ఒక్క నిమిషం చాలు .....

ఒక్క నిమిషం చాలు ..... 
(వార్త ఆదివార అనుబంధ పత్రికలో ప్రచురితం) 



నా దగ్గర ఒక నిమిషం మాత్రమే ఉంది. ఈ నిమిషంలో అరవై సెకండ్లున్నాయి. నేను ఈ నిమిషాన్ని అన్వేషించలేదు. కోరుకోలేదు.

       ఈ నిమిషం నా మీద పడింది. నేను దేన్నీ నిరాకరించలేను. కానీ ఇది ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోగలను.

       ఈ నిమిషం చెయ్యి జారిపోయిందంటే... నేను అనుభవించాలి... దుర్వినియోగం చేశానంటే సంజాయిషీ ఇవ్వాలి. ఒక చిన్న అల్పమైన నిమిషం మాత్రమే. కానీ ఈ నిమిషంలో అనంత కాలం ఉంది.

                                                              - డా ! బెంజిమిన్మేణ్

     ప్రతీ పునరాగమనంలోనూ, పరివర్తనా క్రమం ప్రారంభించి, వ్యతిరేక దశ నుండి సానుకూల దిశకు మార్చే ఒక ప్రత్యేక నిమిషం. ఒక ప్రత్యేక క్షణం ఉంటుంది. ఆటల్లో చూస్తూనే ఉంటాం. ఒక టీం అటు ఓడిపోతూ ఉంటుంది. ఓటమి నిశ్చయం అనిపిస్తుంది. కానీ ఒక నిమిషంలో, ఒక క్షణంలో, అంతా తారుమారవుతుంది. ఉర వడి దిశ మారుతుంది. శక్తి వక్షం మారుస్తుంది. ఓడిపోతున్న టీం గెలవబోతున్నట్టు కనిపిస్తుంది. గెలిచే టీంలాగా ఆడుతుంది. అది ఉత్తేజకరమైనది. రంజింపజేస్తుంది. ఆటగాళ్లను, చూసేవారిని సమ్మోహితులను చేస్తుంది.

 మన జీవితంలో మనం ఓడిపోతున్నట్లు అనిపించే కణాలుంటాయి. కానీ అదే సమయంలో మెరుపులా, ఒకే ఒక క్షణంలో అంతా తారుమారవుతుంది. వేగం మరోవైపు  మళ్లుతుంది. శక్తి  మారుతుంది, మనం మారుతాం. మనం కొత్తగా ప్రారంభించి, గెలవడం నేర్చుకుంటాం. ఆటలలోలాగానే ఇది కూడా ఉత్తేజకరంగా ఉంటుంది. అది మన జీవితాలను, ఇతరుల జీవితాలను మారుస్తుంది. నిలకడగా విజయాలు సాధించాలంటే కీలకమైన విషయం ఏమిటంటే  ఆటువంటి క్షణాలు మనం సృష్టించుకోవడం, వునఃసృష్టి చెయ్యడం. కొన్ని టీంలు పునరాగమనంలో నైపుణ్యం సాధిస్తాయి. ఎందుకంటే ఓటమి కోరల నుంచి బయట పడి ఎలా గెలవాలో ఆ టీములకు తెలుసు. అలాగే మనం కూడా పునరాగమనంలో నైపుణ్యం సంపాదించి మన పరాజయాలను విజయాలుగా మార్చగల౦. కొన్ని టీంలు పునరాగమన టీంలు" గా ప్రసిద్ధి కెక్కుతాయి.

ఎందుకంటే అసాధ్యం అనిపించే పరిస్థితుల నుంచి వారు నిలకడగాగెలుస్తారు. అలాగే మనం కూడా అద్భుతాన్ని సృష్టించగలం. కీలకమేమిటంటే ఆ క్షణం అద్భుతాన్ని ఎలా వ్యక్తపరచి, మన పరాజయాలను విజయాలుగా ఎలా మార్చాలి? అన్నది.

  చరిత్ర సృష్టించిన వ్యక్తులందరూ తమ జీవితాన్ని మార్చిన ఆ ఒక్క నిమిషాన్ని, ఒక్క క్షణాన్ని గుర్తించినవారే. సాధారణంగా ఈ క్షణం ప్రతికూల కాలంలో సంభవిస్తుంది.

రోజా పార్క్స్  ఉదంతం ఓ ఉదాహరణ. ఆ ప్రత్యేక క్షణం ఆమెకు 1955లో ఎదురైంది. ఆమె బస్సులో ముందు సీటు నుంచి వెనుకకు వెళ్లడానికి నిరాకరించింది. ఎందుకంటే నల్లజాతివారు వెనుక సీట్లలో మాత్రమే కూర్చోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నానని ఆమెకు తెలుగు, కానీ అవసరమైతే జైల్ కి వెళ్లడానికి కూడా సిద్ధపడింది. ఆమె అరెస్టు చెయ్యబడింది. ఈ క్షణంలోనే ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. చరిత్రను మార్చింది. ఆ సమయంలో 26 ఏళ్ల మార్టిన్ లూథర్‌కింగ్, జూనియర్ మత బోధకుడు. అలబామాలో, మాంటోగోమురిలో, చిన్న చర్చిలో కొత్తగా మత బోధకుడిగా చేరాడు. అతను బస్సులను బహి కరించే ఉద్యమం చేపట్టి, ప్రజలను ఉత్తేజితుల్ని చెయ్యాలని కోరడం జరిగింది. అతను యువకుడు. ఆ ప్రాంతానికి కొత్త, ఈ ఉద్యోగంలో ఇంక  నిలదొక్కుకోలేదు. అయినా అతను వెనుకాడలేదు. అవును, నేను చెయ్యగలను" అన్నాడు. ఆ క్షణంలో తన భవితవ్యాన్ని తాను నిర్ణయించుకున్నాడు. చత్రను మార్చాడు.

       విప్లవ యుద్ధంలో నాథన్ హేల్ శత్రు శ్రేణుల వెనుక పట్టుబడ్డాడు .పట్టుబడిన తక్షణం అతనికి మరణశిక్ష విధించబడింది. అతను తన తల్లిదండ్రులకు చివరగా రాసిన ఉత్తరం, అతని కళ్లముందే చించేశారు. కానీ అతను తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకు న్నాడు. ఆ క్షణంలో అతను తన భవితవ్యాన్ని నిర్వహించుకున్నాడు. చరిత్ర గతి మార్చాడు. ఉరికంబానికి మెట్లు ఎక్కుతూ, అతను ఆగి అన్నాడు. 'నా దేశానికి ప్రాణాలు అర్పించడానికి నాకు ఒకే ఒక జీవితం ఉన్నందుకు విచారిస్తున్నాను" ఒక నిమిషంలో, ఒక నిర్దిష్ట కణంలో అతను విప్లవాన్ని రచించాడు. ఆ విప్లవమే వలసవాద వివేకారుల విజయానికి నాంది అయింది.

    నువ్వు నిర్ణయం తీసుకుని, చర్చ ప్రారంభించే నిమిషం ... నీ జీవితాన్ని నువ్వు మార్చుకునే నిమిషం - విలీ జాలీ

  *     *    *

 


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