హాలీవుడ్ బ్లాక్ లిస్ట్

హాలీవుడ్ బ్లాక్ లిస్ట్ 
         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ,రష్యాకు అమెరికాకు మధ్య కోల్డ్ వార్ (1947-1991) జరుగుతున్న సమయంలో 20 వ శతాబ్దం  మధ్యలో 1946 నుండి 1960  వరకు కూడా దాని ప్రభావం హాలీవుడ్ కళాకారుల జీవితాలపై చెరగని ముద్రా వేసింది. 1938 లో  హౌస్ కమిటీని అమెరికా స్థాపించింది. దీని ముఖ్య వీధి ఏమిటంటే ఎవరైతే కమ్యూనిస్టులు ,కమ్యూనిజ సానుభూతిపరులు ఉంటారో వారిని రాజద్రోహం లేదా సబ్వెర్షన్ (చట్టానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు విప్లవం వంటివి ) వారికి ఉద్యోగాలు లేకుండా చేయటం. దీనిని 1975 లో రద్దు చేశారు. దీనిలో భాగంగా హాలీవుడ్ లో ఎంతో మంది  కళాకారులను (యాక్టర్స్ ,డైరెక్టర్స్ ,స్క్రీన్ రైటర్స్ ,మ్యూజిషియన్స్  24 క్రాఫ్త్స్ వారిని ) హాలీవుడ్ బ్లాక్ లిస్ట్ పేరుతో వారికి సినీ రంగంలో అవకాశాలు లేకుండా చేశారు.  జూన్ 22,1950 న రెడ్ చానల్స్ అనే పాంప్లెట్ కింద 151 మంది హాలీవుడ్ కళాకారులకు అవకాశాలు లేకుండా చేశారు. ఈ బ్లాక్ లిస్ట్ అనేది 1960 వరకు కూడా కొనసాగింది. అమెరికా చరిత్రలోని ఈ హాలీవుడ్ బ్లాక్ లిస్ట్ ఉదంతం ఆధారంగా తీసిన సినిమానే 'గిల్టీ బై సస్పిషన్.' 
డేవిడ్ అనే  సక్సెస్ ఫుల్ హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాన్స్ నుండి ఓ సినిమా తీసి వచ్చాక, హౌస్ కమిటీ అతన్ని పిలుస్తుంది. ఎవరైనా కమ్యూనిస్టులు ఉన్నా వారి పేర్లు చెప్పమని తన స్నేహితుల్లో .కానీ డేవిడ్ దానికి నిరాకరిస్తాడు. ఓ యాక్టింగ్ ఏజెన్సీ హెడ్ గా ఉన్న జనుక్ డేవిడ్ ను ఈ కమిటీ నుండి పేరు తీయించడానికి ఓ లాయర్ ని ఏర్పాటు చేస్తాడు. కానీ డేవిడ్ అమాయాకులైన తన స్నేహితుల పేర్లు చెప్పడానికి నిరాకరిస్తాడు.
దీని వల్ల అతనికి ఏ అవకాశాలు రావు. ఉన్న ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోవాల్సి వస్తుంది. అతని భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. అదే సమయంలో అతని స్నేహితులైన జో అనే దర్శకుడిని, బన్నీ అనే యాక్టర్ ని ,డోరేత్ అనే హీరోయిన్ ను కూడా ఈ లిస్టులో ఉంచడం వల్ల వారికి ఏ అవకాశాలు రావు. డోరేత్ ని కమ్యూనిస్ట్ అని ప్రకటించడం వల్ల ఆమె భర్త ఆమెను వదిలేసి ఆమె కొడుకుని కూడా  ఆమెను దూరం చేస్తాడు. అలా నిరుద్యోగంతో అవకాశాలు లేక ,కొడుకు కూడా దూరం అయిన ఆమె ఆ బాధతో కార్ డ్రైవింగ్ సరిగ్గా చేయక లోయలో పడి మరణిస్తుంది.
జో అమాయకులైన వారి పేర్లు చెప్పి వారి జీవితాల్ని నాశనం చేయడం ఇష్టం లేక అమెరికా వదిలి వెళ్ళిపోతాడు. బన్నీ మాత్రం డేవిడ్ దగ్గరికి వచ్చి అతని పేరు చెప్తానని చెప్పి వెళ్ళిపోతాడు. డేవిడ్ మాత్రం అక్కడే ఉంటాడు. అతనికి ఏ అవకాశం వచ్చినా అది వెనక్కి వెళ్లిపోతూ ఉంటుంది. ఆఖరికి ఓ రిపైర్ షాపులో కూడా పని చేసుకోనివ్వరు. చివరకు కూడా కమిటీ సెషన్ లో ఎవరి పేరు చెప్పాడు డేవిడ్. అతని భార్యను కూడా కమ్యూనిస్ట్ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు కమిటీ సభ్యులు. డేవిడ్ కూడా ఆ సెషన్ లో తన హక్కుల గురించి ప్రశ్నిస్తాడు. సినిమా అక్కడితో ముగిసినా, అప్పటి  బ్లాక్ లిస్ట్ వల్ల జీవితాలు ఎలా కోల్పోయారో కళ్ళకు కటినట్టు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 
తనను తాను రక్షించుకోవడానికి ఎవరో ఒకరి పేరు చెప్తే తప్ప దిక్కు లేని పరిస్థితుల్లో మనఃసాక్షి అంగీకరించక అలా బ్లాక్ లిస్ట్ కు బలైన వారు ఎంతో  మంది. దేశాల మధ్య జరిగే యుద్ధాలు పౌరుల హక్కుల్ని ఎలా కాలరాస్తాయో తెలిపే సినిమా ఇది. పౌరుల ప్రాథమిక హక్కులు కూడా దేశం పేరిట హరించబడతాయి అని ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. 
                            *     *     * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