వాలంటైన్స్‌ డే వరమా? శాపమా?

వాలంటైన్స్‌ డే వరమా? శాపమా?

                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

మనిషి జీవితంలో (ప్రేమ ఒక అనుభూతి, ఒక తపన, ఒక ఆర్తి ఆవేదన. మనకంటూ ఒక మనిషి కావాలనే తపనే (ప్రేమ. తను ప్రేమించిన మనిషి కోసం ప్రేమికులు ఏదైనా చేస్తారు. ప్రేమతో ఏదైనా చెబితే అది శాసనమే. ప్రేమించిన మనిషి కోసం కన్నవారిని కూడా వదిలి వచ్చేస్తున్నారంటే అది ఎంత బలమైందో అర్ధమవుతుంది.

ప్రేమ ఒక గొప్ప శక్తి. అది మనిషికి ఓ ఇన్స్‌పిరేషన్‌. జీవాన్ని జీవితాన్ని ఇస్తుంది. జీవితంలో ఏదో ఒక దశలో ఎవరినైనా ప్రేమించని మనిషంటూ ఉండడు. ఈ లోకం ప్రేమతోనే నడుస్తుంది. నిజం చెప్పాలంటే ప్రేమ అనేది దైవత్వం, అది అజరామరం. లవ్  ఈజ్‌ ఫరెవర్‌. ప్రేమ దేవుడంత మహోన్నతమైంది. అలౌకికమైన అద్భుత (ప్రేమ సౌందర్యం. ప్రేమను పొందడం వరం. ఎవరి (ప్రేమకూ నోచుకోకపోవడం అంతులేని విషాదం. ప్రేమలేని మనిషి లేడు, పేమ లేని జీవితం లేదు. ప్రేమలేని జీవితం లోకంలో లేదు. మృదుమధురమైన (ప్రేమ ఒక గొప్ప శక్తి. సృష్టిలో ప్రతి ఒక్కటి పరిణామక్రమంలోనే పునరుజ్జీవనం చెందుతూ ఉంటుంది. ప్రేమ అంటే పైన చెప్పినంత పవిత్ర భావన, 15-20 ఏళ్ల పూర్వం ఉండేది పై తరహా (ప్రేమ, కానీ నేడు ఆ (ప్రేమ అదే భావనతో లేదన్నది వాస్తవం. గ్రీటింగ్‌ కార్డులు, గులాబీ గుత్తులు, గిఫ్టులు... పార్కులు సినిమా హాలులు బైక్‌ మీద షికార్లు. వేలంటైన్‌ దే అంటే ఇంతకు మించి ఏమున్నది నేడు?

          ప్రేమ అనుభూతిని తెలుసుకునే లోపలే బ్రేకప్‌లు కొత్త ప్రేమ కోసం వెతుకులాటలు. .నేడు వేలంటైన్స్‌ డే ప్రేమను అనుభూతికి ఆస్వాదించే రోజా లేకపోతే కొత్త ప్రేమల వెతుకులాటకై పరితపించే రోజా? ఒక వ్యక్తితో ఎన్ని అపార్థాలు తలెత్తినా, ప్రేమతో పరస్పరం అర్ధం చేసుకొని, ఆ జ్ఞాపకాలను మధురానుభూతులగా తలచుకొంటూ సాగాల్సిన వేలంటైన్స్‌ దే.. నేడు నిజంగా వరమా? శాపమా?

          ప్రేమిస్తే జరిగేవి రెండే. ఒకటి (ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకొని జీవితం పంచుకోవడం. లేకపోతే ఆ వ్యక్తిని మర్చిపోయి ఇంకో వ్యక్తితో కొనసాగడం. పూర్వం తాము ప్రేమించిన వ్యక్తిని ఏవైనా కారణాల వల్ల పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే విడిపోయి ఉండేవారు. కానీ నేడు అది ఒక ఉన్మాదంగా కూదా మారిపోయింది. ప్రేమించిన తర్వాత ఏవైనా అడ్డంకులు ఏర్పడి ప్రియురాలు దక్కని పరిస్థితి ఏర్పడితే ఆమెని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అది మితిమీరిన పైశాచిక ప్రేమ కోణం. ఇది నాణేనికి ఓవైపు.

