సూక్తులు అతనికి స్పూర్తినిచ్చాయి .....

సూక్తులు అతనికి స్పూర్తినిచ్చాయి .....
(వార్త ఆదివార అనుబంధ పత్రికలో ప్రచురితం)

 


  గాయపరిచే విషయాలే మార్గదర్శకాలవుతాయి. - బెంజిమిన్ ఫ్రాంక్లిన్.

    బ్రూన్లో  1980ల్లో ఒక వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థలో జాతీయ స్థాయి సేల్స్ మేనేజర్ గా పని చేసేవాడు. భార్య మార్లిన్, ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి ఆయన మిల్ వాకీ శివార్లలోని ఒక అందమైన ఇంటిలో నివసించేవాడు. ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపేవాడు.

కానీ 1984 లో బ్రూనో  ఉద్యోగాన్ని కోల్పోయాడు. కొన్ని నెలలపాటు ఉద్యోగం లేకుండానే జీవితాన్ని గడుపుతున్న క్రిష్ట పరిస్థితుల్లో ఆయన ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు.

   ఒకరోజు రాత్రివేళ బ్రూనో తన కారులో ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పి, ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో ఆయన బాగా గాయపడ్డాడు. శ్వాసకోశాలు విఫలమయ్యాయి. పక్కటెముకలు విరిగిపోయాయి. గుండెకు గాయమైంది. పైత్యకోశం దెబ్బతిన్నది. కాలేయం ఛిద్రమైంది. ఆయన బతుకుతాడో లేదో కూడా డాక్టర్లు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. తనకు మరణం సమీపించిందని బ్రూనో కూడా భావించాడు. మూడు  రోజుల పాటు వైద్య ఉపకరణాల సహాయంతో జీవించిన తరువాత అనుకోని విధంగా బ్రూనో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. తనకు భగవంతుడు మరో ఆవశాన్ని ఇచ్చాడని ఆయన భావించాడు.

          ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవితంలో ఇక తాను చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు బ్రూనో, ప్రమాదానికి ముందు నిజానికి చిన్నప్పటినుంచీ కూడా బ్రూనోకి స్పూర్తిదాయకమైన సూక్తుల్ని సేకరించే అలవాటు ఉండేది. ఈ అలవాటు తన తల్లి నుంచి ఆయన వారసత్వంగా పొందాడు.

         స్ఫూర్తిదాయకమైన సూక్తులు ఎంత శక్తివంతమైనవో ఆయనకు చిన్నతనం నుంచే తెలుసు. బ్రూనో తల్లి అలాంటి సూక్తుల్ని రిఫ్రిజిరేటర్ మీద, ఇల్లంతా అందరికీ కనిపించేలా ఉండేది. ఆ సూక్తులు ఆయన మీద మంచి ప్రభావం చూపేవి, దిశానిర్దేశం చేసేవి.

        అనుపత్రిలో చికిత్స పొందుతూ ఆలోచనల్లో మునిగి వుండగా హఠాత్తుగా ఆయన మనసులో ఒక ఆలోచన మెరపులా మెరి సింది. తనకు చిన్నతనం నుంచే బాసటగా ఉన్న ఈ సూక్తూల్ని ఆధారంగా చేసుకుని ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే బావుంటుందని ఆయనకు అనిపించింది. దీనివల్ల వాటిని ఇతరులతో పంచుకునే ఆవకాశం లభిస్తుంది. వాళ్లు కూడా వాటి నుంచి మంచి స్ఫూర్తిని పొందుతారు. కానీ తన ఆలోచనలకు ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలో ఆయనకు తెలియలేదు.

         ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  ఆయి. బయటికి వచ్చిన తర్వాత ఎనో ఆర్థిక స్థితి మరింతగా క్షీణించింది. చికిత్స నిమిత్తం డబ్బు మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేయాల్సి వచ్చింది. బ్రూనో ఆర్థికంగా దివాలా తీసాడు. ఉన్న ఇంటిని కూడా తెగనమ్ముకుని బ్రూనో కుటుంబం ఒక చిన్న అద్దె ఇంట్లోకి మకాం మార్చింది.

