నీలిమేఘాలు
చదువరి
నీలిమేఘాలు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
తెలిసీ తెలియని వయసులో యువత అనేక తప్పులు చేస్తుంది. దానికి కారణం పెద్దలు
వారికి పరతి విషయంలో సరైన అవగాహన కల్పించకపోవడమే. పొరపాట్లు జరిగినప్పుడు దాని
గురించే ఆలోచిస్తూ బాధపడటం కన్నా జరిగిన పొరపాటును దిద్దుకుని జీవితాన్ని
చక్కబరుచుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని స్పష్టం చేసే నవలే నందుల సుశీలాదేవిగారి ‘నీలిమేఘాలు’ నవల.
కుసుమ, శ్రీరామ్
ల కూతురు రశ్మీ. గారాబంగా పెరగటం వల్ల ఫ్రెండ్స్ ,పార్టీలు,
ఇదే లోకం అనుకుంటుంది. ఓ సారి ఎక్స్కర్షన్ కు వెళ్ళినప్పుడు క్లాస్
మెట్ ప్రకాష్ తో అనుకోకుండా శారీరకంగా కలుస్తుంది. ఆమె ఆ తర్వాత గర్భవతి అవుతుంది.
ప్రకాష్ దాన్ని సీరియస్ గా తీసుకున్నా రశ్మీ ఆ విషయాన్ని పట్టించుకోదు.
తల్లిదండ్రులు
ఆమె గురించి గాబరా పడతారు. అబార్షన్ కు సమయం దాటిపోతుంది. సారధి ఓ కూలీ పనులు
చేసుకుని స్త్రీకి పుడతాడు. తండ్రి తెలియకపోవడం వల్ల ఆమెను ఆ పల్లెటూరిలో అలానే
ఆమె తల్లిదండ్రులు వదిలేస్తారు. ఎలానో బిడ్డను కని ఆమె మరణిస్తుంది. ఎవరూ
పట్టించుకోని ఆ పరిస్థితుల్లో కుసుమ
తండ్రి,
తల్లి అతన్ని కన్నబిడ్డలా పెంచుతారు. కుసుమ తల్లి మరణించిన తరువాత
తండ్రి ఆరోగ్యం క్షీణించిన సమయంలో తన ఉద్యోగం వదులుకొని అతని మరణం వరకు సేవలు
చేస్తాడు. తన ఆస్తిని కూతురు కుసుమ, కొడుకు విష్ణుతోపాటు
సారధికి సమానంగా ఇస్తాడు. దాంతో అతను బిజినెస్ మ్యాన్ అవుతాడు.
కుసుమ
భర్త శ్రీరామ్ కూడా బిజినెస్ మ్యాన్. సారధికి ఆ కుటుంబానికి అనుబంధం పెరుగుతుంది.
ప్రకాష్ రశ్మీ నిరాకరించడంతో అతను
డిప్రెషన్ కు లోనై ఆత్మహత్య చేసుకుంటాడు. ఆమెను ఆ సమస్య నుండి గట్టెక్కించడానికి సారధి
ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు
నచ్చినవాడితో పెళ్ళి చేయాలనుకుంటాడు.
అలా
పెళ్ళయిన తర్వాత పుట్టిన బిడ్డ కొన్ని రోజులకు చనిపోతుంది. అప్పటివరకూ జల్సాలు, సరదాలే
జీవితం అనుకున్న రశ్మీ హాస్టల్లో ఉండి చదువుకుంటూ సారధి మనసు గెలుచుకుని భార్యగా,
పరిపూర్ణ మహిళగా మారుతుంది.
యువతగా
ఉన్నప్పుడూ థ్రిల్ పొందాలనే కోరికతో పాటు తమ
ఇగో కోసం మాత్రమే ఉండే వ్యక్తిత్వం యువతను వారి లక్ష్యం నుండి దూరం చేసి, వారిని
తప్పులు చేసేందుకు ప్రోత్సహిస్తుంది. అటువంటి వ్యక్తిత్వమే రశ్మీని తప్పు చేసేందుకు
ప్రోత్సహించాయి. ఇక్కడ ఆమె తప్పు చేయడమే తప్ప, మోసపోవడమనే ప్రశ్న
లేదు. ఈ రకం ప్రవర్తన మారడానికి సారధి లాంటి మంచి భర్త అందరికీ దొరక్కపోవచ్చు కానీ
తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల వ్యక్తిత్వాన్ని
ఎప్పుడూ గమనిస్తూ ,వారిలో ఇటువంటి లక్షణాలు కనబడితే తప్పక
వారిని ఆ దారి నుండి మరల్చడానికి ప్రయత్నించాలి.
*
* *

Comments
Post a Comment