శీల హత్యకు బాధ్యులెవరు?

శీల హత్యకు బాధ్యులెవరు? 
( 'చిలప్పుల్ పెన్ కుట్టి ' సినీ సమీక్ష) 
 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



 
ఎనిమిదేళ్ళ  అసిఫా అత్యాచారం ప్రపంచాన్నే కదిలించింది. బాలికలపై, యవ్వనిలపై జరిగే అత్యాచారాలు పెరుగుతూనే ఉంది నేటికీ. 'చిలప్పుల్ పెన్ కుట్టి ' అనే మలయాళం సినిమా ఈ అత్యాచారానికి గురైన బాలికల గురించి తెలిసిన తర్వాత సానుభూతి ప్రదర్శించే వాళ్ళంతా కూడా ఆ విషయం గురించి వివరాలు తెలియనంతవరకు వదంతుల ప్రాతిపదికగా వారి కుటుంబాన్ని,వారిని ఎలా మానసిక హత్యకు గురి చేస్తారో కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. సమాజంలో ఉన్న ఈ వదంతులపై ఆసక్తిని గమనించిన నేరస్తులు దీనిని తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలా వినియోగిస్తారో కూడా తెలిపిన సినిమా ఇది. 
నిత్య,వందన బాల్యం నుండి స్నేహితులు. వారిద్దరు పదవ తరగతి చదువుతున్నారు. కేరళలో నివాసం. ఓ సమ్మర్ కు నిత్య తన కుటుంబంతో కలిసి కాశ్మీర్ వెళ్తుంది. అక్క ఫాతిమా అనే పాప ఆమెకు పరిచయం అవుతుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఫాతిమా,ఓ గుర్రం తో కలిసి వెళ్తూ ఉండగా నిత్య ఆమెను అడిగి పూలు తీసుకుంటుంది. అలా తీసుకుని కారెక్కాక ఫాతిమాను ఎవరో దుండగులు బలవంతంగా తీసుకుపోవడం ఆమెను కలచి  వేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చాక కొన్ని రోజులకు ఆమెను రేప్ చేసి హత్య చేశారనే వార్త సంచలనం అవుతుంది.ఇది కూడా కాట్వా కాశ్మీర్ లో చూపడం వల్ల అసిఫా సంఘటన నుండి ప్రేరేణ పొందినదని ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఈ సంఘటనతో నిత్య ఎంత సున్నిత మనస్కురాలో, ఎదుటి వారి బాధల పట్ల ఎలా కదలిపోతుందో మనకు సినీ దర్శకులు చూపిస్తారు. 
వందనకు తల్లి మరణిస్తుంది. తండ్రి ఆమెను ఎంతో ప్రేమతో పెంచుతూ ఉంటాడు. వందన తండ్రి పేరు గగన్. అతనికి ప్రాణ స్నేహితుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్ని కృష్ణ. వందన, నిత్య ఎప్పుడు కలిసే స్కూల్ ,ట్యూషన్ కు వెళ్తారు. ఇద్దరు కలిసే తిరిగి వస్తారు. వందనకు, నిత్యకు మధ్య ఓ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. వారు రోజు స్కూల్ కు వెళ్తున్న సమయంలో విపిన్ అనే అతను వీరి వెంట వాస్తు ఉంటాడు. వందనను ప్రేమిస్తూ ఉంటాడు అతను. ఎప్పుడు ఆ విషయం బయట పెట్టడు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు వందన స్కూల్ నుండి ఇంటికి తిరిగి రాదు. 
ఆ కేసును ఉన్ని కృష్ణ తాను ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు, తాను వందన ఎక్కడ ఉన్నా సరే తిరిగి తీసుకువస్తానని ఆమె తండ్రికి హామీ ఇస్తాడు. తర్వాత విపిన్ తో ఆమె వెళ్ళిపోయిందని చెప్తారు. దానితో ఆమె లేచిపోయిందనే విషయం అందరూ నమ్ముతారు. వందన స్నేహితురాలు నిత్య స్కూల్ కు వెళ్తున్నా సరే ఆమెను కూడా అలానే ఆమె అవమానిస్తారు తోటి విద్యార్ధులు. కానీ నిత్య మాత్రం తన స్నేహితురాలు అలా చేయదని గాఢంగా నమ్ముతుంది. అలా ఆ తండ్రి ,వందన శీలాలను తమ మాటలతో హత్య చేస్తారు అక్కడి వారంతా. 
