ఒక్క అడుగుతో విజయం సాధించాడు.....
ఒక్క
అడుగుతో విజయం సాధించాడు.....
“మనలో చాలా మంది నది మధ్యలో నిలబడి దాహంతో
మరణిస్తుంటారు."
- కేథీ మేటివో
ఆంగ్లంలో ఓ కథ ఉంది. 'Gold at Ten
feet" (పది అడుగుల లోతులో బంగారం).అతనికి
భూమిలో ఓ చోట తవ్వితే బంగారం దొరుకుతుందని ఎవరో చెప్పారు. ఓ రెండు అడుగులు
తవ్వాడు. చేతులు బొబ్బులు పెట్టాయి. ఊళ్లోవాళ్లు ఏం చేస్తున్నావని అడిగితే-
"బంగారంకోసం తవ్వుతున్నానని చెప్పాడు. అందరూ గేలి చేస్తారు. అయినా తవ్వు తూనే
ఉంటాడు. ఎనిమిది అడుగుల వరకు తవ్వుతాడు. నిరాశ చెంది వదిలేసాడు. తర్వాత ఇంకొకతను
వస్తాడు. ఇంకో రెండు అడుగులు తవ్వుతాడు. అతనికి బంగారం దొరుకుతుంది.
విజయం వచ్చేవరకు పోరాడాలి. బంగారు
దొరికేవరకు తవ్యాలి. అదే జీవితం అంటే!
నిజానికి సమస్య ఏదైనా పరిష్కారం ఎప్పుడు మనల్ని నిరాశపరిచిన తర్వాతి అడుగే అయి
ఉంటుంది. ఆ తర్వాతి ఒక్క అడుగే మనల్ని విజేతల్ని చేస్తుంది. జార్జ్ పోర్ మన్ జీవితమే దీనికి ఆదర్శమైన ఉదాహరణ.
ప్రపంచంలో ఎక్కువ వయసున్న హెవీ వెయిట్ ఛాంపియన్ గా జార్జ్ పోర్ మన్ ఒక రికార్డు స్థాపించాడు. జార్జ్ పోర్ మన్ ...
టెక్సాస్ లో హ్యూస్టన్ లో పెరిగాడు. టీనేజ్ లో అతను అల్లరి
చిల్లరిగా ఉండేవాడు. చిక్కుల్లో పడకుండా ఉండటానికి అతను బాక్సర్ అయ్యాడు...
1968లో ఒలింపిక్ బాక్సర్ స్క్యాడ్ లో ఉంది. హెవీ వెయిట్ బంగారు పతకం
గెలుచుకున్నాడు. 1969లో బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఎన్నడూ నవ్వని, వ్యక్తిత్వం
లేని, కఠినమైన భారీ ఫైటర్‌గా ప్రసిద్ధికెక్కాడు. తన
ప్రత్యర్థి మీద నిరంకుశంగా ఉండేవాడు. 1973లో జోఫ్రీజియర్ ను ఓడించి హెవీ వెయిట్ బిరుదు గెలుచుకున్నాడు. ఆ
పోటీ తర్వాత అతను అజేయుడిగా పరిగణించబడ్డాడు.
కానీ, 1974 జాయిరేలో మహమ్మద్
అలీతో తలపడ్డాడు. కానీ ఒక వ్యూహాత్మకమైన కదలికలోకి ఆలీ 'రోప్-ఎ
డోప్ వ్యూహం" అనబడే ఒక కొత్త ఎత్తుగడ ప్రయోగించి పోటీ గెలిచాడు. ఇది జార్జ్
పోర్ మెన్ మొదటి ఓటమి... అతను
కుప్పకూలిపోయాడు. అక్కడి నుంచి అతని పతనం ప్రారంభమైంది. జిమ్మీ యంగ్ అని అంతగా
పేరులేని ఫైటర్ చేతుల్లో మరొకసారి ఓడిపోయాడు. అది ఒక పెద్ద ఎదురుదెబ్బ.
పోటీ తర్వాత, డ్రెస్సింగ్ రూంలో జార్జ్ వింతగా ప్రవర్తించడం ప్రారంభించారు. అతని
శిక్షకులు అతనికి మతి చలించిందనుకున్నారు. కానీ జార్జ్ తనకు ఒక మత సంబంధమైన అనుభవం
కలిగిందన్నాడు. ఓ రాత్రి అతను బాక్సింగ్
క్రీడ వదిలి పెట్టి, బోధకుడు కావాలని నిర్ణయించుకున్నాడు.
అతని బాక్సింగ్ కెరీర్ అంతమైందని, జార్జ్ ఫోర్ మాన్ చరిత్రలో
కలిసిపోయాడనీ అంతా అనుకున్నారు. కానీ అతను చరిత్ర సృష్టించడం ఇంకా పూర్తి కాలేదు.
