ప్రేమ “ పిడికిలి “ లో ...
ప్రేమ “ పిడికిలి
“ లో ...
-రచనశ్రీదత్త (శృంగవరపు
రచన)
'ప్రేమ... అంటే అనురాగం అనో, మమత అనో, అనుబంధమనో నేను
చెప్పడం లేదు.
కానీ అవతలి వచ్చే విశిష్టతను
స్థిరంగా గుర్తించి, వారి మంచినే
నిరంతరం కోరుకోవడ మని నా ఉద్దేశం'
- అల్లాయ్ స్లీవెన్సన్.
మీరు అందరిలో పేరు తెచ్చుకుందామసుకుంటున్నారు.
కానీ అందుకు ఏ మార్గం కనిపించడం లేదా? దానికి మార్గం ఇదుగో!
మీరు ఇతరుల సామర్థ్యాన్నీ, ప్రత్యేకమైన
నైపుణ్యాలను గుర్తించి, మెచ్చుకుని, చిత్తము దితో సంతోషించగలరా? వారిని
ప్రోత్సహిం చగలరా? వారి
సంక్షేమాన్ని ఎలా వృద్ధి చేయాలని ఆలోచించగలరా? వారి బాగోగుల
కోసం ప్రార్థించగలరా? మరొక మాటలో
చెప్పాలంటే మీ నిస్వార్థ ప్రేమను వారికి అందించగలరా? మీరు “ఔను...!” అని చెప్పగలిగితే మీరు జనం ప్రేమను గెలుచుకో గలుగుతారు.
మీరొక గొప్ప మేధావి, ఒక పండితుడు కాదలచుకున్నారా ? అలా అయితే మీరు చదువదలుచుకున్న
విషయంమీద గోప్ప ప్రేమను పెంపొందించుకోవాలి. ఆ విషయం మీద ఇటువంటి తీవ్రమైన ప్రేమను అలవరుచుకుంటే, అందులోని కొత్త కొత్త విషయాలు, కొంగొత్త ఆలోచనలు
ఎలా మీ ముందు ఆవిష్కరించుకుంటాయో మీరే చూస్తారు.
మీరు ఆరోగ్యవంతులు, బలవంతులు కాదలుచుకున్నారా? అయితే మీ
చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమతోనూ, ఆప్యాయతతోనూ
చూడడం నేర్చుకోండి. అన్ని మొక్కల్నీ, జంతువుల్నీ, ప్రకృతి మొత్తాన్ని ప్రేమతో చూడండి. ఇలా చెయ్యడం వల్ల మీ లోపలి మనస్సు మీద, మీ రక్త కణాల మీద ఆరోగ్యకరమైన ప్రభావం పడుతుంది. ఔను ప్రేమ మాత్రమే అత్యంత
ప్రయోజనకరమైన, ఆరోగ్యకరమైన
రసాయనిక మార్పుల్ని రక్తంలో కలిగించగలదు. అటువంటప్పుడు ఈ జీవితాన్ని ఒక
ఉల్లాసవంతమైన ప్రయాణంగా చేసుకోవడానికి అనుసరించవలసిన ఆదర్శవంతమైన మార్గం ఏదన్న
విషయంలో ఒక తికమక ఏముంది?.
పిట్రిమ్ ఎ.సోరోకిన్ తనగ్రంథం, “ప్రేమశక్తులు"(పవర్స్ ఆఫ్ లవ్) లో, నిస్వార్థమైన ప్రేమకు సృజనాత్మక, రోగ నివారక లక్షణాలు
మెండుగా ఉన్నాయి. చాలా మంది ఊహించగలిగే దానికన్నా, అవి ఎక్కువే! ప్రేమ ప్రాణం పోయగల శక్తి ,శారీరక మానసిక, నైతిక ఆరోగ్యం కోసం అది అవసరం. అన్ని జీవుల హితాని కోరుకునేవారు అహంకారుల
కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు.
