ఉద్యోగినికి సమిష్టి ప్రత్సాహం అవసరం

 

ఉద్యోగినికి సమిష్టి ప్రత్సాహం అవసరం

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


ప్రపంచ శ్రమ గంటలలో మహిళలు మూడింట రెండొంతులు పనిచేస్తున్నారు. అయితే ఆదాయం మాత్రం పదిశాతమే. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో గర్భవతులుగా ఉన్నప్పుడు మహిళల మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. భారతదేశం, చైనాలలో లింగనిష్పత్తి తగ్గిపోతుంది. దారిద్ర్యం, దురాగతాల్లో మహిళలే బలవుతున్నారు. పురుషులతో సమానంగా హక్కులు,అవకాశాలు కలిగి ఉన్నామని ప్రపంచంలో ఎక్కడా మహిళలు చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రపంచ ఆస్తిలో మహిళలకు ఒక్కశాతంపైనే హక్కు ఉంది. ప్రపంచదేశాధినేతలలో మహిళలు 5శాతం కంటే తక్కువ సంఖ్యలో ఉంటున్నారు.13 కోట్లమంది 6-11 ఏళ్ల వయసున్న బాలల్లో పాఠశాలలకు వెళ్లని వారిలో 60 శాతం మంది బాలికలే. 
 భారత సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానత అన్నిరంగాల్లో ఉంటుంది. అది ఆడ శిశువు జన్మించిన నాటి నుండి మహిళ చావు వరకు ప్రతిబింబిస్తోంది. కుమారుల కంటే కుమార్తెలను కుటుంబానికి భారంగా వరిగణిన్తున్నారు. ఈ క్రమాన్ని పరిశీలిస్తే స్రీ తనను తాను నిరూపించుకుని, అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కన్నా ఆమె సమాజ ఆమోదం పొందడం అన్నదే కష్టతరమైనది. పొంచి ఉన్నప్రమాదం అపరిచితుల నుండి వస్తుందో లేకపోతే ఆస్తల నుండి వస్తుందో ఆమె పసిగట్టేలోపే ఆమె అకృత్యాలకు బలైపోతుంది.
ఇది బాహ్య సమాజపు కోణం. నాణేనికి రెండోవైపు చూస్తే కుటుంబపరిసరాల్లో మగువ ఆలోచనా స్వేచ్చా పరిధి కూడా పరిమితమైనదే. నేటిపరుగుల ప్రపంచంలో పురుషులు ప్రతిభ ప్రదర్శిస్తే సరిపోతుంది. కానీ స్రీ ప్రతిభతో పాటు, సమస్యను పరివ్మరించే సామర్జాన్ని, ప్రతి సందర్భంలోనూ ప్రదర్శించకపోతే ఆమెను సమానంగా చూసే పరిస్థితులు లేవు.
“ఒకప్పుడు స్రీలు ఉద్యోగాలు అంటూ కాలు బయటపెట్టని రోజులే బాగున్నాయి. అలా ఉండి ఉంటే స్రీల మీద దాడులు చాలావరకు తగ్గుతాయి అని కొందరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఎంతవరకు సమర్థనీయం? నేటి జీవనశైలికి సరితూగేట్టు సంపాదించే పురుషులు ఎంతమంది ఉన్నారు?కుటుంబ బాధ్యతలో భాగం ఆమె తీసుకుంటున్నదే తప్ప అది అమె అభిజాత్యం కాదని గుర్తించి, ఆమెను గౌరవించే పురుషులెందరు? అక్కడ మొదలయ్యేఇగోలు, చివరికి ఎటు దారితీస్తున్నాయి? పిల్లలపై ఈ పరిస్థితులు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? ఇటువంటి నమస్యలకు మూలాలు ఏమిటి?
స్త్రీలు “వర్కింగ్‌ మెన్‌ “ను (పనిచేసే పురుషులు) ఆమోదించి గౌరవిస్తున్నారు.కానీ చాలామంది పురుషులు 'వర్కింగ్‌ వుమెన్‌' సంస్కృతిని మనస్పూర్తిగాఆహ్వానించలేకపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ బాంబే హైకోర్టులో అప్పీలైన ఓ కేసు. తన భార్య తనకు రాగానే మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని, రుచికరమైన వంటలు వండి పెట్టడం లేదని.. అందుకే విడాకులు కావాలని ఓ భర్త కోర్టులో కేసు వేశాడు. ఆ భార్య కూడా ఓ ఉద్యోగిని. కోర్టు ఈ కేసును కొట్టేసింది. ప్రీ బయటికెళ్లి ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఆ ప్రతిభకు గుర్తింపు పక్కన పెడితే ఆమె చేస్తున్న పనిని హర్షించే కోణం చాలావరకు కనిపించడం లేదు.
 స్త్రీ ఉద్యోగం చేయడం అన్నది ఓ సాధారణ అంశంగా,పరస్పర గౌరవాన్ని ఇంటి బాధ్యతలను కూడా పంచుకోవలసిన విషయంగా స్వాగతించే రోజులు ఇంకా రాలేదనే చెప్పాలి. వర్కింగ్‌ వుమెన్‌ ను గౌరవించే సంస్కృతి రానంతవరకు స్రీ సాధికారత అన్నది ఎండమావే. అటువంటి  సంస్కృతి  రావాలంటే వర్మింగ్‌ వుమెన్‌ కష్టాన్ని వాస్తవంగా గుర్తించి ఆమె ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వాతావరణం ఆ ఇంట్లో ఉంటే చాలు. అది కుటుంబానికి సంబంధించిన సమిష్టి ప్రోత్సాహక కుటుంబ వాతావరణం ప్రతి వర్కింగ్‌ వుమెన్‌ ఇంట్లో వెల్లివిరియాలని ఆశిద్దాం!
     *   *   *  






Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