ప్రేమ మరణం
చదువరి-7 :
ప్రేమ మరణం
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
మనిషి యవ్వనంలో ఉన్నప్పుడూ ప్రేమ భావన కలగటం,పరస్పరం ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ కలగటం సహజం. కానీ ఆ ప్రేమకూ అమానుషత్వానికి మధ్య ఘర్షణ ఏర్పడితే యువత దేనికి ప్రాధాన్యమిస్తుంది అని తెలిపేదే టాల్ స్టాయ్ 'విందు తర్వాత' కథ. ఆ రాత్రి మిత్రులంతా మాట్లాడుకుంటున్న సమయంలో వారిలో ఒకడైన ఇవాన్ ఓ రాత్రి జరిగిన సంఘటన తన జీవితాన్నే మార్చేసిందని ఆ సంఘటన గురించి చెప్తాడు.
ఇవాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. చేతిలో బాగా డబ్బు ఉంది. స్నేహితుల్తో, అమ్మాయిల్తో ఆడుతూ పాడుతూ, తాగుతూ, డ్యాన్సింగ్ పార్టీలకు తిరుగుతూ కులాసాగా గడిపేవాడు. అలాంటి సమయంలోనే వారెంకా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.1840 లో జరిగిన సంఘటన ఇది. ఆమె తండ్రి కల్నల్ హోదాలో ఉన్న సైనికాధికారి. ''ఫ్రొవైటెడ్ '' పండగ ఆఖరి రోజున చక్రవర్తి ఆంతరంగికుడైన ఒకాయన గొప్ప విందు ఇచ్చాడు. దానికి ఇవాన్ వెళ్తాడు. అక్కడికి వారెంకా తల్లిదండ్రులతో వస్తుంది. అక్కడ వారెంకా తో డ్యాన్స్ చేస్తాడు. వారి ప్రేమ గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. అడియా అయిపోయాక ఇంటికి వస్తాడు ఇవాన్.
పటాలంలో నుండి పరారైన ఓ వ్యక్తిని సైనికులు అతని రెండు చేతులు తుపాకీకి విరిచి కట్టారు. అతను గడ గడ వణకిపోతుంటే వరసలు దీరిన సైనికులు అతన్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. దెబ్బ పడినప్పుడల్లా ఆ ఖైదీ బాధతో .''సోదరులారా! దయ చూపండి "" అంటున్నాడు. వారిని నడిపిస్తుంది వారెంకా తండ్రి. ఆ సంఘటన జరిగాక ఇవాన్ మనసులో ప్రేమ మరణించింది.
"నేను చూసింది ఘోరమైన దురాగతమని నేను అనుకున్నట్లు మీరు భావిస్తున్నారేమో కానీ అది కాదు. నేను చూసిందంతా అంత నిబ్బరంగా జరిపించి, అదంతా అవసరమేనని అందరిచేతా అంగీకరించబడినప్పుడు వారంతా గ్రహించింది నేను గ్రహించలేదన్నమాట. అదేమిటో ఎంత ప్రయత్నించినా గ్రహించలేకపోయాను. అందువల్లే మిలిటరీ ఉద్యోగంలో చేరలేకపోయాను. అదే కాదు ఏ ఉద్యోగంలోనూ చేరలేకపోయాను ''అన్నాడు ఇవాన్ ఈ కథలో.
ప్రేమకూ అమానుషత్వానికి ఘర్షణ ఏర్పడితే యువత దేనికి ప్రాధాన్యమిస్తుంది? దిగజారుతున్న మానవ విలువల పట్ల పాఠకుల్లో జాగృతిని కలిగిస్తూ వారి చిత్త సంస్కారాన్ని పెంపొందించే కథ ఇది.
""మనుషుల్లో మార్పు తీసుకువచ్చే ముందు మనుషులు జీవించే పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం అవసరం'' అనే విషయాన్ని టాల్ స్టాయ్ తో పాటు అతని మిత్రా బృందం జరిపే చర్చను ముగిస్తూ అందులో ఒక మిత్రుడు,''ఇది మంచి, చెడు అని అంనిషి తనంతట తాను నిర్ణయించలేడని, అంతా నిర్ణయించేది పరిసరాలే అని మీరు అంటారు. నేను మాత్రం ఘటనాఘటన ఫలితం అంటాను.దేనికి ఉదాహరణ నా కథే."అని అన్నాడు. అలా ఆ మిత్రుడు చెప్పిన కథే ఈ ''విందు తర్వాత "కథ.
రచయితగా టాల్ స్టాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను నమ్మిన సిధ్హంతాలని ,అనుభవించిన వాటినే కథాంశాలుగా స్వీకరించాడు ఆయన . ప్రతి రచనలో మానవత్వం దేని కింద నలిగిపోతుందో తెలిపే పరిణామక్రమం ఆయన కథాంశాల్లో అంతర్లీన సూత్రంగా ఉంటాయి.
ప్రేమ ఎంత గొప్పదైనా దానిని క్రూరత్వం ,అమానుషత్వం హరించివేస్తాయని చెప్పే కథ ఇది. అలాగే ఓ భావానికి దాని వైరుధ్య భావానికి మధ్య ఘర్షణ ఏర్పడితే మొదటి భావన మరణిస్తుందనే సూత్రం చెప్పే కథ ఇది.
* * *

Comments
Post a Comment