నాయకుడి బలహీనత

సినీ సంచారం

నాయకుడి బలహీనత

        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



           సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల దర్శకుడైన డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన సెవన్ భారీ బాక్సాఫీసు విజయాల్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ టాప్ సినిమాల లిస్టులో చేరిపోయిన ఈ సినిమాను కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. నియో నాయిర్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే వైవిధ్యం కథ మలుపుల కన్నా కూడా చివర్లో ఉండే ట్విస్ట్ మీదే ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది. అటువంటి ఓ సైకలాజికల్ ట్విస్ట్ తో ఈ సినిమా ఎవరికైనా నచ్చేలా మారిపోయింది.మోర్గన్ ఫ్రీ మన్ ,బ్రాడ్ పిట్ ల కాంబినేషన్ కూడా ఈ సినిమాకు ఓ మంచి ఎసెట్ అనే చెప్పుకోవచ్చు.

          ఓ వారంలో రిటైర్ అవ్వబోయే డెటెక్టివ్ సోమర్ సెట్. అప్పుడే ఆ వృత్తిలోకి వచ్చిన డిటెక్టివ్  మిల్స్ . మిల్స్ కు ఆవేశం, కోపం ఎక్కువ. అప్పుడే కొత్తగా భార్యతో కొత్త పట్టణానికి వచ్చాడు మిల్స్. పట్టణంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటిని సోమర్ సెట్,మిల్స్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్  చేస్తూ ఉంటారు. ఆ హత్యలను చేసే పద్ధతిని బట్టి క్రిస్టియన్ బోధనల్లో చెప్పే ఏడు రకాల పాపాలు వాటి శిక్షలు ఆధారంగా ఇవి జరుగుతున్నట్టు సోమర్ సెట్ కనుక్కుంటాడు. ఈ ప్రక్రియలో ఉండగా మిల్స్ భార్య  ట్రేసి సోమర్ సెట్ ను కూడా భర్తతో కలిసి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. తర్వాత ఓ సారి సోమర్ సెట్ ను పర్సనల్ గా కలిసి తను గర్భవతి అని తనకు ఈ కొత్త పట్టణం లో బిడ్డను పెంచాలంటే భయంగా ఉందని, తన భర్తకు ఇంకా ఆ విషయం చెప్పలేదని కూడా చెప్తుంది.

          గర్వం,అత్యాశ,కోపం,అసూయ,కామం,తిండిబోతుతనం,ఎవర్ని పట్టించుకొని తత్వం వీటిని ఏడు పాపాలుగా పేర్కొంటారు.ఓ వ్యక్తిని అతని కడుపు పగిలేలా తినేలా చేసి మరణించేలా చేస్తాడు సైకో కిల్లర్. ఇది తిండుబోతుతనానికి ప్రతీక. రెండో వ్యక్తి డిఫెన్స్ అటార్నీ. అతన్ని అతని శరీర భాగాన్ని కోసి హత్య చేస్తాడు. ఇది అత్యాశ కు ప్రతీక. ఆ హత్యల దగ్గర దొరికిన ఆధారాల ఆధారంగా వారు హంతకుడు ఇల్లు అనుకుని ఓ అపార్ట్మెంట్ కు వెళ్తే అక్కడ ఇంకో బాధితుడు కనబడతాడు. అతను డ్రగ్ డీలర్. అతను జీవించే ఉన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు.

          లైబ్రరీ రికార్డ్స్ ఆధారంగా ఈ ఏడు నేరాలను ప్రస్తావించే పుస్తకాలను సేకరించిన వారి పేర్లు కనుక్కునే ప్రయత్నం చేస్తాడు సోమర్ సెట్. అతనికి దాని ద్వారా ఇదంతా చేస్తుంది జాన్ డో అని అర్ధమవుతుంది. దాని ద్వారా డో అడ్రస్ కనుక్కుని అపార్ట్మెంట్ కు వెళ్ళేసరికి అతను మొత్తానికి పారిపోతాడు. అతని ఇంట్లో వందల నోట్ బుక్స్ ఉంటాయి. ఇంతలో కామానికి ప్రతీకగా ఓ వేశ్య దగ్గరకు వెళ్ళిన వ్యక్తిని కండోమ్ కు బ్లేడ్ ఉంచి రేప్ చేయమని గన్ తో బెదిరించి చేయిస్తాడు డో. సోమర్ సెట్ ,మిల్స్ వెళ్ళేసరికి అక్కడ ఓ బాధితుడు మాత్రమే ఉంటాడు. డో తప్పించుకుంటాడు.

          తర్వాత ఐదో హత్యగా ఓ నటి హత్యకు గురవుతుంది.ఆమెకు తన అందం మీద ఉన్న గర్వం వల్ల. ఇది గర్వానికి ప్రతీక.  ఈ ఐదు హత్యలు జరిగాక డో పోలీసులకు లొంగిపోతాడు. తాను ఎలా అయినా బయటపడగలను అని మానసిక ఆరోగ్యం బాలేదనే పాయింట్ మీద తన లాయర్ వాదిస్తాడని చెప్తాడు. కానీ మిగిలిన ఇద్దరి శవాలు కావాలంటే తనతో సోమర్ సెట్ ,మిల్స్ ఇద్దరు మాత్రమే తను చెప్పిన చోటుకు తీసుకువెళ్తే అవి దొరుకుతాయని చెప్తాడు. మిల్స్ ,సోమర్ సెట్ ఇద్దరు అతనితో కలిసి ఆ ప్రదేశానికి బయల్దేరతారు.

          అక్కడికి వెళ్ళాక ఓ డెలివరీ వ్యాన్ ఓ బాక్స్ డెలివర్ చేస్తుంది. సోమర్ సెట్ ఆ డెలివరీ బాక్స్ దగ్గరకు వెళ్తాడు. ఈ లోపు డో అతనికి అతని భార్యతో ఉన్న సంబంధం పట్ల అసూయ ఉండేదని దాని ఫలితంగా ఆమె హత్యకు గురైందని చెప్తాడు. ఓ పక్కన సోమర్ సెట్ వారిస్తున్న వినకుండా కోపంతో అతను డో ను కాల్చేస్తాడు. అలా ఏడో వ్యక్తి  అవ్వడంతో ఈ వలయం పూర్తవుతుంది. ఈ సంఘటన తర్వాత మిల్స్ మెంటల్ ఇన్స్టిట్యూషన్ లో ఉండాల్సి వస్తుంది.

          ఏడు పాపాలు ఎప్పుడూ మానవుల బలహీనతల ఆధారంగా జరుగుతూనే ఉంటాయి. ఆ వలయం ఎప్పటికీ ఆగదు అని అంతర్లీనంగా చెప్పే సందేశంతో సినిమా ముగుస్తుంది. 33మిలియన్ డాలర్లకు 327 మిలియన్ డాలర్ల బాక్సాఫీసును సొంతం చేసుకున్న ఈ సినిమా విజయానికి మూలం హత్యల మోటివ్  ను కిల్లర్ కాకుండా అదే బలహీనత ఉన్న నాయకుడు కూడా ఎంచుకునే పరిస్థితి కల్పించడం. సినిమా అంతిమ మలుపే ఎప్పుడూ ప్రేక్షకుల మనసులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ సూత్రం పట్టుకున్న ఏ కథైనా సరే విజయం సాధించి తీరుతుంది.

   *     *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