Survival Protection Instinct
Survival Protection Instinct -శృంగవరపు రచన మనిషి మనుగడ కోసం ఏమైనా చేయడం ఒక దశ అయితే, ఆ దశలో వచ్చే ప్రమాదాల నుండి తనను తాను కాపాడుకోవడం రెండో దశ. ఈ రెండు దశలు మనిషి జీవితంలో అనుసంధానమై ఉంటాయి. ఆ రెండు దశల మధ్య మనిషి ఎలా మారిపోతాడో స్పష్టం చేసే సినిమానే 'ఫ్యామిలీ డ్రామా.' ఓ కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకుకి ఉద్యోగం లేకపోవడం వల్ల అతన్ని తండ్రి ఇంటి నుండి గెంటేస్తాడు.అతను డ్రగ్స్ కు అలవాటు పడతాడు. తర్వాత చిన్న కొడుకు ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకురావడం, అతనికి ఉద్యోగం రాకపోవడం వల్ల అతన్ని కూడా ఇంట్లో ఉండనివ్వనని తండ్రి హెచ్చరించడంతో అన్నతో కలిసి తండ్రికి పక్షవాతం వచ్చే మందు కాఫీలో తల్లి చేత కలిపించి ఇస్తారు. తల్లిని కూడా తండ్రి హింసించడం వల్ల తల్లి కూడా సహకరిస్తుంది. తర్వాత ఆయనకు శరీరం అంతా చచ్చుబడటం జరుగుతుంది. అదే అదనుగా భావించి పెద్ద కొడుకు తన భార్యతో సహా అక్కడ అడుగు పెడతాడు.పెద్ద కొడుకు రామం, అతని భార్య...

Comments
Post a Comment