 అయినప్పటికీ బ్రూనో తన ఆశయాన్ని మరిచిపోలేదు. సానుకూల దృక్పథంతో, నిరంతర పట్టుదలతో ఆశయ సాధన కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కొన్నేళ్ల వ్యవధిలో ఆయన కొన్ని ఉద్గోయాలు చేశాడు. వాట ద్వారా ముద్రణ, మార్కెటింగ్ రంగాల్లో కొంత అనుభవాన్ని సంపాదించాడు.

     స్ఫూర్తిదాయకమైన  సూక్తుల్ని ఇతరులకు ఏ విధంగా చెప్పాలన్నది ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న.

    ఒకరోజు ఉన్న ట్టుండి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది.

తాను ముద్రించదలుచుకున్న సూక్తుల్ని క్రెడిట్ కార్డుల తరహాలో ముద్రిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఆ రోజు సాయంత్రం టీవీ చూస్తుండగా ఒకానొక క్రెడిట్ కార్డు కంపెనీ తాలూకు వాణిజ్య ప్రకటన బ్రూనో కంటపడింది. ఆ ప్రకటన ఒక ‘గోల్డ్ కార్డుకు ‘సంబంధించినది.

    ఈ ఆలోచనకు మరింత సృజనాత్మకను జోడించి, సూక్తుల్ని లోపా రూపంలోని గోల్డ్ కార్డుల్లాగా ముద్రిస్తే, జనం వాటిని తాము ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని బ్రూనో భావించాడు. దాంతో మనోదృక్పథం, నాయకత్వ లక్షణం, పట్టుదల, ధైర్యం వంటి వ్యక్తిత్వ వికాసానికి " సంబంధించిన అనేకానేక సూక్తుల్ని కార్డుల రూపంలో ముద్రించాడు. వాటికి ‘సక్సెస్  గోల్డ్ కార్డు’ అని పేరు పెట్టాడు.

 ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన ఐదేళ్ల తరువాత దేవ్ బ్రూనో తన మొదటి సక్సెస్ గోల్డ్ కార్డుని అమ్మాడు. తర్వాత ఎన్నో లక్షల కార్డుల్ని అమ్మాడు. ఒక విషాదకరమైన ప్రమాదాన్ని దేవ్  బ్రూనో ఒక అద్భుత విజయంగా మలచుకున్నాడు. ప్రతికూలత మన జీవితంలో ధృక్కోణాన్ని మార్చేస్తుంది. చిన్నచిన్న సమస్యలు తర్వాత మనల్ని బాధించవు. అంతకన్నా ప్రధాన విషయాలపై కేంద్రీకరించే దృష్టి అలవడుతుంది.

    సమస్యలు, కష్టాల నుంచి, మరీ ముఖ్యంగా దేన్నయినా పోగొట్టుకోవడం లేదా తొలగింపుకు గురి కావడం వంటి అనుభవాల నుంచి జీవితంలోని ఎన్నో విషయాలపట్ల ఒక లోతైన వివేచనను పెంపొందిందు కుంటాం. దీనివల్ల జీవితాన్ని లోతుగా పరిశీలించడం అలవాటవుతుంది.

    ఒక ఆటంకాన్ని అధిగమించడానికి మనలోని ధైర్యాన్ని సంకల్ప బలాన్ని కూడగట్టుకున్న తర్వాత సామర్థ్యం మరింత పెరిగి, ఆత్మ విశ్వాసం ఇను మడిస్తుంది. స్వీయ విలువపట్ల గొప్ప గౌరవం కలుగుతుంది. ఈ సానుభూతి అనుభవాలు భవిష్యత్ చర్యలకు వర్తింపచేస్తాం.

‘ప్రతికూలత తత్సమానమైన లేదా అంత కంటే గొప్పదైన ప్రయోజనపు విత్తనాన్ని వెంట తెస్తుంది" - నెపోలియన్ హిల్

   *    *    *

 

 

 

 

 


Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