సక్సెస్ అంటే సాగిపోవడమే..!
సక్సెస్
అంటే సాగిపోవడమే..!
-రచన శ్రీ దత్త(శృంగవరపు రచన)
"ఆ శక్తి ఏమిటంటే- నేను చెప్పలేను! కానీ దాని ఉనికిని మాత్రం నేను గుర్తించాను.
ఒక వ్యక్తి తనకేం కావాలో ఖచ్చితంగా నిర్ధారించుకుని, దాన్ని
సాధించేంతవరకూ విడిచిపెట్టకూడదని మనసులో సంకల్పించుకున్నప్పుడు మాత్రమే ఆ శక్తి అతనికి
అందుబాటులోకి వస్తుందని కూడా నేను తెలుసుకున్నాను. - అలెగ్జాండర్
సక్సెస్ అంటే ఇష్టం ఎవరికి ఉండదు! ప్రపంచంలోని ప్రతి
సిద్ధాంతానికి ఒక సూత్రం ఉన్నట్లే. సక్సెస్ ఓ సూత్రం ఉంది. ఆ సూత్రం ఏమిటంటే- లక్ష్యాన్ని సాధించడానికి
ఏం చేయడానికైనా సిద్ధపడి పోవడం". కానీ ఏం చేయడానికైనా సిద్ధపడిపోవడం
నుండి చట్ట వ్యతిరేకమైన, అనైతిక మైన, ఇతరులకు
హాని కలిగించే చర్యలన్నీ మినహాయించబడ్డాయి.
'ఏం చేయడానికైనా సిద్ధపడిపోవడం” అనేది ఒక మానసిక
దృక్పథం,'నాలక్ష్యాన్ని సాధించడానికి ఐదు
దశల చర్యలు అవసరమైతే, నేను ఆ ఐదు దశల చర్యల్నే చేపడతాను.
నా లక్ష్యాన్ని సాధించడానికి నూట యాభై ఐదు దశల చర్యలు అవసరమైతే, ఆ నూట యాభై ఐదు దశల చర్యల్నే
చేపడతాను’...
ఈ రకమైన ఓ సంసిద్దతకు సిద్ధంగా ఉండటమే ఏం చేయడానికైనా
సిద్దపడిపోవడం’ అంటే – నిజానికి లక్షాన్ని సాధించడానికి ఎన్ని దశల్ని దాటాలి,
ఎలాంటి చర్యల్ని చేపట్టాలన్న దానిపై ప్రారంభంలోనే ఎవరికీ పూర్తి చేయాలన్న దానితో
నిమిత్తం లేకుండా పని చేయడానికి నిబద్దులు కావాలి.
సక్సెస్
అంటే సాగిపోవడమే. కానీ నిబద్ధతతో ముందుకు సాగడమే అసలైన రహస్యం.
చాలా కాలం క్రితం ‘అమెరికన్ లే’ అనే పత్రిక ప్రఖ్యాత నవలాకారుడు డేవిడ్ బల్దకితో ఒక అద్భుతమైన ఇంటర్వ్యూని ప్రచురించింది. ’యూర్ జెల్యూట్ పవర్, 'టోటల్ కంట్రోల్’, 'ది విన్నర్' వంటి విజయవంతమైన రచనలెన్నింటినో చేసిన అగ్రశ్రేణి రచయిత బల్దాకి, ఆయన రచనలు లక్షలాది ప్రతులు అమ్ముడయ్యాయి.
బల్దాకి రాత్రికి రాత్రే ఈ విజయాన్ని సాధించలేదు. ఒక రచయితగా తన ప్రతిభను మరింతగా
వృద్ధి చేసుకోవాలన్న నిబద్ధతే ఆయన జీవితంలో సాహిత్య, ఆర్థిక
విజయాలుగా ఫలించాయి.
ఆయన ఒక న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించాడు. 1983లో న్యాయ కళాశాలలో చేరాడు. అప్పట్లో ఆయనకు తాను ఒక
నవలాకారునిగా ఎదగాలన్న ఆలోచనే లేదు. కానీ సాహిత్యం ఆయన అభిరుచిగా ఉండేది.
