వైద్యం వ్యాపారానికి దూరమైతేనే!

వైద్యం వ్యాపారానికి దూరమైతేనే!
(అంకుర్ అరోరా మర్డర్ కేస్ )
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన) 



సినిమా ఎప్పటిదో కావచ్చు.కానీ దానిని నిర్మింపజేసిన వైద్యపరమైన నిర్లక్ష్యం(మెడికల్ 
నెగ్లిజన్స్ )మాత్రం దైనికాంశంగానే మిగిలింది.మన వరకు వస్తే అయ్యో అనుకుంటాం కానీ ప్రపంచవ్యాప్తంగా,దేశవ్యాప్తంగా తమ పరపతితో ఇటువంటి కేసులు వెలుగులోకి రాకుండా ఉండిపోతున్నాయి.ఇప్పటికీ గాంధీలో జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం.వెలుగులోకి వచ్చేవి చాలా తక్కువ. ఈ సినిమాలో 'సర్జన్ ఆఫ్ గాడ్ 'గా పిలవబడే డాక్టర్ అస్తానాను తన మెంటర్ గా,స్ఫూర్తిగా భావిస్తాడు అదే హాస్పటల్ లో ఇంటర్న్ గా చేస్తున్న డాక్టర్ రోమేష్ .డాక్టర్ రోమేష్ తన తోటి ఇంటర్న్ అయిన రియాతో కలిసి సహజీవనంలో ఉంటాడు.
ఆ హాస్పటల్ కు కడుపునొప్పితో ఎనిమిదేళ్ళ పిల్లాడైన అంకుర్ అరోరాను తల్లి నందితా తీసుకువస్తుంది.అతని తండ్రి వారిని శాశ్వతంగా వదిలి వెళ్ళాపోయాడు.ఆ పిల్లవాడిని అక్కడ జాయిన్ చేసినప్పుడు ఉన్న రోమేష్ అది ఎపిండిసైటీస్ అని చెప్పి,రాత్రవ్వడం వల్ల తరువాతి రోజు సోనోగ్రఫీ చేయించి,రిపోర్ట్స్ వచ్చాక చికిత్స చేయవచ్చని చెప్తాడు.తరువాతి రోజు ఆ పిల్లవాడిని చూడటానికి వచ్చిన డాక్టర్ అస్తానా ఓటి ఉన్నప్పటికీ కూడా లేదని చెప్పి తరువాతి రోజు ఆపరేషన్ అని చెప్తాడు.దీన్ని ప్రశ్నించిన రోమేష్ కు వైద్యం సేవే కాదు వ్యాపారం కూడా అని చెప్తాడు.
తరువాతి రోజు సర్జికల్ కిట్ తీసుకురావవడానికి తల్లి నందితా వెళ్ళినప్పుడు ఆకలికి తట్టుకోలేక అంకుర్ కొన్ని బిస్కట్లు తింటాడు. అదే విషయం అతను డ్యూటీ నర్స్ కు చెప్తాడు. వెంటనే ఆమె అస్తానాకు చెప్తుంది.దీని వల్ల ఆపరేషన్ వాయిదా వెయ్యలేనని చెప్తాడు. ఆపరేషన్ కు ముందు ఏమీ తినకూడదు.ఒకవేళ తింటే రైల్స్ ట్యూబ్ ఆపరేషన్ లో ఉపయోగించాలి. ఆ విషయం మర్చిపోయిన అస్తానా మామూలుగా ఆపరేషన్ చేసేస్తాడు.ఆపరేషన్ తర్వాత అంకుర్ కి వాంతులై లంగ్స్ దెబ్బతిని,కోమాలోకి వెళ్ళి రెండు రోజుల్లో మరణిస్తాడు.ఇది బయటకు రాకుండా ఉండటానికి ఆపరేషన్ కు గంట  ముందు తిన్నట్టు రాసిన రిపోర్ట్ లో 1 గంటకు ముందు తిన్నట్టు ఉన్న దాన్ని 9 గా నంబర్ మారుస్తాడు.ఆ డ్యూటీ నర్స్ ను ఆ రోజే డబ్బులిచ్చి వేరే చోటుకు పంపేస్తాడు అస్తానా.
తమ దురదృష్టమనుకుని వెళ్ళిపోతుంది నందితా కొడుకు శవంతో. ఆ ఆపరేషన్ లో రోమేష్ ఉండడు.రియా ఉంటుంది. ఎంత అడిగినా అస్తానాకు వ్యతిరేకంగా వెళ్తే తనకు భవిష్యత్తు ఉండదని అతనికి నిజం చెప్పదు.దాని వల్లే ఇద్దరూ విడిపోతారు కూడా.
జరిగింది అర్థం చేసుకున్న డాక్టర్ రోమేష్ జరిగింది నందితాకు చెప్తాడు.అంకుర్ కు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని కేసు ఫైల్ చేస్తారు.వారి లాయర్ గా ఉంటున్న స్త్రీ కూడా అస్తానా లాయర్ తో కంప్రమైజ్ అవ్వడం గమనిస్తాడు రోమేష్ .దానికి కారణం అతనితో సంబంధం ఉన్న ఆమె గర్భవతి అవుతుంది.అతను అబార్షన్ చేయించుకోమంటే పిల్స్ మింగుతుంది.వారిద్దరూ ఒకే కారులో ఉన్నది గమనించిన రోమేష్ అందుకే ఆమె హాస్పటల్ నే తప్ప అస్తానాను తప్పు పట్టడం లేదని అర్థమౌతుంది.అదే ప్రశ్నించడానికి నందితాతో ఆమె దగ్గరకు కలిసి వెళ్ళేసరికి అబార్షన్ పిల్స్ మింగేసరికి ప్రమాదకర స్థితిలో ఉంటే వారే హాస్పటల్ లో చేర్పిస్తారు.ఆమె వారికి సారీ చెప్తుంది.ఓ బిడ్డను పొగొట్టుకున్న తల్లిగా ఆమె కచ్చితంగా కరక్ట్ లాయర్ అని నందితా ఆమె సారీ చెప్పినప్పుడు అంటుంది.అలా లాయర్ లింక్ ను కూడా స్త్రీ మాతృత్వ క్షోభతో లింక్ చేశాడు దర్శకుడు
