మట్టికల
సినీ సంచారం
మట్టికల
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)
బాల్యంలో
అందరం ఎన్నో కలలు కంటాము. ఆడ పిల్లలైతే నిజంగానే తమ కోసం ఒక రాకుమారుడు వస్తాడని కూడా
ఎదురు చూస్తూ ఉండే స్థితిలో ఉంటారు. అలాగే ఎనిమిదేళ్ళ ఆ అమ్మాయి తన తండ్రి కొలీగ్ అయిన పాతికేళ్ళ వ్యక్తితో ప్రేమలో పడింది.
ఆ బాల్యపు ప్రేమ కల ఏమైందో, ఎలా మలుపులు తిరిగిందో చెప్పేదే రష్యన్ సినిమా
‘డ్రీమ్స్ ఇన్ ద ప్లాస్టిసిన్.’ ప్లాస్టిసిన్
అంటే మట్టితో బొమ్మలు తయారు చేసే వారు ఉపయోగించే ఓ రకమైన మట్టి. ఆ కలలు కన్న ఆ అమ్మాయి
ఆ ప్లాస్టిసిన్ తో బొమ్మలు తయారు చేసే కళాకారిణి. బాల్యంలోనే బోరిస్ ను తన రాకుమారుడు అనుకుని ఓ బొమ్మ కూడా చేసింది.
అందుకనే ఈ సినిమాకు ‘డ్రీమ్స్ ఇన్ ద ప్లాస్టిసిన్’ అనే పేరు పెట్టి ఉండవచ్చు.
సెర్గి పెట్రోవిచ్
,ఎనాసియా దంపతుల కూతురు ఒక్సానా. పెట్రోవిచ్ రోడ్లు వేసే ప్రాజెక్టులు స్వీకరించే
వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని దగ్గర బోరిస్ పని చేస్తూ ఉంటాడు. బోరిస్,పెట్రోవిచ్ ల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది. ఒక్సానా బాల్యం నుండే బోరిస్
పట్ల ఇష్టం పెంచుకుంటుంది. బోరిస్ తనతో పాటే పెట్రోవిచ్ దగ్గర పని చేసే వికాను పెళ్ళి
చేసుకోబోతున్నట్టు ప్రకటిస్తాడు. దానితో ఒక్సానా ఎంతో బాధ పడుతుంది.
వికా బోరిస్
ను ఇష్టపడదు, ప్రేమించదు. కానీ అప్పటికే పెట్రోవిచ్ తో సంబంధం కలిగి ఉన్న
వికా గర్భవతి అవుతుంది. ఆ బిడ్డకు ఓ మంచి భవిష్యత్తు ఇవ్వాలనే బోరిస్ ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది.
దానికి పెట్రోవిచ్ అభ్యంతరం చెప్పినా, పట్టించుకోకుండా అతన్ని
వివాహం చేసుకుంటుంది. కానీ తర్వాత వికాకు, పెట్రోవిచ్ కు మధ్య
జరిగిన సంఘర్షణలో వికాకు గర్భం పోతుంది.
అప్పటికే బిడ్డ
కోసం మాత్రమే బోరిస్ ను పెళ్ళి చేసుకున్న వికా, బిడ్డ లేకపోవడంతో బోరిస్ తో
ఉంటూనే పెట్రోవిచ్ తో సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది.
అలా పదేళ్ళు గడచిపోతాయి. ఒక్సానా ఓ ఆర్ట్ టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అప్పటికే మేయర్
గా ఉన్న తుర్కిన్ అవినీతిపరుడు అవ్వడం వల్ల
అతను పెట్రోవిచ్ రోడ్ ప్రాజెక్టులకు నిధులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల పెట్రోవిచ్ నష్టాల్లో కూరుకుపోతాడు. అదే సమయంలో వికాకు,పెట్రోవిచ్ కు మధ్య ఉన్న సంబంధం బోరిస్
కు తెలిసిపోవడంతో ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతాడు.
బోరిస్ వెళ్ళిపోయిన
తర్వాత పెట్రోవిచ్ మరణిస్తాడు. అప్పటికే బిజినెస్ నష్టాల్లో ఉండటం వల్ల అతనికి హార్ట్ ఎటాక్ వచ్చి మరణించాడని భావించినా
ఆ మరణం మీద అనుమానాలు ఉంటాయి. బోరిస్ తర్వాత మేయర్ తుర్కిన్ దగ్గర డ్రైవర్, పర్సనల్
సెక్రటరీ గా వ్యవహరిస్తున్న నికోలస్ ను ప్రేమిస్తుంది ఒక్సానా. తర్వాత రోడ్ ప్రాజెక్టుల వ్యాపారం చేస్తున్న
ఇంకో వ్యాపారి హత్య చేయబడతాడు. తుర్కిన్ అవినీతిపరుడని అతనే డబ్బుల కోసం ఇదంతా చేశాడని
ప్రజలు భావిస్తారు. బోరిస్ మళ్ళీ
తిరిగి వస్తాడు. బోరిస్ తనకి,ఆమె తండ్రికి మధ్య జరిగింది చెప్తాడు.అలా
ఇద్దరు మళ్ళీ కలుస్తారు. కానీ అదే సమయంలో తుర్కిన్,
నికోలస్ ఆమె మెదడులో ఆమె తండ్రిని చంపింది బోరిస్ అని ,అందుకే
అతను మరణించాక ఇన్నేళ్ళ పాటు మాయమై ఇప్పుడు ఇంకో వ్యాపారవేత్త మరణం తర్వాత తిరిగి వచ్చాడని
నాటుకునేలా చేస్తారు. అప్పటికే ఓ సారి కాటేజీలో బోరిస్ ఏదో వెతుకుతున్నట్టు ఒక్సానా
చూడటంతో అతన్ని అనుమానిస్తుంది.
చివరకు అతని
తండ్రి చనిపోయేటప్పుడు ఉన్న వీడియో బోరిస్
ఒక్సానా కు చూపించడంతో తన తండ్రిని చంపింది నికోలస్ అని చేయించింది తుర్కిన్ అని బయటపడటంతో
వారిద్దరు ఒకటవుతారు. నికోలస్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. అలా బాల్యంలో మట్టితో తన
కలల రాజకుమారుడిని ఒక్సానా కలవడంతో సినిమా ముగుస్తుంది.
ఏ సినిమా అయినాప్రేమ
కథ అయితే ఊహా, సుఖాంతం
చేరుకుని తీరాలి. ఇక్కడ ప్రేమ బాల్యంలో మనసులో జన్మించిన ఓ ఆకర్షణ అయినా సరే, తమ జీవితంలో మొదట ఎవరిని ప్రేమిస్తారో లేదా ప్రేమించామని అనుకుంటారో వారిని
ఎప్పటికీ ఆ ఉదాత్త వ్యక్తిగానే భావిస్తూ వారి పట్ల ఆరాధన కలిగి ఉంటారు. ఈ సినిమా కథ ఒక్సానా కేంద్రంగా ఉన్నప్పటికీ సరైన కథతో మిగిలిన
పాత్రలకు సమన్వయం చేస్తూ, ఎక్కడ కనక్షన్ తప్పకుండా తీయడంలో దర్శకులు సమంతా ఫైన్ ,యాండ్రు ఫీల్డ్స్ సఫలీకృతమయ్యారనే చెప్పవచ్చు.
* * *

Comments
Post a Comment