పట్టుదలతో పయనం

పట్టుదలతో పయనం 
(వార్త ఆదివార అనుబంధ పత్రికలో ప్రచురితం) 



గొప్ప వ్యక్తులు సాధారణ వ్యక్తుల నుండి ఎప్పుడూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటారు" - ఐనస్టీన్.

దృష్టి ఉన్న చోటల్లా వ్యతిరేకత ఉంటుంది. దృష్టికి ఏదో ఒక సవాలు ఎదురవుతుంది. ఈ వ్యతిరేకత గురించి అర్థం చేసుకుని, దృష్టిలో గాఢనమ్మకం ఉండి, పోరాడడానికి సిద్ధపడాలి. ఒకవేళ మన దృష్టి పెద్దగా ఉంటే, ఇతరులకు అది అర్థం కానప్పుడు ఆ పెద్ద కలను నీరు గార్చడానికి ప్రయత్నిస్తారు.

చూడడానికి దృష్టి ఉండాలి. నమ్మడానికి విశ్వాసం ఉండాలి, చెయ్యడానికి ధైర్యం ఉండాలి, సహించడానికి శక్తి కావాలి.ప్రతీ గొప్ప పరిశోధన, ప్రతీ గొప్ప విజయం , ఒక పెద్ద కల ఫలితం. కొంతమంది బహుశా ఆ కల చూసి నవ్వి ఉంటారు. కానీ ఆ కలగన్న వ్యక్తి అది సాధించాడు.

కొవ్వొత్తి కానీ ఇంకో రకమైన దీపం సృష్టించడానికి తను కంటున్న కల గురించి చెప్పినప్పుడు, థామస్ ఎడిసనన్ను చూసి జనం నవ్వారు. అతడికి మతిస్థిమితంలేదన్నారు. ఇతర ప్రదేశాలలో ఉండే ఇతర వ్యక్తులతో సంభాషించే యంత్రం గురించి మాట్లాడినప్పుడు, అలెగ్జాండర్ గ్రాహంబెలను హేళన చేశారు. అతడిని పిచ్చివాడన్నారు. క్రిస్టోఫర్ కొలంబస్ భూమి బల్లపరువుగా లేదనీ, గుండ్రంగా ఉందని చెప్పినప్పుడు, కొలంబస్ ను గేలి చేశారు, పిచ్చివాడన్నారు. తను చెప్పేది రుజువు చెయ్యడానికి భూమి అంచునుంచి పడిపోవడానికి అతను సిద్ధపడ్డాడు.

రైట్ సోదరులు ఎగిరే యంత్రాన్ని సృష్టి స్తామని అన్నప్పుడు హేళన చేశారు. రైట్ సోదరులను వెర్రివాళ్లన్నారు.అహింసా మార్గంలో పౌరహక్కుల ప్రదర్శనల గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాట్లాడినప్పుడు అతడిని చూసి నవ్వారు. వెర్రివాడన్నారు.లింకాన్ మెమోరియల్ మెట్లమీద తన కలలను ప్రపంచంతో పంచుకోవడానికి ఒక ప్రదర్శన గురించి అతను ప్రస్తావిం చినప్పుడు, అంతా నవ్వారు. జాన్ యన్. కెన్నడీ 1960లకు ముందు మనిషి చంద్రుడి మీద అడుగు పెడతాడని చెప్పినప్పుడు అంతా నవ్వారు. ఈ పట్టిక ఇలా పెరుగుతూ ఉంటుంది. అంతా నవ్వారు.

మహత్తర విషయాలన్నీ ఒకప్పుడు అసాధ్యంగా భావించబడ్డాయి. అపురూప విజయాలు సాధించిన ప్రతి ఒక్కరూ అసాధ్యాన్ని సాధ్యం చెయ్యడానికి నడుం కట్టారు. జనం నిన్నూ, నీ కలనూ చూసి నవ్వవచ్చు. కానీ నిరాశ చెందకూడదు. ఆఖరున నవ్వేవాడు అందరికంటే చక్కగా నవ్వుతాడు అని అర్థం చేసుకున్న ప్రఖ్యాత వ్యక్తుల క్లబ్బులో మనం చేరాం. హాస్యాస్పదంగా కనిపించే విషయాలన్ని చేపట్టడానికి నువ్వు ఇష్టపడకపోతే, అద్భుతమైన విజయాన్ని సాధించలేం.