జార్జ్ హ్యూస్టన్ తిరిగి వెళ్లి, ఒక
చర్చి, ఒక యువజన కేంద్రం ప్రారంభించాడు. పది సంవత్సరాల
తర్వాత, తన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయాక, యువజన కేంద్రం నడపాలంటే డబ్బు అవసరమని అతను గుర్తించాడు.
అందుకని మళ్లీ బాక్సింగ్ రింగులోకి
దిగాలని నిర్ణయించుకున్నాడు. మళ్లీ బాక్సింగ్ ప్రారంభించినప్పుడు అతను పూర్తిగా
మారిపోయాడు. ఒక నూతన వ్యక్తి అయ్యాడు. తనను తాను పునరావిష్కరించు కున్నాడు. అతను
బాక్సింగ్ నుండి విరమించినప్పుడు, కొరకరలాడుతూ, ఎవరితోనూ
మాట్లాడకుండా, కేవలం ఫైట్ చెయ్యడానికి ఉన్నట్లు ఉండేవాడు.
అతను తిరిగి వచ్చినప్పుడు, పూర్తిగా మారిపో యాడు. అతను ఒక
నూతన వ్యక్తి అయ్యాడు. స్నేహపూరితంగా, ఉత్సాహంగా, సరదాగా, సంభాషించడానికి ఇష్టపడే వ్యక్తి అయ్యాడు.
తిరిగి వచ్చిన తర్వాత అతని మొట్టమొదటి ఫైట్ 1987 మార్చిలో జరిగింది. అతను గెలిచి
ముందుకు సాగాడు. అసంఖ్యాకమైనన్ని సార్లు అతను పోటీ చేసి, ప్రతీసారి
గెలిచాడు. మీడియా అతనికిచ్చిన కొత్త చిత్రంతో అతని పాపులారిటీ పెరిగింది.
అమెరికాలో ఫేవరేట్ , వ్యక్తులలో ఒకడు అయ్యాడు. కమర్షియల్
ప్రకటనలలో ప్రముఖుడయ్యాడు. హేంబర్గర్స్
దగ్గర నుంచి మప్లర్స్ దాకా ప్రతీదీ అమ్మేవాడు.
అతను చేసే ప్రతీ పనీ జనం ఇష్టపడే వారు.
పోటీ తర్వాత పోటీ... పోటీ తర్వాత పోటీ, అతను ప్రతీ పోటీ
గెలిచాడు.
1991లో జార్ట్, ఇవేందర్ హోలీఫీల్డ్ తో ఒక కఠినమైన పోటీలో
ఓడిపోయాడు. అతని కథ ముగిసిందని అంతా అన్నారు. అతని వయసు నలభై దాటింది..
స్థూలకాయుడు, జార్జ్ ఇంకా బాక్సింగ్ నుంచి విరమించాలని కామెంటేటర్స్
అందరూ అన్నారు. అతను ఈ క్రీడకు వృద్ధుడు. కానీ జార్జ్ మరో రకంగా ఆలోచించాడు. అతను
పోరాడుతూనే ఉన్నాడు. 1994 నవంబర్ లో, జార్జ్ ప్రపంచాన్ని
విస్మయంలో ముంచెత్తారు. 45 సంవత్సరాల వయసులో అతను హెవీ వెయిట్ ఛాంపియన్ బిరుడు
గెలుచుకున్నాడు.
బిరుదు గెలుచుకోవడమే కాదు, అతను
అమెరికాలో అత్యంత జనరంజకమైన టెలివిజన్ పర్సనాలిటీలలో ఒకడుగా, బుల్లితెరమీద ఉత్పత్తులు సిఫారసు చేసే వ్యక్తులలో ఒక ప్రముఖుడిగా అయ్యాడు.
అధిక వయసు గల హెవీ వెయిట్ ఛాంపియన్‌గా అతను చరిత్ర సృష్టించాడు. బెస్ట్ సెల్లింగ్
రచయిత అయ్యాడు. తన టెలివిజన్ షోని హోస్ట్ చేసాడు. అత్యధిక ఆదరణ గల పబ్లిక్ స్పీకర్
అయ్యా డు..... తనను తాను పునరావిష్కరించుకున్న వ్యక్తి జార్జి పోర్ మెన్
జార్జ్ ఫోర్ మేన్ జీవితం అంతా కూడా
'ఛాలెంజింగ్ ఒక్క అడుగు'తో కొనసాగడమే. ఓడిపోయిన భావన
కలిగిన ప్రతీసారీ ఇంతో ప్రయత్నం అనే ఒక్క అడుగు ఎప్పుడు మనల్ని గెలిపించడానికి
సిద్ధంగానే వూంతుంది.
*
* *

Comments
Post a Comment