           ఇంకో కోణంలో చూస్తే నేటి యువత ప్రతీ విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అది వస్తువులకే పరిమితం కాకుండా మనుషులకి కూడా విస్తరించడం శోచనీయం. ప్రేమతో ఒక వ్యక్తితో ఉన్నాక, ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసాక, (ప్రేమతో వారిలోని లోపాలను అంగీకరించి దానికి తగ్గట్టుగా వెలిగే ప్రేమ స్పర్శ నేటి ప్రేమల్లో కొరవడుతుంది. ఈ వ్యక్తి లేకపోతే ఇంకొకరు అన్నది ఓపెన్‌ కల్చర్‌ అనుకోవాలో, యువతలో స్థిరత్వాన్ని స్తంభింపజేస్తున్న వినాశనం అనుకోవాలో అన్నది సమాజంపై, కుటుంబాలపై, వ్యక్తులపై పడే ప్రభావాన్ని బట్టి ఎవరికీ వారు అభిప్రాయానికి రావాల్సిన అంశం.

          ఎప్పుడైతే సోషల్‌నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌ ఫేస్‌ బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటీవి వెలుగులోకి వచ్చాయో అప్పుడే “ప్రేమను వినిమయ వస్తువుగా పరిగణించే సంస్కృతి కూడా పెరిగిపోయింది. నేడు వాట్సప్‌, ఫేస్‌ బుక్‌ అలాగే కొన్ని పత్రికల్లోనూ ఈ ప్రేమల మీద వచ్చే జోకులు దాని ప్రభావమే. ఓ గర్ల్‌ ఫైండ్‌ ఉండాలంటే - ఆమెకు గిఫ్ట్‌లు ఇవ్వాలి, షాపింగ్‌ చేయించాలి, సినిమాలకు తీసుకువెళ్లాలి. ఇవన్నీ చేస్తేనే ఆ అమ్మాయి నాతో ఉంటుంది అనే వస్తువిషయ తాపత్రయ కోణంలోనే నేటి ప్రేమలు కొనసాగడం వల్ల ఇచ్చిపుచ్చుకోవడాల్లో భేదాలు వచ్చినప్పుడు ప్రేమలు ముగుస్తున్నాయి.

                   ప్రేమ అనేది ఓ భావన, ఓ అనుబంధం అన్న సంస్కృతి నుండి క్రమేపీ వస్తు వినిమయ అంశంగా పరిణమించాక దాన్ని దీర్ఘకాల (ప్రేమగా నిలుపుకోవాలన్న భావన ప్రేమికుల్లో అంతం అవుతుంది. నేడు దీనివల్లే ప్రేమ ఓ పరోక్ష వ్యాపారంగా మారేంత విషతుల్యంగా వైఫల్యదశలో పయనిస్తుంది. నేటి యువత (ప్రేమను 'పవిత్రబంధం' అన్న కోణంలో కాక వస్తువుగా పరిగణించదానికి కారణాలు ఏమిటి? 

                   విచ్చిన్నమైన కుటుంబ వ్యవస్థ, సింగిల్‌ పేరేంటింగ్‌ సిస్టమ్‌లాంటి పోకడలవల్ల యువతకు తల్లిదండ్రులతోనో, బంధువులతోనో రోజుకి కొంత సమయం గడిపే అవకాశం కూడా ఉండటం లేదు. తమ కంటే పెద్దవారి మాటలు వినే వాతావరణం లేకపోవడం వల్ల వారికి అనుబంధాల విలువ తెలియకపోవడం వల్ల కూడా ప్రేమను ఒక యాంత్రిక ప్రక్రియగా పరిగణించడం జరుగుతుంది.

