వైఫల్యాలు ఛేదించండి!
వైఫల్యాలు ఛేదించండి!
“విజయాన్ని కాంక్షించే వ్యక్తి పైకి చేరుకునే ప్రక్రియలో
ఓటమిని ఒక ఆరోగ్యకరమైన, అనివార్యమైన భాగంగా చూడాలి.”
-జాయిస్ సోదరులు
ఇక లాభం లేదు ...వదిలెయ్యాలి అని
అనుకోకముందు మన కొత్త లక్ష్యాలను అందుకునే
ప్రయత్నాన్ని ఎన్ని సార్లు చేస్తాం? సగటున ఒకసారికన్నా
తక్కువ. మొదటి ప్రయత్నం చేసే లోపలే చాలా మంది దాన్ని విడిచిపెట్టేస్తారు. దానికి
కారణం ఇబ్బందులూ, సమస్యలూ, ఇటువంటి
దారికి అడ్డుపడేవన్నీ వాళ్ళు ఇంతకు ముందెన్నడూ చెయ్యనిది ఏమైనా చేద్దామని
నిర్ణయించుకున్న మరుక్షణం కనబడతాయి.
నిజం
చెప్పాలంటే పరాజయాన్ని పొందేవారికన్నా విజేతలే ఎక్కువగా ఓటమిని చవిచూస్తారు.
విజేతలు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు, పడిపోతారు, లేచి నిలబడతారు, మళ్ళీ ప్రయత్నిస్తారు, మళ్ళీ గెలిచేదాక ప్రయత్నిస్తూనే ఉంటారు. పరాజయం పొందే వాళ్ళు చాలా తక్కువ
ప్రయత్నాలు చేస్తారు, అది కూడా ప్రయత్నం చేసినప్పటి మాట!
చాలా త్వరగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, అంతకుముందు
చేస్తున్న పనినే కొనసాగిస్తారు.
మన
లక్ష్యాలను సాధించేలోపల ఎన్నో సార్లు మనం ఓటమిని ఎదుర్కొంటాం,
మనం చేసే ప్రయత్నం సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి.
మనం తప్పకుండా పొందబోయే విజయాన్ని చేరుకునే దారిలో ఇలాంటి ఓటములూ, తాత్కాలికంగా కలిగే వైఫల్యాలు మనం చెల్లించే ధరగా భావించాలి. హెన్రీ ఫోర్డ్ ఒకచోట ఇలా
అంటాడు –“మళ్ళీ మరింత తెలివితేటలను ఉపయోగించి ప్రయత్నించేందుకు దొరికే అవకాశం తప్ప
ఓటమి మరేదీ కాదు.”
“ఎప్పుడూ
మీరు దేన్ని గురించి ఆలోచిస్తారో అలాగే రూపొందుతారు. సమస్యలూ, ఇబ్బందులూ ఉన్నప్పుడు ఒక
ప్రత్యేకమైన పద్ధతిలో ఆలోచిస్తారు. దాన్నే
‘పరిష్కార దిక్సూచి’ అని అనవచ్చు.
విజేతలెప్పుడూ పరిష్కారాల గురించి
ఆలోచిస్తారు. సమస్య దిశగా చూసేవాళ్ళు ఇబ్బందులు గురించి, సమస్యల
గురించి మాత్రమే ఆలోచిస్తారు. పరిష్కారం దిశగా చూసేవాళ్ళు నిరంతరం వాళ్ళ దారికి
అడ్డుగా వచ్చే ఇబ్బందులను ఎలా దాటాలి? ఎలా తప్పించుకుని
ముందుకు పోవాలి? అనే ప్రయత్నంలో మార్గాలు వెతుకుతూ ఉంటారు.
సమస్య
దిశగా చూసేవాళ్ళు తమ సమస్యల గురించి ఆపకుండా మాట్లాడతారు,
వాటిని కలిగించింది ఎవరు, ఏది అనీ,
తాము ఎంత బాధపడుతూ, కోపగించుకుంటూ ఉన్నారో, అటువంటి సమస్యలు తలెత్తటం ఎంత
దురదృష్టకరమో చెప్తూ ఉంటారు. పరిష్కారాల దిశగా చూసేవాళ్ళు ప్రశ్నలు మాత్రమే
వేస్తారు. దీన్ని మేమెలా పరిష్కరించగలం? ఆ తర్వాత పనికి
పూనుకుంటారు, సమస్యతో తలపడతారు. మనకూ,
మనం సాధించాలనుకున్న దానికీ మధ్య ఏవోరకమైన సమస్యలు,అడ్డంకులు
వస్తాయి. అందుకే ఒక్కోసారి విజయానికి సమస్యలను పరిష్కరించే సామర్ధ్యం అని నిర్వచనం
చెప్తారు.
సమస్యను
పరిష్కరించటం ఒక కళ. పరిష్కారాల మీద దృష్టి పెట్టిన కొద్దీ,
మరిన్ని మంచి పరిష్కారాలు తడతాయి. సమస్యలను పరిష్కరించటంలో మనం నేర్పు
సంపాదించినకొద్దీ, ఆ తర్వాత ఎదురయ్యే ఒక్కో సమస్యనీ మరింత
వేగంగా పరిష్కరించగలుగుతా౦. ఇందులో మనం మరింత నేర్పునీ,
వేగాన్ని సాధించినకొద్దీ, మరిన్ని పెద్దవీ, ఖరీదైనవీ సమస్యలు పరిష్కారం కోసం మన ముందుకి వస్తాయి.
మనం
లక్ష్యంమీద నిజమైన ఆసక్తి, తీవ్రమైన కోరిక ఉంటే దానిని చేరుకునే
మార్గంలో ఎదురయ్యే అడ్డంకులనీ, సమస్యలను ఎదుర్కునే సామర్ధ్యం
మనం సంపాదించుకోగలుగుతాం.
