స్వయం రక్షణే స్త్రీకి సౌందర్యం

స్వయం రక్షణే స్త్రీకి సౌందర్యం

     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

అనగనగా ఓ ఆరడుగుల హీరో, కాలేజీలో ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో వడ్డాడు. క్లానులు ఎగ్గొట్టి, సినిమాల్లో, పార్కులలో చెట్టాపట్టాలేసుకుంటూ 'నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న డైలాగులు చెప్పుకుంటూ ఇంటర్వెల్‌ దాకా గడిపేస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఏదో ఒకానొక క్షణంలో అదృష్టం డైరెక్టర్‌ను, సినీ యూనిట్లను వరిస్తే తప్ప ప్రయోగాత్మకంగా ప్రేమ కథలకు భిన్నంగా వచ్చే సినిమాలు జనాదరణ పొందడం అన్నది అరుదైన అంశం.

 అసలు సినిమా అంటే ఏమిటి? ఓ ఊహాప్రపంచం. ఆ ఊహాప్రపంచంలో మనల్ని మనం ఇముడ్చుకునే ఊహానాయకత్వ నాటకీయత ఉందాలి. దానితోపాటు తర్వాత సంఘటనలను ఊహించడం, ఆవి ఊహకు భిన్నంగా ఉండటం.. థ్రిల్‌గా ఫీలవ్వడం.. ఇవన్నీ ప్రేక్షకుని సినిమా స్పందన తాలుకు భావోద్వేగాలు. ఓ సమస్యను తెరకెక్కించడం అన్నది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చంపేసాం. కానీ అబ్‌సర్డ్‌ పద్దతిలో ప్రీ పుట్టిన దగ్గరి నుండి ప్రతి దశలో ఎదుర్కొనే లైంగిక వేధింపుల అంశంగా సినిమాను చిత్రీకరించడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. దీనికి నిదర్శనమే తాజాగా విడుదలైన 'అ' సినిమా.

 ప్రపంచసాహిత్యంలో ఎందరో అబ్సర్జిటీని కధా సంవిధానంగా చేసే కళాఖండాలను నృష్టించారు. కాఫ్కా శామ్యూల్‌ బెకే, కామూ, లూయిస్‌ కారెల్‌,దానిల్‌ ఖర్మ్‌ ఆదే తెగ. నిరుపయోగమైన చేష్టల పాత్రలతో, సాంప్రదాయేతర నిర్మాణంతో, కథను ఆంతర్లీనంగా ప్రవహించే సాంద్రతాత్వికతతో నడపడం రచనలో కొంచెం కష్టంగానైనా సాధ్యమే కానీ.. దాన్ని యధాతధంగా దృశ్యంగా మార్చడం మాత్రం అంత సులువు కానేకాదు. తెలుగు కథకుల్లో త్రిపుర ఈ శైలిని ఎంచుకున్నాడు. యండమూరి కొన్ని కథలు రాసాడు. అనువాదాలు చాలా వచ్చాయి. రచనలో ఆమోఘం అనిపించే నిర్మాణాన్ని  దృశ్యరూపంలోకి తేవడం దాదాపు అసాధ్యమే. అందుకే తెలుగు సినిమాల్లో ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు. కానీ '' సినిమాతో తెలుగులో ఈ ప్రయోగానికి నాంది పడింది.

ఏమీ అర్ధం కావడం లేదనిపిస్తూనే ప్రతి సన్నివేశంలో ఉత్మంఠని నింపుతూ,అయోమయంగా ఉన్నట్టుగా ఉంటూనే ఆసక్తిని పుట్టించాడు దర్శకుడు.ఎదుగుతున్న ప్రతిదశలో లైంగిక వేధింపులకు గురై మగజాతిపట్ల ద్వేషంతో మరో యువతినే పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డ ఓ అమ్మాయి కథే ''. ప్రతి మనిషిలో ఎన్నెన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఒక్కోపరిస్థితిలో ఒక్కో సందర్భం బట్టీ ఒక్కో భావోద్వేగం బయటపడుతుంది. కానీ కొన్నిసార్లు భయం, సిగ్గు,బిడియం వల్ల కొన్ని నవాజ భావోద్వేగాలను అణచివేసి ఓ కృత్రిమఉద్వేగలోకంలో ఉండే పరిస్థితులు మనందరికీ తారసపడుతూనే ఉంటాయి.