మనం- మన కల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దృష్టి ఉన్నచోట వ్యతిరేకత ఉంటుంది. కలలున్న చోట, కలలను ధ్వంసం చేసేవారుంటారు. కల పెద్దదైనకొలదీ, సమస్యలు పెద్దవవు తాయి. సవాళ్లు పెద్దవవుతాయి. కానీ ఫలితాలు కూడా పెద్దవిగానే ఉంటాయి. పోరాడడానికి నిబద్ధత చాలా అవసరం. ఎందుకంటే కలలున్న చోట, కలలను ధ్వంసం చేసేవారుంటారు. కానీ ఫలితాలు కూడా పెద్దవిగానే ఉంటాయి. పోరాడటానికి నిబద్దులమై ఉండటం చాలా అవసరం. ప్రతిఘటించాలి. పోరాడుతూ ముందుకు పోవాలి, పోరాడుతూనే ఉండాలి. పరాజయాన్ని విజయంగా మార్చుకోవడానికి ఒక కలను అన్వేషించాలి, ఆ కల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆ కల కోసం పోరాడాలని గుర్తుంచుకోవాలి.

తర్వాత కలను పెద్దదిగా చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే కల ఎంత పెద్దదిగా ఉంటే ఫలితం కూడా అంత పెద్దదిగా ఉంటుంది.పరాజయాన్ని విజయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అది అంత తేలికైన విషయం కాదని గుర్తు పెట్టుకోవాలి. సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి.కష్టాలు, వ్యతిరేకతలు ఎదురవుతాయి.

పెద్ద లక్ష్యాలు చేరుకోవాలంటే, కలలను సాకారం చేసుకోవాలంటే, మొదట వ్యక్తి ప్రేరేపింపబడాలి. ప్రేరణలు రెండు రకాలు. ఒకటి: స్ఫూర్తిని రెండు: తెగింపు. చాలా మందిలో తెగింపు ప్రేరణ అవుతుంది. వారికి వేరే మార్గం లేనప్పుడు, చివరి వరకూ నెట్టబడిన పరిస్థితులలో తెగిస్తారు. ప్రతి క్షణం. ప్రతీరోజూ ప్రేరణ ఉన్నప్పుడు ఎంత పెద్ద కలలైనా నిజం అవుతాయి.

షార్క్ , చేపలు తమను తరుముకు వచ్చేదాకా, తాము ఎంత వేగంగా ఈదగలరో చాలా మందికి తెలియదు. జీవితంలో పందెం గెలిచేవాడు. తెలివితేటలతో తన వేగాన్ని తాను నిర్ణయిస్తాడు. వాళ్లు ఈదే వేగాన్ని భయం నిర్ణయించదు. వారి ఇష్ట ప్రకారం ఉంటుంది.

మీరు నిర్ణయాల సముద్రం ఈదేప్పుడు, దృష్టి మీకు మార్గం చూపిస్తుందా? లేక భయమా? మీ లక్ష్యాలను మీరు నిర్ణయించుకున్నారా? ఉన్నత స్థానాలు చేరడానికి ప్రయత్నిస్తున్నారా? లేక షార్క్ చేపల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారా?

మీ కలలను సాకారం చేసుకోవడానికి మీకు కావలసినది స్ఫూర్తా, తెగింపా? నిర్ణయం మీదే. లక్ష్యం, కల గురించి డెస్టర్ తన పుస్తకం “నీ కలను దొంగలించనివ్వకు' (dont let anybody steal your dream) లో చెప్పిన సూక్తులు నిజమైన 'విజయం ఫిలాసఫీ',

కొంత మంది 'ఇది కష్టం, ఇది చాలా కష్టం' అంటుంటారు. నిజమే, ఇది కష్టం. అందువలన ఫలితం సాధించడానికి నువ్వు మరింత శ్రమపడాలి. నీ కలను సాకారం చేసుకోవడానికి నువ్వు పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. తీవ్ర పోరాటం చెయ్యాలి. పోరాడిన కొలదీ నువ్వు బలవడతావని గుర్తించు. నువ్వు కిందపడిపోవచ్చు. కానీ మళ్లీ చేస్తూ ఉండు. మళ్లీ పోరాడు. ఓటమిని అంగీకరించడానికి నిరాకరించేవారు. అరుదుగా మాత్రమే ఓడుతారు.

జీవితంలో ఒక వైరుధ్యం ఉంది. విజయం ఎప్పుడు కూడా సుఖాల మీద కాక అసౌకర్యాల పునాది మీద నిర్మించబడుతుంది. సంఘర్షణలకు సిద్ధమయ్యేవారు, సంఘర్షణల ద్వారా ఎదిగేవారు గెలుస్తారు. అలా కానివారు ఓడిపోతారు.

పోరాటం విజయసాధకుల్ని సృష్టిస్తుంది. మైకేల్ జోర్డాన్, జార్జ్ ఫోర్మన్లు విజయం సాధించారు. తాము గెలవడం ఇతరులు చూసేలా చెయ్యడానికి తమ సంఘర్పణ చూడనిచ్చారు. ఇతరులు తమ పెనుగులాట చూస్తారని భయపడలేదు. నువ్వు విజయం సాధించాలంటే వైఫల్యమంటే భయపడకూడదు. వైఫల్యాల నుంచి ఎదగడం నేర్చుకోవాలి.ఆలోచనలు పైసకు పది. కానీ ఆలోచనలను ఆచరణలో పెట్టే వ్యక్తి వెల కట్టలేనివాడు.నువ్వు నీ ధనం, కాలం ఆలోచనలు, సరిగ్గా నిర్వహించడం నేర్చుకోనంత వరకూ విలువైనది ఏదీ ఎన్నడూ సాధించలేవు.

