అందమైన అనుబంధాల కోసం..
అందమైన అనుబంధాల
కోసం..
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
“ఒరేయ్ రాకేష్ ! నీకు ఈ విషయం తెలుసా?
కంప్యూటర్‌తో
మమేకం అయిపోయిన రాకేష్ ఒక్కసారి తల తప్పి చూశాడు. "ఏంటో చెప్పరా .... నస
పెట్టకుండా "
"అదేరా....
చెల్లెమ్మా..... అదే నీ భార్య...' అన్నాడు రాజు. అప్పటి వరకు అంత
ఉత్సాహం చూపని రాకేష్ ఆ మాటతో అలర్ట్ అయిపోయాడు.
“చెప్పరా... తనకేం
అయింది” కంగారుగా అడిగాడు. రాకేష్ "తనకేం కాలేదురా.... టీమ్ లీడర్
రమేష్ లేదు... అతగాడు చెల్లెమ్మతో కాస్త క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని అందరూ
అనుకుంటుంటేనూ..... " ఆర్దోక్తిలో ఆపేశాడు.
అప్పటికే రగలాల్సిన మంట రాకేష్ గుండెల్లో మండుతుంది. అతనికి
భార్యపై అనుమానం పెనుభూతం అయిపోయింది. క్షణాల్లో, వెంటనే భార్య
ఆఫీసుకి వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు. రాకేష్ తను పెట్టాల్సిన చిచ్చు పెట్టేసి
మెల్లగా జారుకున్నాడు రాజు.
"శాస్త్రులుగారు బావున్నారా? "
“బ్రహ్మాండంగా ఉన్నానోయ్ రాము. ఎప్పుడూ రానివాడిని ఈ రోజు
ఇలా వచ్చావేంటోయ్? ఏదైనా విశేషమా?"
“విశేషం అంటూ ఏం లేదండి. కానీ మీ మిత్రుడు శర్మగారి గురించి
చెబుదామని....”
"శర్మా... వాడికేం అయ్యింది? ఇందాకే
చూసొచ్చానే... నిక్షేప౦గా ఉంటేనూ?
"ఆయన నిక్షేపంగానే ఉన్నాడండి. కానీ మిమ్మల్నే
నిప్పుల్లోకి తోసేస్తున్నారు. మీరేమో మరి
అమాయకంగా ఉంటారు..” "ఇంతకీ ఏమైంది?
"ఏమైందని నెమ్మదిగా అడుగుతారే ? ఇప్పుడు
ఆయన దీక్షితులు గారితో కలిసిపోయి ఏదో కొత్త వ్యాపారం చేయబోతున్నాడని ఊరు ఊరంతా
అనుకుంటుంటేనూ... మరి మీతో ప్రస్తుతం
చేస్తున్న వ్యాపారం చేస్తాడో లేదో? ఎవరికీ తెలుసు...
చెప్పండి "
అప్పటి వరకు
నవ్వుతూ ఉన్న శాస్తులుగారు ఒక్కసారిగా అగ్నిహోత్రులు అయిపోయారు.
ఇప్పుడే వాడితో తాడో పేడో తేల్చుకుంటాను" అని
నిల్చున్నారు శాస్త్రులు.
“అయ్యో ఈ విషయం నేను మీతో
అన్నానని ఆయనతో చెప్పకండి. ఏదో మీ శ్రేయోభిలాషిని కనుక చెప్పకుండా
ఉండలేకపోయాను" అని నెమ్మదిగా జారుకున్నాడు రాము.
రాజు, రాము
లాంటివారు మనకు కొత్తెంకాదు . గాలి వార్తల్ని అటూ ఇటూ ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటూ తిరిగేవారు. ఇటువంటి వారు ఎంతోమంది మనతో, మన మధ్యలోనే
ఉంటారు. అందమైన అనుబంధాన్ని అగాదంలోకి పడెయ్యడమే వారి పని.
