మగువ మనసు (మండోదరి ముచ్చట్లు )

సందిగ్ధతలో సాధికారత

-శృంగవరపు రచన

 

ఓసారి కాస్టింగ్‌ కౌచ్‌ మీద ఉద్యమం...

ఇంకోసారి హత్యాచారాల మీద ఉద్యమం...

మరోసారి సమాన వేతనాలు కావాలని ఉద్యమం...

చెప్పుకుంటూ పోతే వీటికి ముగింపు ఏది? రోజుకో కొత్త సమస్య...

దానికో పరిష్కారం దొరికే లోపలే ఇంకో సమస్య పురుడు పోసుకుంటుంది. వీటన్నింటిని వరిశీలించినట్లయితే స్త్రీ నమన్యల ఉద్యమాల దగ్గరే ఆగిపోతున్నాయని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. మీడియా ముందుకొచ్చేవారు, అలాగే సమస్యని ప్రజలకు తెలిసేలా చేసే మీడియా, ఇంకోవైపు న్యాయస్థానాలు ఉన్నప్పటికీ ఎందుకు సమస్యలు పరిష్కరించబడడం లేదు? ఇది ఎప్పటికి మిలియన్‌ డాలర్‌ ప్రశ్నే కానీ దీని సమాధానాన్ని విశ్లేషిస్తే కొంతమేరకు ఈ వైఫల్యాలకు కారణాలు బోధపడతాయి.

ఏ ఉద్యమం అయినా వ్యక్తిగత బాధ నుండి పుట్టే అవకాశాలు ఎక్కువ. మొదలు పెట్టే క్రమంలో ఆ బాద అందరికీ తెలియాలనే ఆక్రోశమే ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలో మొదట్లో దొరికే మద్ధతు ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. ఉద్యమ క్రమంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో ఆ సమస్య పడుతున్న వర్గానికి నాయకత్వం వహించే బాధ్యత తీసుకోవడం. ఆ బాధ్యత తీసుకున్నాక ఆ వర్గానికి శత్రువులు ఎన్నో వ్యూహాలు పన్నుత్రారు. ఇక రెండో దశలో శత్రువ్యూహంలో చిక్కుకుని శలభంలా మాడిపోవడం.

            ప్రతి వ్యక్తికి ఓ జీవితం ఉంటుంది. అనుబంధాలతో నిండిన ఆ జీవితంలో కొన్ని నిబంధనలు సమాజరీత్యా ఉంటాయి. ఈ నిబంధనలు మనిషిని చాలా వరకు ఎన్ని సమస్యలొచ్చినా గళం విప్పకుండా చేస్తాయి. స్రీ సమస్యలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. సమస్య ఏ స్థాయిలో మొదలైన ఇన్ని ప్రతిబంధకాలు అడుగులు వెనక్కి పడేలా చేస్తాయి.

సర్దుకుపోవడమే మంచిది అన్న భావన దాదాపు 80శాతం మహిళలకు ఉంటుంది. దానికి కారణం ఓ కోణం నుండి పరిశీలిస్తే కుటుంబం పట్ల ఉన్న బాధ్యత. ఆ క్రమంలో స్రీ తన ఆత్మగౌరవం కన్నా సమిష్టి బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. అమె గొప్ప మననును అర్ధం చేసుకొని ఆమెను గౌరవించేవారు ఉన్నారు. అలాగే ఆమెదైన ఈ మనస్తత్వాన్ని ఆమె బలహీనతగా భావించేవారు ఉన్నారు. ఇది ఓ కోణం.

ఇంకో కోణం నుండి పరిశీలిస్తే వ్యక్తిగతంగా తన సమస్యలు చెప్పుకుంటే సమాజంలో చులకనభావం కలుగుతుందేమోనన్న సంశయం, అప్పటివరకు ఉన్న అంతో ఇంతో కుటుంబ మద్ధతు దూరం అవుతుందేమోనన్న భయం, ఒకవేళ దీని పరిణామాలు తనని ఒంటరిని చేస్తే అవకాశవాదులు రెచ్చిపోతారేమోనన్న భీతి, ఇవన్నీ స్త్రీని నిజమైన పరిష్కారం కోసం పోరాడకుండా ఉండేలా చేస్తాయి.

మహిళా సంఘాలు పరిష్కరించిన సమస్యలేమిటో ఎవరికీ అంతుబట్టదు. సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు మాటలతో అందరూ తమ సానుభూతిని, మద్ధతను తెలుపుతూ స్పందిస్తారు. ఆ క్రమంలో ఆ సమస్య చివరి వరకు నిలబడి దాని పరిష్మారానికై నిలబడిన సంఘాలు దాదాపు లేవనో చెప్పవచ్చు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ సమస్యలు సంఘాలకు ఓ బాసటగా నిలుస్తున్నాయే తప్ప, బాధితులకి సంజీవనిలా మాత్రం కాదు.

ఉన్న అన్ని సంకెళ్ళను తెంచుకొని ప్రీ బయటకు వచ్చినా ఎవరిని నమ్మాలో,ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. “తెలిసిన దెయ్యమేమేలు తెలియని దేవుని కన్న అన్న రీతిలో ఈ సందిగ్ధ పరిస్థితిలో స్రీ మౌనంలోనే సంతోషాన్ని వెతుక్కుంటుంది.

ఏ ఉద్యమం మొదలైనా పరిష్కారం లేకుండానే ఈ ఉద్యమం ముగిసిపోతుంది. బహుశా ఇటువంటి వైఫల్య పరిణామాలు కూడా స్రీలు వెనుకడుగు వేయడానికి కారణమై ఉండవచ్చు. ఇది ఎంతోమంది మృగాళ్ళు ముందడుగు వేయడానికి ఊతం ఇచ్చి ఉండవచ్చు.

ఏది ఏమైనా స్త్రీ సున్నితత్వ కైలిని బలహీనతగా కాకుండా దైవత్వంగా పరిగణించే రోజూ రానంత వరకు ఈ సందిగ్ధత తప్పదు. దానికి స్రీ తనని తన లక్షణాలను వ్యక్తీకరించే తీరులో ధృడత్వాన్ని దట్టించాలి. స్త్రీ శక్తి అంటే ఆత్మగౌరవాన్ని ధృడపరచుకొనే స్త్రీ సముదాయమే తవ్ప గంభీరత్వాన్ని ఆపాదించుకుని సమాజంలో ఒకలా, వ్యక్తిగతంగా ఇంకొకలా మసలే ద్వంద్వ మనఃస్థితి  కాదు.త్వరలోనే ఈ సందిగ్ధత స్పష్టత వెలుగులోకి పయనించాలని ఆశిద్దాం.

   *       *      * 





Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