‘ద
గోల్’ అనే తన పుస్తకంలో ఎలియాహూ గోల్డ్ ర్యాట్ అనే రచయిత ‘ నిర్బంధాల సిద్ధాంతం’
(The Theory Of Constraints) గత కొద్ది
శతాబ్దాలలో వచ్చిన ముఖ్యమైన విప్లవాత్మక ఆలోచనలలో ఒకటి. ఈ సిద్ధాంతం ప్రకారం, మనకూ మనం సాధించాలనుకున్న దానికీ మధ్య నిర్బంధం,
మనల్ని హద్దుల్లో పట్టి ఉంచే అంశం ఒకటుంటుంది. మనం వెళ్లదల్చుకున్న చోటుకు ఎంత
వేగంగా అనేది నిర్ణయించేది యిదే.
ఉదాహరణకు మనం ఒక ఫ్రీ వేలో కారు నడుపుతున్నాం అనుకుందాం. అక్కడ ట్రాఫిక్ కోసం ఏదో నిర్మాణం
జరుగుతూ ఉంటుంది. అందుకని కార్లన్నీ ఒకే
లేన్ లో ఒకదాని వెనక ఒకటి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇరుకు దారిలో ఏర్పడే ఆ అడ్డంకే
మనం గమ్యాన్ని ఎంత వేగంగా చేరుకోగలమనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆ ఇరుకు దారిలోంచి
మనం కారును పోనిచ్చే వేగం మీద మన మొత్తం ప్రయాణం తాలూకు వేగం చాలావరకు ఆధారపడి
ఉంటుంది. ఎటువంటి పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్నా, మనం ఒక
నిర్బంధాన్ని, ఇరుకు దారిని దాటక తప్పదు. దాన్ని కచ్చితంగా
గుర్తించి, ఆ ముఖ్యమైన అడ్డంకిని అధిగమించేందుకే మన
శక్తినంతటినీ కేంద్రీకరించాలి.
మనకూ,
మన లక్ష్యాలకూ మధ్య ఉండే నిర్బంధాలకు 80/20 నియమం వర్తిస్తుంది. 80 శాతం
నిర్బంధాలు మన మనసులోనివే అంటుంది ఈ నియమం. బైట ఉండేవి కేవలం 20 శాతమే. విజయానికి
రెండే రెండు పెద్ద అడ్డంకులు. భయం, అనుమానం. అసలు
అన్నిటికన్నా ముందుగా భయపెట్టేవి ఓటమి, పేదరికం, నష్టం, ఇబ్బంది తిరస్కారం లాంటివి. ఒక వ్యక్తిని
ప్రయత్నించకుండా వెనక్కి లాగేవి ముందుగా ఇలాంటివే. అందుకే లక్ష్య సాధన కోసం ఒకసారి
కూడా ప్రయత్నించని వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. లక్ష్యం గురించి ఆలోచించిన వెంటనే
ఈ భయాలు వాళ్ళని తరుముకొస్తాయి. ఒక చిన్న మంట మీద ఒక బాల్చీడు నీళ్ళని ఒంపినట్టు, వాళ్ళ కోరిక
చప్పగా చల్లారిపోతుంది.
రెండో
రకం, మానసిక అడ్డంకి. ఇది భయానికి చాలా దగ్గర సంబంధం కలది. తమ మీద తమకు
అపనమ్మకం ఉండటం. తమ సామర్ధ్యం మీద తమకి అపనమ్మకం ఉంటుంది చాలా మందిలో. దీని వల్ల
ఇతరులతో తమని పోల్చుకుని తక్కువగా అంచనా వేసుకుంటారు. ఎందుకోగాని అవతలి వ్యక్తి తనకన్నా మెరుగైనవాడనో,తెలివైనవాడనో, సామర్ధ్యం కలవాడనో అనుకుంటారు. అదృష్టవశాత్తూ
అనుమానం, భయం అనే భావాలలో ఏదైనా మంచి ఉంది అంటే, అవి రెండు నేర్చుకుంటే వచ్చేవే. పిల్లలు ఈ ప్రపంచంలోకి భయాలూ, అనుమానాలు అనేవి లేకుండానే అడుగు పెడతారు. ఇక నేర్చుకున్నది ఏదైనా సరే, దాన్ని వదిలేయటం కూడా సాధ్యమే. దానికి అభ్యాసం,
పునరుక్తి అవసరం.
అనుమానానికి, భయానికి ముఖ్యమైన
విరుగుళ్లు -ధైర్యం, విశ్వాసం. మనలో ధైర్యం, విశ్వాసం ఎంత హెచ్చుగా ఉంటే భయం, అనుమానం అంతా
తక్కువ స్థాయికి దిగిపోతాయి. మనం సాధించాలనుకున్న దానికి మనకు మధ్య తలెత్తే
అడ్డంకి లేదా సమస్యకు ఎక్కడో అక్కడ సామాన్యంగా ఒక పరిష్కారం ఉంటుంది. మనం
చెయ్యవలసినదల్లా మన లక్ష్యాన్ని వేగంగా చేరుకోవటానికి ఏం చెయ్యాలన్నది స్పష్టంగా
తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ అడ్డంకిని దాటే౦దుకు మన
దృష్టిని, సమయాన్ని ఆ పని మీద కేంద్రీకరించాలి.
ఈ
ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
పరిష్కారం ఉంటే తెలుసుకోండి. లేకపోతే ఏమీ ఫరవాలేదు. ఎందుకంటే ఆ పరిష్కారాన్ని మీరే
కనుగొనవచ్చు.
*
* *

Comments
Post a Comment