చీకటి నుండి వెలుగులోకి
‘సప్తవర్ణాల కంకణాలతో
సప్తస్వరాల కింకిణులతో
ప్రతిదినం దీపాలు వెలిగిస్తూ
భద్ర మహిళలు నడయాడే
మంగళ ప్రపంచం కోసం
కలలు కంటూ చీకట్లో కూచున్నాను
-డాక్టర్ దాశరథి
సమాజంలో
ఏ సమస్య అయినా అందరికి ఒకేలా అనిపించదు. స్త్రీ రూపంలో దీని వైరుధ్యం ఇంకొంచెం
ఎక్కువే. దీనికి కారణం కులం, మతం పేరిట స్త్రీలకు ఏర్పరచే వివిధ
రకాల వాతావరణాలు. కనుక ఇక్కడ ఏ సమస్యను “అందరికి చెందినది” అని
వర్గీకరించలేము. కానీ ఎన్ని వైరుధ్యాలు ఉన్నా “పరిష్కారం” అనే చోటుకి వచ్చేసరికి సమైక్యత
గోచరిస్తుంది. “నిర్భందిస్తే పిల్లి అయినా పులి అవుతుంది”
అనే సామెత అందరికి తెలిసిందే. ప్రతీసారి ఓ అతిగా పరిణమించిన పరిస్థితే యోగ్యమైన
వాతావరణానికి ప్రేరణ అవుతుంది.
ఎన్నో
ఏళ్ల నుండి మేలిముసుగు కింద మగ్గిపోయారు వారు. మదర్సాలలో నేర్పించే అరబిక్
లాంటివీ తప్ప ప్రపంచాన్ని శాసించే విద్యకు చాలా దూరం వారు. 'తలాక్..
తలాక్.. తలాక్..'అని భర్త ఎప్పుడు అంటాడో తెలియని భయం. భర్తకు
బహుభార్యత్వం ఉన్నా భరించాలి. బయటకు వెళ్లకూడదు. వెళ్లినా ముసుగుతోనే ఉండాలి.
భరించారు. . భరిస్తూనే ఉన్నారు. కానీ ‘పులి’ అయినా ఆమె ఈ సమస్యకు సంపూర్ణ పరిష్కారం కోసం పోరాడదాం అని అనుకుంది. సమస్యను
సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్లింది. ఆమె సైరాభానో! విజయం సాధించింది చివరకు. ఇది
ఓ రకమైన వాతావరణం. ఇంకొకవైపు చూద్దాం. ఆమె కళాశాలలో ఓ ప్రొఫెసర్, భర్తతో విభేదాల వల్ల విడిపోయింది. కానీ భర్త ఆమెను వదల్లేదు. “మంచి సంపాదనను
తెచ్చే భార్యను వదులుకోవడం అతనికి ఇష్టం లేదు. ఆమె మీద ఎన్నోసార్లు హత్యాయత్నాలు
చేశాడు. రక్షకభటులకు మొరపెట్టుకుంది. పోరాడింది చివరిదాకా. ఆఖరికి నడిరోడ్డుమీద ఆమె
మీద యాసిడ్ పోశాడు ఆ కీచకుడు. సుమారు నలభైరోజులపైన ఆసుపత్రిలో పోరాడి ప్రాణాలు
విడిచింది. ఆమె. ఆమే జరీనా. అందర్నీ ఒకే గొడుగు కింద తీసుకురాలేం. కానీ ఓ మంచి
మార్పు కోసం, వ్యక్తిగత ప్రగతి కోసం ప్రయత్నమే, పోరాటమో చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోలేని ప్రత్యర్థి వర్గం పైశాచిక
ధోరణిని అవలంభిస్తుంది. తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కునే దిశలో స్త్రీ
ముందుకు కదిలినందువలన దీనిని ‘సమానత్వం’ ‘ప్రగతి’, అనాలా! ఆ ప్రయత్నంలో సమిధి అయిపోయినందుకు ‘ఓటమి’ అనుకోవాలా?.
“సమాన
సంపాదని సమానత్వం కాకపోవచ్చు. సమానత్వం అంటే కలిసి సమానంగా సంతోషాన్ని అనుభవించడం.