          “ప్రేమ ఒక సక్రియాత్మక శక్తి. మనిషికీ, సమాజానికీ మధ్య సమన్వయాన్ని ఏర్పరచే ఒక సాధనం వైయుక్తికతని పరిరక్షిస్తూ ఒంటరితనం నుంచ్చీ, పరాయితనం నుంచీ వ్యక్తుల్ని విముక్తం చేసే ఒక ప్రక్రియ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై కూడా తిరిగి ఎవరికి వారు మిగిలివుందడగల అవకాశానికి అందమయిన ఒక అభివ్యక్తి సమాన హృదయాల సంవేదనల మధ్య ఒక సున్నితమయిన సర్దుబాటు. నమ్మకం, నిజాయితీ, నిబద్ధత, సహనం, సమానత్వం, సహజీవనం హక్కులు, బాధ్యతల సంయుక్త సమాగమం. ఇద్దరు వ్యక్తులు తమ అస్తిత్వాలను పణంగా పెట్టి 'నేను నుంచి 'మనం'” దిశగా ఇంద్రియ చైతన్యంతో చేసే ఒక అద్వైత శీఖరారోహణం. పరస్పర సంఘర్నణని పరిహరించే ఒక నైతిక పర్యావరణం. ప్రజాస్వామ్యం ప్రేమ అంతిమ సారాంశం” అన్నది ఓ ప్రముఖ రచయిత అభిప్రాయం. ప్రేమకు అంత విసృతి ఉన్నది. ఇంకా లోతుగా పరిశీలిస్తే ప్రేమకు నిర్వచనం ఇవ్వడం కొన్నిసార్లు అసాధ్యం కూడా. ఎందుకంటే అది అందరి మధ్య ఒకేలా ఉండదు.

           'మనం ఒక (ప్రేమబంధం నుండి ఏం ఆశిస్తామన్నది (ప్రేమ” మీద ఆధారపడి ఉండదు. మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి (ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండడం, మరికొందరికి ప్రేమ అంటే ఇద్దరు అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచించడం, ఒకే అభిరుచి కలిగి ఉండడం. ఇంకొకరికి ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండడం, మరికొందరికి ప్రేమ అంటే ఇద్దరు అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచించడం, ఒకే అభిరుచి కలిగి ఉండడం. ఇంకొకరికి ప్రేమ అంటే ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేయడం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి ఇవేవీ ప్రేమ సమగ్ర స్వరూపాలు కావు. ప్రేమ ఎప్పుడూ సాపేక్షమైన విలువే. అందుకే తరచుగా స్త్రీ, పురుషులు “నాకు నీమీద ఉన్నంత (ప్రేమ నీకు నా మీద లేదు అని నిందలు వేనుకుంటుంటారు.

                   ప్రేమకు  ఎవరి కొలమానాలు వారివి. కానీ ప్రేమ గురించి ఒకటి మాత్రం నిజం. అది చచ్చిపోతే మళ్లీ బతికించలేం. బలవంతంగా బతికించాలని ప్రయత్నిస్తే అది 'ఇన్‌ డిఫరెన్స్‌'గా మిగిలిపోతుంది. సోమర్సెట్‌ మామ్‌ అన్నట్లు “ఇన్లిఫరెన్స్‌' అన్నది ప్రేమకు అసలైన చావు. ద్వేషం కంటే కూడా బాధాకరం. ఎందుకంటే అది శాశ్వతం. మరైతే ప్రేమను నిలుపుకోవడానికి ఏం చేయాలి? దీనికి కూడా శాశ్వత పరిష్మారాలు, చిట్కాలు లేవు... కానీ, ఒకరి నుంచి ఒకరు ఎక్కువఆశించడం మానెయ్యాలి. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఎంత ఉండాలో ఒకరికొకరు స్పేస్‌' ఇచ్చుకోవడం కూడా అంతగానూ ఉందాలి. అలా స్పేస్‌ ఇచ్చుకున్నప్పుడు అవిశ్వాసాలు, అనుమానాలు, ఈర్యలు తలెత్తవు.         నేటి యువత ప్రేమను హృదయ  సంబంధ అంశంగా భావించడం, స్థిరత్వంలో ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం అన్న ఆలోచనా పరిధిలోకి మళ్లితేనే ఆరోగ్యకరమైన (ప్రేమ ఎప్పటికీ నిజమైన వ్యాలంటైన్‌గా ఉండిపోతుంది. ఒక వ్యక్తి పట్ల గాఢమైన ఇష్టానికి లోనవ్వడం, ఆ వ్యక్తి సాన్నిహిత్యంలో (పేమ, కులం, మతం, డబ్బు, హోదాలాంటి వాటికి తావులేకుందా, ఏ నిబంధనలు, అడ్డుగోడలు, పరిధులు లేని ప్రేమ పునాదిగా విలసిల్లే సమాజం ఏ దేశానికైనా అవసరం, ఆరోగ్యకరం. అటువంటి సున్నిత స్పర్శతో కూడిన ప్రేమ సమాజం నేటి యువత న్పర్శతో మరల నిర్మించబడాలని ఆశిద్దాం.

   *    *    *  


























Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