జయం ఒక చాయిస్.నీ భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే నిన్ను నిర్మించుకోవడం. నీ కంపెనీని నిర్మించడానికి ఉత్తమమైన పద్ధతి నీ ఉద్యోగులను నిర్మించడం.మనుష్యులంతా తమ ప్రయత్నాల ద్వారా నిర్మించబడినవారు. విజయం సాధించినవారు మాత్రమే ఈ విషయం అంగీకరించడానికి సిద్ధపడతారు.నీ సమస్యలను కాదు, దీవెనలను గుర్తుంచుకో, నీ కలలకోసం ఎప్పుడూ పోరాడు. గుర్తుంచుకో. కల మహత్తరమైనదైతే... సమస్యల గురించి చింతించకు.

మీరు మీ జీవితాన్ని నిర్మించుకోగలరు. లేదా మీ పరిస్థితులకు బలి కాగలరు; నిర్ణయం మీదే" - రెడెన్ బాక్

ఎంపిక శక్తిని అర్థం చేసుకోకపోతే విజయం మన వశం కాదు. విజయం అన్నది ఒక ఎంపిక. విజయం సాధించాలంటే మనం విజయాన్ని ఎంచుకోవాలి.

 “నువ్వు విజయం సంభవించాలనే నిర్ణయం తీసుకుంటే తప్పు విజయం సంభవించదు. విజయం అన్నది అదృష్టం కాదు. . దైవన్యాయం కాదు. పుట్టుకతో కాకతాళీయంగా సంభవించేది కాదు. విజయం ఒక ఎంపిక" (విజయం ఒక ఛాయిస్ పుస్తకం నుండి)

మన అదుపులో లేని ఎన్నో విషయాలు ఈ విషయాలు ఈ పయనంలో సంభవిస్తూ ఉంటాయి. కానీ అంతిమంగా విజయం అన్నది ఛాయిస్. పరాజయాన్ని విజయంగా మార్చుకునే కీలక సూత్రం మొదట నిర్ణయం తీసుకోవడం. జీవితంలో ఏ కార్యకలాపాలలోనైనా, విజయానికి మొదటి మెట్టు నిర్ణయం. దురదృష్టవశాత్తు చాలా మంది నిర్ణయం తీసుకోవడానికి నిరాకరి స్తారు. అందువలన వారు నష్టపోతుంటారు.మన జీవితం కోసం మనం నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే జీవితం మన కోసం నిర్ణయాలు తీసుకుంటుంది.            

భవితవ్యం కాకతాళీయం కాదు, అది ఒక ఎంపిక. అది ఎదురు చూడవలసిన విషయం కాదు; సాధించవలసిన విషయం...

                                              - విలియం జెన్నింగ్స్ బ్రియెంట్

 సమస్యలు, కష్టాలు ఉంటాయని ఊహిస్తూ, పట్టుదలలో పయనించడమే మనం చేయాల్సింది. దానికి ఈ కింది అంశాలు ముఖ్యమైనవి.

* ఏమి కావాలో, ఎక్కడికి వెడుతున్నామో తెలుసుకోవాలి.

ప్రయత్నం ఎప్పుడు విరమించకూడదు. పట్టు విడవకూడదు.

* లక్ష్యాలు నిర్ణయించుకోవాలి.

• ప్రణాళిక వేసుకోవాలి.

* కేవలం ఈ రోజు గురించి మాత్రమే కాకుండా, రేపటి గురించి కూడా ఆలోచించాలి.

* కష్టపడి పని చెయ్యా లి.

 * నేర్పుగా కదలాలి.

* అనుకున్నది సాధించేవరకూ పయనం ఆపకూడదు.

లక్ష్యానికి పూర్తిగా బద్దులమై, పరాజయాలు లక్ష్యానికి అడ్డు పడ నివ్వకుండా ముందుకు సాగాలి. మన లక్ష్యం మీదే దృష్టి కేంద్రీకరించినప్పుడు, వాడుకగా పరాజయాలను విజయాలుగా మార్చడం మొదలుపెడతాం. "విజయానికి దృష్టి ఆరంభ బిందువు, ఒక పరాజయాన్ని విజు యంగా మార్చడానికి ఆరంభ బిందువు. అయినా లక్ష్యం ఉన్నచోట వ్యతిరేకత ఉంటుంది. ఉండవచ్చు కాదు...... ఉంటుంది.

పట్టుదలతో పయనమే విజయ రహస్యం..

   *     *     *

 

 



Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