ఒక విజయవంతమైన రచయితగా మారడానికి తగినంత రచనా నైపుణ్యం తనకు లేదని బల్డాకికి ప్రారంభంలోనే తెలుసు. దాంతో ఆయన తన రచనా
నైపుణ్యాన్ని పెంచుకోవాలని కృతనిశ్చయుడు య్యాడు. మొదటి ఐదేళ్లు తాను తలపెట్టిన
రచనల్ని ముగించలేకపోయాడు. ప్రతిరోజూ నవలలోని పాత్రల రూపకల్పన, కథార్రమం, ఇతర
అంశాలను మెరుగులు దిద్దుతూ ఉండేవాడు.
అప్పట్లో ఆయన న్యాయవాదిగా పని చేస్తుండేవాడు. భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉసిరి సలపని వాద్యతల నడుమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించడానికి ఆయనకు సమయం చిక్కదెప్పుడు? ప్రతి రాత్రి పది గంటల నుంచి ఉదయం రెండింటి వరకు ఆయన నవలా రచనను కొనసాగించేవాడు. ఏం చేయడానికైనా సిద్ధపడడమంటే అదే! అయినప్పటికీ, రాయడాన్ని సంతోషాన్నిచ్చే పనిగానే తప్ప, ఒక బరువైన బాధ్యతగా తాను అప్పట్లో బావించలేదని ఆయన చెప్పాడు.
పదేళ్లపాటు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారాయన. కొన్ని చిన్న కథల్ని, స్క్రీన్ ప్లేస్ ని రచించాడు. అప్పట్లో ఒక రచయితగా ఆయన ఆదాయం సున్న. సంపాదకుల
తిరస్కారాలతో ఆయన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కానీ, 1996లో ఆ రచయిత ప్రయత్నాలన్నింటికీ ఏక మొత్తంగా ఫలితం
లభించింది.
బల్డాకి రచించిన "యాబ్ జూల్యూట్ వవర్’ నవలకు ప్రచురణకర్తల నుంచి, దాన్ని సినిమాగా చిత్రీకరించినందుకు
నిర్మాతలు నుంచి ఆయనకు లక్షలాది డాలర్లు పారితోషి కంగా లభించాయి.
ఆ చలనచిత్రంలో
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుడ్ హీరోగా నటించాడు.
నిబద్ధతలోని ఇంద్రజాలాన్ని ఖచ్చితమైన వివరణలోకి కుదించాలంటే డబ్ల్యూ. హెచ్. ముర్రే చెప్పిన ఈ మాటలు తప్ప మరో దారి లేదు.
“ఒక వ్యక్తి నిబద్ధతను సంతరించుకునేంత వరకు అతని మనసులో సందేహం దోబూచులాడుతూనే
ఉంటుంది. వెనుకంజ వేసే అవకాశాలు, ప్రతిభా శూన్యత వంటివి మనసులో తిష్ట వేస్తాయి. అంకురార్పణ (సృజనాత్మకత) తాలూకు
అన్ని చర్యలకు సంబంధించిన ఒక ప్రాథమిక సత్యం ఉంది. అసంఖ్యాకమైన భావనల్ని, సంపద్వంత మైన ప్రణాళికల్ని నిలువునా మట్టుబెట్టే అంశాన్ని గురించిన అజ్ఞానమే ఆ
సత్యం. ఒక్కసారి ఒక వ్యక్తి ఒకదానికి నిబద్ధుడైతే, అతని ప్రతి చర్యకు దైవకృప అనుసరిస్తుంది.
ఇదివరకు అసాధ్యమనుకున్న విషయాలన్నీ సుసాధ్యాలైపోతాయి. ఒక నిర్ణయం నుంచి పరిణామాలు ప్రవాహంలాగా పుట్టుకొస్తాయి. ఆ పరిణామాలన్నీ ఎదురుచూడని అనుకూల సంఘటనలుగా, ఆ సమావేశాలుగా, వస్తు సంచయంగా వెల్లువెత్తుతాయి. అలాంటివి తమ జీవితంలో సంభవిస్తాయని కూడా ఆ
ముందుకే అడుగేయండి.... మీ మార్గంలో ఎదురయ్యే అన్ని సానుకూల అమాణాల్ని గుర్తించి, వాటిని
సద్వినియోగపరచుకోవడానికి సంసిద్ధులుకండి. పట్టుదలతో కూడిన కార్యాచరణను అనుసరించండి.
విజయానికి ద్వారాల్ని తెరవండి!
* * *

Comments
Post a Comment