మగువ మనసు (మండోదరి ముచ్చట్లు )
-రచనశ్రీదత్త(శృంగవరపు
రచన)
స్త్రీ సమాజంలో ఎదుర్శొనే అన్ని సమస్యలతో పోరాడి పరిష్కరించుకోవడం సాధ్యమైన
పని కాదు. వర్కింగ్ వుమన్ ఎదుర్కొనే సమస్యల్లో ఇంటి సమస్య ఒకటి. అందులోనూ 'సింగిల్ వుమన్' కష్టాల గురించి అయితే నేటి
పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇంటి ఓనర్ల నుండి లైంగిక వేధింపులు తప్పని పరిస్థితి.
ఇంటి నుండి మరో ఇంటికి మారినా ఈ మృగాళ్ళ తీరు మాత్రం ఒకటే.
వివాహంతో స్రీకి భద్రత వస్తుందని ఇప్పటికి చాలా వరకు అందరూ నమ్ముతున్నారు.
ఒకప్పుడు అది ఆర్థిక భద్రత అయి ఉండవచ్చు. కానీ నేడు స్త్రీ తన ఉపాధి తనే
చూసుకున్నా మృగాళ్ళ నుండి తప్పని వేధింపులు!
అదేంటి? నచ్చకపోతే
వేరే ఇంటికి మారిపోవచ్చు కదా అన్నది గొప్ప సలహానే కావచ్చు, కానీదానిలో
కూడా చాలా లొసుగులు ఉన్నాయి. నేడు ఉద్యోగం చేసి స్వతంత్రంగా బతికే ప్రీలు ఈ దశను
పెళ్ళికి ముందు కలిగి ఉంటారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడి తల్లిదండ్రుల
బాధ్యతలను తీసుకుని, తర్వాత పెళ్లి చేసుకునే ధోరణి ఉన్న
స్రీలు ఎంతోమంది ఉన్నారు.
ఆ
క్రమంలో వారు అద్దె ఇల్లుకు పెట్టే ఖర్చు బడ్జెట్ రీత్యా తక్కువగానే ఉంటుంది.
అందుకని పోర్షన్లలో ఉండాల్సిన పరిస్టితి ఏర్పడుతుంది. ఫ్లాట్‌లలో అయితే ఆ
పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంటుంది. కానీ ఇలా పోర్షన్లలో ఉండే ఇండిపెండెంట్
స్త్రీలు లైంగిక వేధింపుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటీకన్నా
ముందు ఇండిపెండెంట్ స్త్రీకి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎన్నో అవమానకరప్రశ్నలు సంధించడానికి
ఆ ఇంటి యజమాని ముందే సిద్ధంగా ఉంటాడు. ఆ క్రమంలో బేలగా (లేదా) బలహీనపడుతున్న
మనస్థితిని అంచనా వేసి తన అవకాశానికి వ్యూహాలు వేసుకుంటాడు. ఓ ఇల్లు దొరకదు, సింగిల్ వుమన్‌కి
దొరకడమే కష్టం, అందులోనూ బడ్జెట్‌లో దొరకడం ఇంకొంత కష్టం. పోనీ
ఎలాగో కష్టపడి కాస్త డబ్బు పోయినా ఫర్లేదు అనుకొని రెంటల్ ఏజన్సీ ద్వారా వెళ్ళినా,
అక్కడికి వెళ్లాక ఏవైనా సమన్యలు ఎదురైతే ఆ ఏజెన్సీవాడు మాయమౌతాడు.
ఓ స్రీ ఎంతో చదువుకుని కూడా, ఆర్థికంగా స్వాతంత్ర్యం
ఉన్నప్పటికీ కూడా భర్త వేధిస్తే ఎలాగో నర్దుకుపోవడానికే ఇష్టపడుతుంది కానీ
స్వతంత్రంగా బ్రతకాలనే యోచన చేయకపోవడానికి ఈ బయటి వేధింపులే కారణం. ఒకవేళ ధైర్యంగా
ముందడుగు వేసి తన సమన్య గురించి చెప్పినా, ఆ సమన్య పరిష్కరించబడుతుందో
లేదో తెలియదు.
ఒకవేళ పరిష్కారం దొరికినా దానికి ఎంతోకాలం పడుతుంది. ఆ క్రమంలో ఆమె 'శీలహత్య' జరుగుతుంది. అప్పటివరకు ఆమెకు మద్ధతుగా నిలబడ్డ
వాళ్ళంతా ఈ శీలహత్య తెరమీదకు రావడంతో వెనక్కు తగ్గుతారు. అలా ఆ సమస్య కాస్త
విజయవంతంగా పక్కదోవ పట్టించబడుతుంది. అప్పటికే మానసికంగా కుంగిపోయిన స్థితిలో ఉండే
ఆ స్త్రీ తరువాత ఏం చేయగలుగుతుంది?
స్త్రీలకు
వర్క్‌ప్లేస్‌లో వేధింపులు ఓ పక్క ఇంటి ఓనర్లతో ఇంకో పక్క. ఇలా చెప్పుకుంటూ
పోతే ఆమెను కొంతకాలానికి ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయేలానో లేక పిరికి దానిగానో
తయారుచేస్తాయి.
తాజాగా
కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కానీ ఆ క్రమంలో అన్ని
రంగాల్లో ఉన్న స్త్రీల సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు తేలిందేమిటంటే ప్రతి
రంగంలోనూ ఈ లైంగిక వేధింపులు ఉన్నాయని కానీ నిష్పత్తుల్లోనే తేడా ఉందని. ఒక్కచోట
తక్కువగా ఉండొచ్చు, ఇంకోచోట తీవ్రంగా ఉండవచ్చు. కానీ లేదు అని
మాత్రం చెప్పే ఆస్కారం లేదు.
ఇటువంటి
సమస్యల పరిష్కారం అన్నది ఒక్క రోజులోనో, నెలలోనే, సంవత్సరంలోనే దొరికేది కాదు. అంతేకాకుందా, ఆ
పోరాటంలో భాగంగా కొన్నిసార్లు ఆమె తన ఉపాధి కూడా కోల్పోవాల్సి రావచ్చు. ఇన్ని
చిక్కుముడులు విప్పే వాతావరణం ఎప్పటికీ ఈ సమాజంలో నిర్మించబడుతుందో!


Comments
Post a Comment