ప్రేమ కొరవడిన పిల్లలు
ఉత్తేజాన్ని కోల్పోయి, నైతికంగా సామాజికంగా లోపభూయిస్టులవుతారు. నేరాలను చేయించే, రోగాలను కలిగించే, ఆత్మహత్యకు
పురికొల్పే స్వభావాలకు అత్యంత శక్తివంతమైన వీరుగుడు ప్రేమే. ద్వేషానికి, భయానికి, మానసిక వ్యాధులకు
కూడా అదే విరుగుడు.. లోతైన, నిరంతమైన
సంతోషాన్ని పొందడానికి తప్పనిసరైన నియమం ప్రేమ, మంచితనం, స్వేచ్చ అత్యున్నత స్థితిలో ఉండేది ప్రేమలోనే, మానవాళి ఔన్నత్యానికి అతి చక్కని, అత్యంత
శక్తిమంతమైన విద్యను అందించే ప్రేమయే. అందరు మానవులపట్ల హద్దు లెరుగని ప్రేమ శక్తి
మాత్రమే మనుష్యుల మధ్య పోరాటాన్ని రగిరించే శక్తుల్ని ఓడించగలదు. అది మాత్రమే ఈ
భూమి మీద మనిషికి మనిషే పరీక్షగా మారడాన్ని ఆపగలడు.
ప్రేమ లేనిదే ఏ
కవచం, ఏ యుద్ధం, ఏ రాయబారాలు, ఏ అణగదొక్కే సైన్యశక్తి, ఎటువంటి పాఠశాల విద్య, ఎటువంటి రాజకీయ, ఆర్థిక విధానాలు, చివరికి హైడ్రోజన్ బాంబులు ఉన్నాయన్న భయం కూడా మారణహోమాన్ని ఆపలేవు. ప్రేమ
మాత్రమే ఈ అద్భుతాన్ని సాధించగలదు. అయితే ప్రేమ స్వభావాన్ని, దాన్ని తయారు
చేసుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, ఉపయోగించడానికి కావలసిన సమర్ధమైన పద్ధతుల్నీ మనం చక్కగా తెలుసుకోవాలి”..
బహుశా ప్రేమంటే ఏమిటంటే... ఇంత కన్నా
ఏం చెప్పగలం? ఒకసారి ఒక
భక్తుడు శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన విజ్ఞానానంద స్వామిని "స్వామీ! శ్రీరామకృష్ణులలో ఏ లక్షణం మీకు
అన్నింటికన్నా ఎక్కువగా నచ్చింది?" అని
ప్రశ్నించాడు. దానికి స్వామి "అప్పట్లో ఆయన
ఆధ్యాత్మిక శక్తి, వైరాగ్యం, దివ్యపారవశ్య స్థితులు, బోధనలు మొదలైనవేవీ
నాకు అర్ధం కాలేదు. కానీ ఆయన ప్రేమకు సరిసాటి మరొకటి లేదు.
ఆయన నన్ను మొదటిసారి చూసినప్పుడే ఒక చీరకాల స్నేహితుడిగా నన్ను ఆదరించారు. నా
తల్లిదండ్రులు, సోదరులు కూడా నా
మీద అటువంటి ప్రేమను చూపలేదు. శ్రీరామకృ ష్ణులు ఒక ప్రేమపెన్నిధి. ఆయన ప్రేమతో
పోల్చదగినది ఇంకొకటి లేదు. ఆ రోజున ఆయన మా పట్ల చూపిన ప్రేముకు మేం అచ్చెరువొందాం.
మాలో ప్రతి ఒక్కరి సంక్షేమంకోసం ఆయన ఎంత తీవ్రంగా ప్రయత్నించేవారో!" అని చెప్పారు.
ఒకసారి వివేకానంద
స్వామి ఇలా చెప్పారు- "ఈ ప్రపంచమంతా
పవిత్రమైన ప్రేమను పొందడం కోసం ఆతురతలో ఉంది. ఏదీ ఎదురు ఆశించకుండా మనం ప్రేమను
పంచిపెట్టాలి. ఎటువంటి ప్రతిఫలాన్నీ కోర కుండా దానిని పంచిపెట్టండి. ప్రేమకు
పరాజయమున్నడే లేదు. ప్రేమ తప్పక తెలుస్తుంది. ఈ
రోజు కాకపోతే రేవు: రేవు కాకపోతే శతాబ్దాల తర్వాత! ప్రేమ దానితో
పాటే తప్పక విజయాన్ని కొనితెస్తుంది. మీరు మీ సోదరుల్ని ప్రేమిస్తున్నారా? లేదా అన్నది అసలు ప్రశ్న. వార్తా పత్రికలలో ఏమి రాస్తున్నారన్న విషయాన్ని నేను
పట్ట౦చుకోను. ప్రేమ అన్నింటినీ సాధించగలదని విశ్వసించండి. మీరు నిస్వార్థంగా
ప్రేమించగలిగితే అన్నింటిని సాధించగలుగుతారు”. మరి ప్రేమ ఇంత మహత్తరమైనది అయినప్పుడు
ఏ దృష్టికోణంవల్ల ప్రపంచ శాంతిని, ఆనందకరమైన
జీవితాన్ని అందుకోకుండా అడ్డు పడుతుంది.
