ఇదీ గెలుపు గమ్యం ..
ఇదీ గెలుపు గమ్యం ..
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
ఓ చిన్న పల్లెటూల్లో పుట్టి పెరిగారు. ఆ మిత్రులు. కబడ్డీ వాళ్లకు ఎంతో ఇష్టమైన ఆట. ఓసారి
పొరుగూరికి కబడ్డీ పోటీ చూడటానికి వెళ్లారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆటలో
పాల్గొనాల్సిన ఓ టీమ్ అక్కడికి హాజరు కాలేకపోయింది. ఎవరో ఒకర్ని ఆ టీమ్ స్థానంలో
తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొదటి నుండి ఈ పల్లెటూరి మిత్రుల ఆసక్తిని గమనిస్తాడు కోచ్.
వారికి అడే అవకాశం కల్పిస్తాడు. ఆ ఆట స్థాయికి తగ్గ సాధన చేసి ఉండకపోవడం, గెలవాలన్న తపన లేకపోవడం వల్ల వారు సరిగ్గా ఆట ఆడరు.
ఆట నగం అయిన తర్వాత కోచ్ వాళ్లని పిలిచి వాళ్ల దగ్గర ఎన్ని
డబ్బులున్నాయని అడుగుతాడు. అప్పుడు వారు తిరిగి వెళ్లటానికి చార్టీలు మాత్రమే
ఉన్నాయని చెప్తారు. అప్పుడు వాళ్లదగ్గర ఆ డబ్బులు తీసుకుని ఓ ఫ్రూట్ జ్యూస్
కొనిస్తాడు వారికి.
ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా తిరిగి వెళ్లలేని పరిస్థితి.
తిరిగి ఇంటికి వెళ్లాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిందే. అది ఒక్కటే దారి వారు
ఇంటికి తిరిగివెళ్లడానికి. పట్టుదలతో ఆడి గెలుస్తారు. ఇది 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమా కథలో ఓ భాగం.
ఆట కేవలం ఓ అవకాశం
అయినప్పుడు, 'గెలుపే ముఖ్యం' అన్న చందాన ఆడనివారు అదే ఆట తమ
జీవితం ఆనుకున్నప్పుడు సాధన తగ్గినా సర్వశక్తులు ఒడ్డి కేంద్రీకరించి ఆడి
గెలిచారు.
*******
అవకాశాలతో గెలుపు రావడం అనేది ఎప్పుడూ జరుగదు.. అనుభవించే ప్రతి పరిస్థితిని గెలుపుకి
గోల్ గా అనుకుని పయనం సాగిస్తేనే విజయం వరిస్తుంది..
గెలుపు అనే పయనంలో రెండే
రెండు దశలుంటాయి. ‘మనం గెలువగాలం’ అనేది మొదటి దశ. ఇది పోతే ఇంకోటి
అని అనుకోకుండా ప్రతి స్థాయిలో గెలుపుని నిలబెట్టుకోవడం’ అనేది రెండో దశ.
మొదటి దశ ‘భీమిలి కబడ్డి జట్టు’లో చెప్పింది. రెండో దశ గురించి కువంగా
చెప్పాలంటే ‘విషాన్ని కూడా అమృతంగా మలచుకోవాల్సిన దశ’ దీనికి బిల్వా అనే భక్తుడి
కథ సరిగ్గా సరిపోతుంది.
మధ్యప్రదేశ్ లో బిల్వా అనే పేరున్న ఒక భక్తుడుండేవాడు.
అతడు పిలిస్తే పాములు అతడి చుట్టూ చేరేవి. అంటే పాములకు అంత దగ్గర జాతికి
చెందినవాడని అర్థం.
మూర్ఖపు కట్టుబాట్లకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఎన్నోసార్లు
దండనలకు గురి అయ్యాడు. అతనికి మరణదండన విధించారు. అతనికి అత్యంత సన్నిహితమైన పాములచేత
మరణం నిర్ణయించి రు. కదలడానికి వీల్లేకుండా చెట్టుకి కట్టేశారు.
నల్లతాచును రెచ్చగొట్టి అతన్ని కనిపించారు. నల్లతాచు
కాటువిషం ఎక్కి అతడి రక్తం గడ్డకట్టుకోవటం ప్రారంభమైంది. రక్తాన్ని ఇతర భాగాలకు పంపటం
గుంటకు కష్టమైంది. శ్వాస భారమైంది. అంతకు ముందెప్పుడూ అతడు తన శ్వాసను గమనించలేదు.
సహజంగా జరిగిపోయేదాన్ని మనిషి అంతగా పట్టించుకోడు.
