గాయాల్ని గేయాలుగా మలచుకుంటున్న స్త్రీ శక్తి
గాయాల్ని గేయాలుగా మలచుకుంటున్న స్త్రీ శక్తి
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
మాతృత్వంతో తన రక్తానికి రూపం, ప్రాణం ఇచ్చే స్రీ తనదన్న స్వార్ధం కన్నా కుటుంబం అన్న బాధ్యతకే కట్టుబడిన రోజులు ఉన్నాయి. పోనీ అవి పోయిన కాలంలోని పేజీలు అనుకుందాము. కానీ అప్పటికీ స్వలాభం ఆశించకుండా దేశ దాస్య విముక్తికై పోరాడిన
వీర వనితలు ఉన్నారు.
మహిళలు బయటికి రావడమే అరుదైన అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆ ఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళామణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవితలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్ర సమరంలో జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ.
భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్. మహిళా సాధికారత కోసం
గ పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె
పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్ చంద్ర బోస్ చేసిన
స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా
మెలిగిన కెప్టెన్ లక్ష్మి సెహగల్ భారత స్వతంత్ర పోరాటంలో
ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత.
అభినవ ఝాన్సీ లక్ష్మీచాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత
లక్ష్మీ సెహగల్ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్
ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ర్యూన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలోనిలిచిపోయారు.
ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్ధాంగి అనే
పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన ఛైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదుసత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్ అరీ స్వాతంత్రోద్యమంల నిర్వహించిన పాత్ర గురించి చెప్పుకోవాలి.గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమెనాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రిలతో సమానంగా అనేకమంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతంత్య ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్ రాణి బేగం హజరత్ ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి.
అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయపోరాట చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని బ్రిటిష్ అధికారుల జైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు.
పైన చెప్పిందంతా అప్పటి అసాధ్యాలను తన
మనోబలంతో సుసాధ్యాలు చేసిన వనితల గాధలు. కాలం
మారింది. నేడు స్త్రీలు తమ మేధస్సుతో తమ ఉనికిని
చాటుతున్నారు. అంతకు ముందు కాలం అంటే వేదాలక
గమనిస్తే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం
ఉంది. మన దేశాన్నే ఒక స్రీ మూర్తిగా భారత మాతగా
కొలిచాము , కొలుస్తున్నాము . మన దేశంలో నదులను
సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరిలను స్త్రీ మూర్తు
లుగా, మాతలుగా వ్యవహరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీల పట్ల
ఆరాధనా భావం ఉన్నందువరల్లే మనం పుట్టిన దేశాన్ని
మాతృభూమిగా పిలుచుకుంటున్నాం.
సైన్స్ , టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు,
కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో
దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ
మహిళలు అద్భుతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు
మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా
దిగారు. ఇటీవలే మన యుద్ద విమానాలను నడపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్ సంస్థల బోర్జుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓ నివేదిక పేర్కొంది.
ఇలా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడూ తమను తాము నిరూపించుకుంటూ, ఎటువంటి సవాళ్లను అయినా సరే ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటున్న నేటి స్త్రీ విజయ గేయాలు ఆకాశాన్ని చేరుతున్నా సరే ఆమె మాత్రం గాయాల దొడికి గురి అవుతూనే ఉంది.
దీనికి కారణాలు ఇవే అని కచ్చితంగా చెప్పలేము.
ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 'మహిళలు, వ్యాపారం, చట్టం' నివేదికలో మొత్తం 187 దేశాల్లో ఆరు దేశాలు మాత్రమే మహిళలకు, పురుషులకు 'పూర్తి సమానత్వం' అందిస్తున్నాయని తెలిపింది. ఆర్థిక,చట్టపరమైన, ఉద్యమ స్వేచ్చ, ప్రసూతి గృహ హింస, ఆస్తి
నిరహణ లాంటి ఇతర అంశాలకు సంబంధించి పదేళ్ల గణాంకాలను పరిశీలించిన ప్రపంచబ్యాంక్ దీనిపై ఒక రిపోర్ట్ విడుదల చేసింది. లింగ సమానత్వం 83.75 శాతం ఉన్న అమెరికాకు కూడా టాప్ 50 జాబితాలో చోటు దక్కలేదు. జెండర్ ఈక్వాలిట్ అంటే... కేవలం చట్టాలు మార్చితేనే సరిపోదు. వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలి.



Comments
Post a Comment