“ప్రపంచ
యుద్ధానికి ముందు శాస్త్ర పరి శోధనలు సాయువుల మీదకన్నా నేరస్తులు మీద ఎక్కువగా
దృష్టి పెట్టాయి. అదేవిధంగా మేధస్సుకన్నా ఎక్కువగా పిచ్చితనం మీద, పరస్పర సహకారం మీద కన్నా మనుగడ కోసం పోరాటాల మీద, ప్రేమ, కరుణలకన్నా స్వార్థం, ద్వేషం మొదలైనవాటి మీద దృష్టి పెట్టాయి. రెండు ప్రపంచయుద్ధాల వల్ల ప్రపంచంలోని
ప్రజలంతా కల్లోలమైపోయారు. శాంతిని పరిరక్షించడమనే ముసుగులో దేశాలు యుద్ధానికి
సన్నద్ధమయ్యాయి. స్వార్థం, విచ్చలవిడితనం, ఇంద్రియ లోలత్వం, పగ. కత్తిమీద
సాము లాంటి పోటీతత్వం మొదలైన వాటిలో నేటి సమాజం
రోగపూరితం అయిపోయి ఒక పెను విపత్తులవైపు పరుగులు తీస్తోంది. ప్రజలలో నిస్వార్థమైన
ప్రేమను పెంపొందించి, ఒక రమైన సహకార భావాన్ని, సాహార్ర్ద భావాన్ని
పెంపొందించే మార్గాల్ని, పద్ధతుల్ని
అన్వేషించాల్సిన అవసరం ఉంది...
ఇందువల్ల సమాజంలో హింస, తీవ్రవాదం, హంతక ప్రవృత్తి
తుడుచుపెట్టుకుపోయి శాంతి, సమన్వయాలతో
ప్రజలు జీవించేందుకు ప్రేరణ కల్పిస్తుంది. మందు గుండు సామాగ్రి మీద ఖర్చు పెడ్తున్న
ధనంలో ఏ కొద్ది భాగాన్ని నిస్వార్థ ప్రేమను అధ్యయనం చెయ్యడానికి ఖర్చు పెట్టినా ఈ
ప్రపంచం గొప్పగా ప్రయోజనాన్ని పొంది ఉండేది. నిస్వార్థ ప్రేమ ప్రభావాన్ని మనిషి
అర్థం చేసుకొన్ననాడు, ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో నుంచి ద్వేషం, అసూయ, స్వార్థపరత్వాలను పారదోలి, కల్తీ లేని, ప్రేమను అలవరచుకోవడం ద్వారా తనకేగాక తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆనందాన్ని
పంచి ఇవ్వగలుగుతాడు. ఈ పవిత్ర ప్రేమ పొంచి ఉన్న ప్రళయాన్నుంచి
ఈ ప్రపంచాన్ని పరిరక్షించగలుగుతుంది" అన్న సోరోకిన్ కన్నా గొప్పగా ప్రేమను ప్రపంచంతో ఎవరు సమన్వనయ పరచగలరు?
ప్రేమను పిడికిలిలో బిగిస్తే గెలవలేని యుద్ధం లేదు. ప్రేమను స్పర్శలో నింపితే
మరిచిపోలేని హృదయం ఉండదు. ప్రేమను నిలువెల్లా ఆహ్వానిస్తే ఆకాంతికి చోటే ఉండదు. అదే
ప్రేమంటే!
* * *

Comments
Post a Comment