ఇటువంటి
వ్యక్తులు చేరవేసే విషయాల్లో నిజానిజాల్ని తేల్చుకునే వారి కన్నా,మనసు
పొరల్లో ఆ వ్యక్తి మీదున్న అసంతృప్తినో,
కోపాన్నో కొత్తగా వచ్చిన వార్తతో జోడించి మీ అభిప్రాయానికి వచ్చేసి
బంధాల్ని బలహీనం చేసుకునే వారే ఎక్కువ ఉన్నారు.
ఈ సందర్భంలో
చాణుక్యుని కథ ఇటువంటి పరిస్థితుల నుండి బయట పడటానికి పరిష్కారాన్ని
చూపిస్తుంది....
ఒకసారి
చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి "నీకు తెలుసా? నీ
మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను “ అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో
చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి,”నా మిత్రుడు గురించి
నువ్వు చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని
కొద్దిగా జల్లెడ పడదాం. దాన్ని నేను
"మూడు జల్లెడ్ల పరీక్ష (triple
filter test)” అంటాను అని అడగటం మొదలెట్టారు.
మొదటి జల్లెడ ‘నిజ౦’,
‘నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు
తెలుసా?’ అని అడిగాడు.
అందుకు ఆ
స్నేహితుడు “లేదు. ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు. "అంటే నీవు
చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్నమాట" అని చాణక్యుడు అన్నాడు.
రెండో జల్లెడ ‘మంచి’.’
నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా?’ అని
అడిగాడు చాణక్యుడు.
“లేదు”అన్నాడు అతను.
‘అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు.
అది కూడా ఖచ్చితంగా నిజమని తెలీని విషయం సరే ఇంక మూడో జల్లెడ్ల వెళదాం’ అన్నాడు. చాణక్యుడు. మూడో జల్లెడ
‘ఉపయోగం’;
నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా? అని చాణక్యుడు అడిగాడు.
“లేదు’” అన్నాడు ఆ మిత్రుడు.
"అయితే నీవు
చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది
కానప్పుడు నాకు చెప్పటం ఎందుకు” అని అన్నాడు. చాణక్యుడు.
అనుబంధాలు
నిలబడేది వ్యక్తిగత గౌరవం, మన్నన, ఆప్యాయత
వంటివి వరస్పరం ఉన్నప్పుడే, మనకు ఆప్తులైన వారితో మనం 24 గంటలు గడపలేకపోవచ్చు. ఎవరికి
వారికి ఉద్యోగ జీవితమో, మరొకటో ఉండవచ్చు. ఎప్పుడైనా దొరికే ఆ స్వల్ప వ్యవధిలో
చక్కర్లు కొట్టి ఉబుసుపోక కబుర్లతో అనుమానపు బీజాన్ని మొలకెత్తిస్తే, అని అనుబంధాల్నే నిర్వీర్యం చేస్తాయి.
అనుమానాల, విషయ
నిర్దారణలు స్వయంగా వ్యక్తులతోనే చేసుకుంటేనే మంచిది. నిజానిజాలు తెలుసుకోకుండా
తొందరపడితే దృఢమైన బంధాలు కూడా బీటలు వారుతాయి.
కొందరు తాత్కలిక
పైశాచిక ఆనందం కోసం చేసే కామెంట్స్ ను పట్టించుకొని ఇష్టమైన వారిని కోల్పోవడంకన్నా
పనికిమాలిన పని ఇంకోటి ఉండదు.
అటువంటి
గాసిప్స్ వినడానికి చెక్ పెట్టేసి మనకిష్టమైన వారితో ఆహ్లాదంగా గడిపేస్తే జీవితం
ఎంతో మధురం కదూ! ఆ ‘నోరు జారేవారికి ఆ కాస్తే ఆనందాన్ని దూరం చేసే మనవాళ్లకు
జీవితాంతం సంతోషం' ఇచ్చేదాం మరి!
* * *

Comments
Post a Comment