అటువంటి ఒక్కో భావోద్వేగానికి ఒక్కో పాత్రతో ప్రాణం పోయడమే ఈ సినిమా. మల్చిపుల్‌ ' పర్సనాలిటీ డిజార్జర్‌ అనే మానసిక అపసవ్యతతో బాధపడే అమ్మాయి మనసులోని అన్ని కోణాలను అవిష్కరించే కథ ఇది. తల్లితండ్రి ప్రేమకు దూరమై వాళ్లను బతికిచుకునేందుకు కాలాన్నే తిరగరాయాలని తపనపడే ప్రయోగవాదికథ. ప్రేమ అజరామరం, అనంతరం అని చెప్పే కథ. బతకడం కోసం ఎంతకైనా సిద్ధపడే సగటు సెల్ఫీష్‌ త్యాగమూర్తి కథ.జీవితంలో దెబ్బతిని మార్గంలో ఆ గాయాలకు మాదకద్రవ్యం అనే మందును వూద్దామనే మంచి మనసున్న పిరికి యువత కథ. మనుషుల వెధవాయిత్వాల నడుమ చెట్లూ చేపా ఎంతో స్వచ్చమైనవని చెప్పే కథ. దేవుడే అందరి కంటే గొప్ప మెజీషియన్‌ అని తేల్చిచెప్పే కథ. ఈ కథలన్నింటిలోని పాత్రలన్నీ వేర్వేరు కావని ఒకేఒక మనిషిలోపలి విభిన్న భావోద్వేగాల రాగద్వేషాలరూపాల నీడలని చెపుతూనే... ఈ వాస్తవాల్నీ సూటిగా చెప్పని అసలు కథ.

 స్త్రీ అసలు ఈ సృష్టిలో లేదు. ఆమె కేవలం ఎందరో అభిప్రాయాల జాడ్యాలతో,

స్వీయభయాలతో, స్వానుభవాలతో మలచబడింది. జీవితంలోని ప్రతిదశలో ఆమె అనుభూతించే లేదా భరించే కొన్ని స్పర్భల వెనుక దాగి ఉన్న అమానుషత్వ ప్రవృత్తిని ఆమె బయటకు వ్యక్తపరచకపోయినా ఆమెకు అంతర్లీనంగా అన్ని తెలుసు. అలా అన్ని సందర్భాల్లో సర్దుకుపోయే పరిస్థితులను ఆమె దాటడం ఎన్ని శతాబ్దాల తర్వాత మొదలవుతుందో కాలానికే ఎరుక. శారీరక అత్యాచారాన్ని మాత్రమే నిజమైన తప్పుగా, బాధ పెట్టే అంశంగా భావిస్తూ సాగిపోతున్న ఈ తరుణంలో సినిమాలాంటి మాధ్యమం ద్వారా ప్రతిదశలో మగువ మనోగతాన్ని వాస్తవికంగా ఆవిష్కరించడం కచ్చితంగా హర్షనీయ చర్య స్రీ సాధికారత నిజంగా పురుడుపోసుకునేది కొందరు స్ర్తీల గొప్ప చరిత్రల వల్ల మాత్రమే కాదు, ప్రతి స్తీ ధైర్యంగా అన్ని ఎదుర్కొంటూ, మనసులో కుమిలిపోయే విషపు నీడల నుండి తననుతాను కాపాడుకున్నప్పుడే.

 స్త్రీల పట్ల సమాజం ఏర్పరచుకొన్న దృష్టికోణంలో మార్పుతోపాటు, స్త్రీ సమాజం పట్ల పెంచుకున్న భయం, సందిగ్ధత వంటి అంశాల్లో కూడా వ్యక్తిగతంగా మార్పు రావాలి. అప్పుడే స్త్రీ సమానత్వ సౌందర్యంతో శోభిల్లుకుంది.

         *    *    *  














Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