండన్
వెళ్లాలని అనుకున్నారు. కానీ గాంధీగారి తల్లి పుత్లిభాయికి ఇది ఇష్టం లేకపోయింది.
ఆ పరాయి దేశంలో గాంధీ ఆకర్షణలకు లోబడి తన జీవితాన్ని పాడుచేసుకుంటాడని ఆమే
భయపడింది. తాను మద్యం, మాంసాలను ముట్టుకోనని, స్త్రీలతో సాంగత్యం పెట్టుకోననీ తనకు ప్రమాణం చెయ్యమని పుత్లిభాయి
కోరింది. ఒక క్షణమైనా సందేహించకుండా మోహన్ దాస్ ఆమె షరతులకు అంగీకరించాడు. అతడికి
అది అంట సులభమైన పని కాలేదు. చాలాసార్లు అనేక ఆకర్షణలు ఆయనను ప్రలోభపెట్టడానికి
ప్రయత్నించాయి. కానీతల్లికి ఇచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే ఆయనకు అన్ని
అపాయాలనుండి కాపాడి తనకు ఎదురైనా కష్టాలన్నింటినీ అధిగమించే గొప్ప
ఆత్మవిశ్వాసాన్ని ఆయనకు ఇచ్చింది. కట్టుబడి ఉండటమే బాధ్యతను తీసుకునే లక్షణాన్ని
రూపొందిస్తుంది.
విచక్షణా జ్ఞానాన్ని రూపొందించుకోవటానికి కావలసిన మరో
లక్షణం సంకల్పశక్తి. ఒట్టు పెట్టడం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం.
భీష్ముడికి ఉన్నటువంటి సంకల్ప శక్తి మనకు కావలి. ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండటానికి ప్రతిజ్ఞ చేసి, దాన్ని
శ్రద్ధతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాళ్ళు ఏవో కుంటిసాకులు చెప్పడానికి
చూస్తారు. మనస్సు చంచలమైనది. స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ,
క్షణానికి ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎవరైతే ధృడమైన సంకల్పాన్ని
కలిగి ఉంటారో, గొప్ప పనుల్ని సాధించాలన్న దృఢనిశ్చయాన్ని
ఏర్పరుచుకుంటారో వాళ్ళు తమ మనస్సులు చెప్పేది వినరు.
మహారాజు అయినా విశ్వామిత్రుడు గర్విష్టి. బ్రహ్మర్షి అయిన
వశిష్ఠుణ్ణి రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని ప్రయత్నాలు
ఫలించక భంగపడ్డాడు. వశిష్ఠుడి వద్ద వున్నది ఆధ్యాత్మిక శక్తి అని గ్రహించి తాను
కూడా తపస్సు చేసి బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకున్నాడు. కానీ మేనక అతన్ని
ఆకర్షించినప్పుడు కామసుఖాల వలలో చిక్కుకుపోయారు. బ్రహ్మర్షి స్థితిని సాధించడం
కోసం కోపం, ద్వేషం, అసూయ, గర్వం, ఈర్శ్వ, భ్రమలు మొదలైన
అడ్డంకులన్నీ దాటవలసి వచ్చింది. అయితే తన అమోఘమైన సంకల్ప శక్తి వల్లనే విజయం
సాధించాడు. ఓటమి పాలయ్యానని ఆయన ఎప్పుడూ తన గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ఆయన
యొక్క దృఢనిశ్చయం, దృఢసంకల్పం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని
మేలుకొలిపి, గెలుపుబాటలో నడిపించాయి.
బాధ్యతలకు కట్టుబడి ఉంది, దృఢమైన సంకల్పంతో
గమ్యం, లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉంటె విచక్షణారాహిత్యం అనే
సమస్యే ఉండదు. ఈ ప్రంపంచంలోని ఏ అంశం కూడా ఒక్కదానిగా ఉండదు. ఎన్నో కారణాలు,
ప్రభావాలు దాని వెనుక ఉంటాయి. అలాగే విచక్షణాజ్ఞానం అన్నది కూడా ఓ
విడి అంశం కాదు. ఎన్నో విషయాల మిశ్రమం. ఆ లక్షణాన్ని అలవాట్లుగా మార్చుకుంటేనే
విచక్షణాజ్ఞానం విన్నింగ్ పాయింట్ గా మారుతుంది.

Comments
Post a Comment