ఆ డ్యూటీ నర్సును తీసుకువచ్చినా ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పదు అస్తానా వాళ్ళకు భయపడి. తర్వాత అంకుర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఫోటోకు వామ్టింగ్ త్రెడ్ ఉండడం చూసిన రోమేష్ ఆ త్రెడ్ కచ్చితంగా అంకుర్ ఆపరేషన్ అయ్యాక చేసుకున్నాడన్నదానికి సాక్ష్యం అని,దాన్ని డిఎన్ ఏ కు పంపితే ఇక తిరుగులేని సాక్ష్యం అని చెప్తాడు.అందుకని ఓ నాలుగురోజులు గడువు అడుగుతుంది లాయర్ .కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకున్న అస్తానా బృందం అంకుర్ ,లాయర్ల దగ్గర ఉన్న ఆ రిపోర్టులనూ తమ హస్తగతం చేసుకుని,దానితో పాటు ఆ డి ఎన్ ఏ ల్యాబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ధ్వంసం చేస్తారు.దానితో వారికి ఏ సాక్ష్యం లేకుండా పోతుంది. ఇక వేరే ఆప్షన్ లేక రియాను సాక్ష్యంగా ఉండమని అడుగుతాడు రోమేష్ .కోర్టులో ఆమె కూడా సాక్ష్యంగా ఉండకపోవడం కేసు కొట్టేస్తారు. అంతా అయిపోయాక రియా రిజైన్ చేస్తున్నానని అస్తానాకు చెప్పినప్పుడు అతను తాము చేసింది తప్పు కాదని,ఓ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఓడిపోయినట్టు కాదని అంటాడు.అతను మాట్లాడింది ఫోనులో వీడియో తీసిన రియా రోమేష్ ప్లాన్ ప్రకారం మీడియాకు ఇవ్వడంతో అతనికి మూడేళ్ళ శిక్ష,అంకుర్ కు 10 కోట్ల నష్ట పరిహారం ఇచ్చేలా తీర్పు వస్తుంది. నిజానికి సంఘటన ఇదే క్రమంలో జరగకపోయినా అనురాధ అనే పెషేంట్ కు అలర్జీ అని వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె మరణించింది,దాని మీద కేసు వేసిన ఆమె భర్తకు నష్ట పరిహారం కూడా వచ్చింది. మన దృష్టికి రాని కేసులు ఎన్నో.
వైద్య నిర్లక్ష్యం అనేది నేడు ఓ జాడ్యంలా మిగిలిపోయే ఉంది.దానికి కారణం ఇటువంటి ఉదంతాల్లో రాజీలు,కోర్టులో కేసు లాంటి తతంగాల వల్ల మరణించిన వ్యక్తి తిరిగిరానప్పుడు ఈ తలనొప్పులు ఎందుకనే భావన ఉండిపోవడం వల్ల. ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. వైద్యం వ్యాపారానికి దూరమైతేనే ఈ సమస్య అంతమవుతుంది.డాక్టర్ అవ్వడానికి పెట్టిన ఇన్వెస్టిమెంట్ ను ఎన్నో రెట్లు అధికం చేసుకోవాలనే ధోరణి వ్యాపారత్మకంగా ఆలోచించే వైద్యుల్లో అంతమైతేనే ఇటువంటి నిర్లక్ష్యాలు సంభవించవు. ఇక్కడ వైద్య నిర్లక్ష్యం మాత్రమే సమస్య కాదు, తమ వ్యాపారం కోసం అవసరం లేకుండా హాస్పటల్ లో ఎక్కువ రోజులు ఉంచడం,వ్యాపార ధోరణిని అవలంబించే దృక్కోణం కూడా. వైద్యం అంటే వ్యాపారం కాదు, నిజంగా దేవుడిలా కాపాడేవాడు అని డాక్టర్లందరూ మనసా,వాచా,కర్మణా నమ్మితేనే ఈ సమస్య అంతమౌతుంది. సినిమాల్లో మనకు చూపించేది చాలా తక్కువే.నిజ జీవితంలో దీనికి ఎన్నో రెట్లు ఉంటుంది.ఇటువంటి సినిమాకు విపరీతమైన ఆదరణ అయితే దక్కలేదు.కానీ కచ్చితంగా ఆలోచింపజేసే సినిమా అని ఒప్పుకోక తప్పదు.

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