నిత్య వందనకు తనకు మధ్య ఉన్న కోడ్ లాంగ్వేజ్ ప్రకారం ఆ స్కూల్ గోడలపై ఉన్న సంఖ్యాల్ని రాసుకుని మొత్తం డీకోడ్ చేసి అసలు ఏం జరిగిందో అర్ధం చేసుకుంటుంది కొంతమేరకు. తన స్నేహితురాలి మరణానికి కారణం ఉన్ని కృష్ణ అని తెలుసుకుని అతన్ని హత్య చేయాలని అతన్ని కత్తితో పొడిచి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోతుంది. అప్పుడు వందన కేసు వెలుగులోకి వస్తుంది. 
అప్పటివరకూ తానే ఆ కేసును చూసుకుంటున్నానని చెప్పిన ఉన్ని కృష్ణ ఆ కేసును అసలు ఫైల్ చేయలేదని తెలుస్తుంది. ఓ రోజు వందన మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడూ ఆమె బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీస్తాడు. ఆమె ఎంత ప్రాధేయపడ్డ ఆ వీడియో డిలీట్ చేశాడు. తాను చెప్పినట్టు చేస్తేనే డిలీట్ చేస్తానని అంటాడు.  ఆమెను బెదిరించి ఫోటోగ్రాఫర్స్ అయిన ప్రభాస్ వాళ్ళకు ఆ వీడియో ఇచ్చానని ,వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఆ వీడియో డిలీట్ చేస్తారని చెప్తాడు. అలా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది వందన. ఆ వీడియో డిలీట్ చేయడం  కోసం ఆమె చేత నగ్నంగా ముఖం కనబడకుండా ఇంకో వీడియో షూట్ చేస్తారు.ఆ తర్వాత ఆమెను ఓ చోటకు రప్పించి రేప్ చేస్తాడు ఉన్నికృష్ణ. అప్పుడు ఆమె మరణిస్తుంది. ఆమె మరణించాక కూడా ఆమెను రేప్ చేస్తారు ప్రభాస్ తో సహా ముగ్గురు. ఆ విషయాన్ని కప్పి పుచ్చడానికి ఆమె మృతదేహాన్ని మెడికల్ మార్చూరికి తరలిస్తాడు ఉన్నికృష్ణ. అదే సమయంలో ఈ విషయాన్ని తప్పు దారి పట్టించడానికి ప్రభాస్ స్టూడియోలో పని చేసే విపిన్ ను ఆ ఊరి నుండి వేరే చోటుకు పంపించి, ఆ అనుమానం వారిద్దరు లేచిపోయారనే పుకారు బలపడేలా చేస్తాడు ఉన్నికృష్ణ. 
నిత్య చొరవతో సిఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం ప్రభాస్ బృందాన్ని ,ఉన్ని కృష్ణ ను కస్టడీలోకి తీసుకోవడంతో అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉన్నికృష్ణను కలిసి వందన తండ్రి 'నువ్వు ఉన్న ప్రపంచంలో నేను ఉండకూడదు' అని అతని ముందే కత్తితో గొంతు కోసుకుంటాడు. అలా ఆ నిజాలు బయట పడటం ,మీడియా కూడా కవర్ చేయడంతో సినిమా ముగించిన ఓ రకమైన మానసిక భావాన్ని మాత్రం ప్రేక్షకుల మనసుల్లో మిగులుస్తుంది. 
'చిలప్పుల్ పెన్ కుట్టి '  అంటే   ' అమ్మాయి కొన్నిసార్లు'అని అర్ధం. అమ్మాయిల్లో ఉండే ధైర్యం కొన్నిసార్లు  తమ స్నేహితురాళ్ళైన వారిని,ఇతర స్త్రీలను ఇటువంటి అత్యాచారాలను ఎదిరించడానికి కూడా  కా వినియోగిస్తుంది అనే అర్ధాన్ని మనం ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో లేని ధైర్యం ఇతరుల పట్ల కదిలిపోయే మనసున్నప్పుడు మాత్రం కచ్చితంగా వస్తుంది అనే సందేశం కూడా ఈ సినిమా తెలియజెప్తుంది. 
అమ్మాయి కనిపించలేదు అనగానే ఆ అమ్మాయి మీద లేనిపోని వదంతులు సృష్టించి ఆమె శీలహత్య ,ఆమె కుటుంబ పెంపకాన్ని శంకించడం వంటి వాటి పట్ల సమాజం మారాలనే సందేశం కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా ఉంది. అమ్మాయిలకు జరిగే హానీ ఓ పక్కన, ఇంకో పక్క నిజానిజాలు తెలియకుండా ఆ అమ్మాయి శీల హత్య చేసే ఈ సమాజం ఈ రెండింటి ప్రభావం ఆ కుటుంబం పట్ల ఎలా ఉంటుందో ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, ఇవన్నీ ముందే ఆలోచిస్తే అప్పుడైనా వారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందేమో! 
                            *     *      *   


.

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