అందులో ఏదైనా అడ్డు ఏర్పడితే దాని ప్రాముఖ్యం తెలుస్తుంది. బిర్వా శ్వాసను గమనించడం
ప్రారంభించాడు. ఉచ్చ్వాస, నిశ్వాసల రూపంలో గాలి అతని ప్రాణాన్ని, అతని శరీరాన్ని ముడి పెట్టటాన్ని ఆతడుప్పుడే గమనించాడు. అదే
ధ్యానమని తెలియకుండానే చేశాడు.
తగ్గిపోతున్న శ్వాసను జాగ్రత్తగా పరిశీలిస్తుండగా
అతనిలో పెనుమార్పు ఏర్పడింది. మోక్ష మార్గంలో అతడు తెలీకుండానే మొదటి అడుగు పెట్టాడు.
ఆనంద మార్గంలో తొలి అడుగు వేయ గలిగాడు. అతనికి విషం అని ఎక్కింపబడ్డదే గొప్ప
అమృతంగా మార్పు చెందింది. ఇదే కృష్ణుడు అర్జునుడికి చెప్పింది. 'అమృతమని భావింది నువ్వు దేన్ని ఆనందంగా సేవిస్తావో అదే
విషం. నీకు ఏది విషం అన్పిస్తుందో అదే అమృతం'.
ఈ కథను సూక్ష్మంగా పరిశ్చలిస్తే బిల్వాకు మరణం అనేది
అతనికి అత్యంత సన్నిహితమైన పాములతో నిర్ణయించారు. జీవితం కూడా అంతే. అప్పటివరకూ ఆకాశాన్ని అందుకున్న వాడిని
నెత్తిన పెట్టుకునే వారే అమాంతం అధఃపాతాలానికి తోక్కేస్తారు. దానికి వివిధ కారణాలు
ఉండొచ్చు. ఏ గెలుపైతే ఎప్పుడూ మన వెంటే ఉంటుందని అనుకుంటామో అదే మనతో దోబూచులాడుతూ
ఉంటుంది.
మన బలాలే బలహీనతలుగా
మారే దశ కూడా వస్తుంది. ‘గెలవడం’ అన్నదే మనం శ్వాస పీల్చుకోవడం వెనకున్న నిజమైన
ఉద్దేశం అన్నంత గాఢ దీక్ష కలిగి ఉండటమే గెలుపు గమ్యంలో ఎప్పుడూ మనల్ని పట్టి ఉంచే
ఇంధనం.
ఒక్కసారి ఎక్కువగా రిలాక్స్ అయ్యామా..
ఇక అంతే సంగతి! ఐనిస్టీన్ తన జీవితాన్నంతా ధారపోసి ప్రపంచానికి కొన్ని
సిద్ధాంతాలను అందించాడు. అప్పట్నించే ఈ ప్రపంచం అంతకుముందు ఉన్నట్లు లేకుండా
పోయింది. ఎడిసన్ జీవితం ప్రపంచంలోని మనుషుల జీవన విధానాన్ని మార్చేసింది.. మహాత్మా
గాంధీ, నెల్సన్ మండేలా ఒక కొత్త సంస్కృతికిజన్మనిచ్చారు.
మిల్టన్, టాగూర్ కవిత్వానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు.
త్యాగయ్య సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. జాకీర్ హుసేన్ తబలాకి ఒక కొత్త
హోదాని కల్పించాడు. రోజర్ బారిస్టర్, ఎడ్మండ్ హిల్లరీ, మానవుల సామర్థ్యాన్ని కొత్తగా నిర్వచించారు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో ప్రపంచం ఆలోచించే విధానాన్ని మార్చివేశారు.
గెలుపుకి ఎన్నో నిర్వచనాలు ఉండవచ్చు. కానీ
ప్రతి మనిషికి, తనను తాను ఉన్నత స్థితికి తీసుకువెళ్లే సామర్థ్యమే కాక, మానవజాతి సమిష్టి చైతన్యాన్ని కూడా ఉన్నత స్థితికి
తీసుకెళ్లగల శక్తి ఉంది అని నిరూపించినవారే పైన పేర్కొన్న వారందరూ.
ఒక్కసారి గెలుపే గమ్యంగా
మారిన తర్వాత దానిని ప్రపంచ స్థాయి ఉన్నతికి తీసుకెళ్లడమే 'గెలుపునిఎప్పటికీ
సజీవంగా ఉంచగలదు' అదే అత్యున్నత గెలుపు
గమ్యం.
* * *

Comments
Post a Comment