ఆ సమాన సంతోష పరిధికి స్త్రీ పురుషులిద్దరూ సమన్వయరీతిలో నిర్వహించలేకపోవదానికి
మూలాలు ఏమిటి? కుటుంబ సంబంధాలు, సమాజ సంబంధాలు
కన్నా ఆర్థిక ప్రగతి ముఖ్యమైనది అని అనుకోవడం వలనా? “మానవ
స్పర్శను మరిచిన ప్రతి ఒక్కడు చివరికి మృగమే అవుతాడు” ఆ స్పర్శ నేడు క్రమక్రమంగా
అంతరించిపోవడానికి కారణాలు ఏమిటి? నిర్భయ చట్టం లాంటివి
వచ్చాక కూడా అత్యాచారాలు ఆగలేదు. ఇంకా దారుణమైన అంశం ఏమిటంటే ఒక దారుణం చేసినా...ఎన్ని
దారుణాలు చేసినా ఒకటే శిక్ష అయినప్పుడు ఒకదానితో ఎందుకు ఆగడం?” అనే పశుప్రవృత్తి కూడా మనిషిలో ప్రవేశించడం. ‘సుడిగుండాలు’ సినిమాలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పశుప్రవృత్తి ప్రవేశించడానికి గల కారణాలను చూవడం జరిగింది. కుటుంబ సంబంధాల్లో
కొరవడిన ‘మానవ స్పర్శే’ పిల్లల్ని ఇంకో
(ప్రత్యామ్నాయం వెతుక్కునే ప్రక్రియలో మృగాలుగా మారున్తుందని చెప్పడమే ఈ చిత్రం
ఉద్దేశం. ఇలా వృత్తాంతాలు ఎన్ని చెప్పుకుంటూ పోయినా తిరిగి మామూలు కుటుంబం
దగ్గరికి వచ్చి ఆగిపోతాయి.
ఆత్మీయ
సంబంధాలు మినహా ఏ పరిష్కారం కూడా దీర్ఘకాలంలో నిలబడదని చెప్పకనే నిదర్శనాలుగా
నిలబడతాయి. చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం సాగిస్తున్న క్రమంలో కొన్నిసార్లు
వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నా.. “కొంతవెలుగు” తిరిగి చీకటికి దాసోహం అవుతూనే
ఉంది. ఈ క్రమంలోనే కనుమరుగైన మూలాల్ని గుర్తించి వాటిని ధృడపరచాల్సిన అవసరం ఉంది. ఒకే
పరిష్కారం అన్ని సమస్యలకు పనికిరాదు. ఎందుకంటే సమస్య తీవ్రత అన్ని వాతావరణాల్లో
ఒకేలా ఉండవచ్చు. కానీ సమన్య సృష్టించబడిన వాతావరణాలు వేరువేరుగా ఉంటారు. అప్పుడు
ఎదుర్కోవలసిన ప్రత్యర్థుల ధోరణులు కూడా మారుతూ ఉంటాయి. వీటన్నింటిని ఎదుర్కుంటూపోవడం
అంటే సమస్యల్ని పెంచుతూ, మళ్లీ ఇదే పరిష్మారాలలో సాగిపోవడమే! నిజమైన
వెలుగులో ప్రపంచం ప్రజ్వరిల్లాలంటే పరిష్కారం ఓ తాత్కాలిక ప్రమాణాల ఆధారంగా
నిర్మించబడింది కాకుండా దీర్హకాలంలో అదే పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు ఓ శాశ్వత
సరిహద్దు రేఖను గీసేలా ఉండాలి. అలా జరగాలంటే “మరమనుషులు”, “మానవ
స్పర్శ మనుషులు” గా పరిణామక్రమం పొందడం అనేది మానసికంగా
మొదలవ్వాలి. సాంకేతిక ప్రగతి మానవ సంబంధాల్ని శాసించినంత కాలం మానవస్పర్శ అనేది క్రమక్రమంగా కనుమరుగు అవుతూనే ఉంటుంది.
చీకటిలో
ఉన్నప్పుడు వెలుగు దీనికన్నా చాలా మెరుగ్గా ఉంటుందని అనిపిస్తుంది. కానీ చీకటిలోనే
మగ్గుతూ దానికే అలవాటు పడిపోయి దాన్నే వెలుగు అనుకుంటే ఇక చీకటి, వెలుగు
అనే తేడాలు కూడా ఉందని స్తబ్దత ఏర్పడుతుంది. చీకటి వెలుగుల దోబూచులాటలో నిజమైన
వెలుగును ‘పరిష్కార దిక్సూచి’ గా చేసే
రోజు రావాలని ఆశిద్దాం!
*
* *

Comments
Post a Comment