ఆమె జీవితం

 చదువరి

ఆమె జీవితం

     - రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          శారద అశోకవర్దన్ గారి నవలల్లో   ఆమె జీవితాన్ని జయించిందినవలలో ఓ స్త్రీ తన జీవితంలో ఉండే అనేక కష్టాల్ని అధిగమించి తన జీవితంలో ఎలా ఎదిగిందో స్పష్టం చేస్తుంది. స్త్రీ కోణాల నుండి రచనలు అనేకమున్నా ఏ నవల ప్రత్యేకత దానిదే.

          గాయత్రి తల్లి పుట్టగానే మరణిస్తే తండ్రి బంధువుల సలహాపై రెండో పెళ్ళి చేసుకుంటాడు.కానీ ఆ సవతి తల్లి గాయత్రిని పట్టించుకోదు.తండ్రే ఆమెను ప్రాణంలా చూసుకుంటాడు.గాయత్రి ఎనిమిదేళ్ళకే తండ్రి మరణిస్తాడు.తర్వాత ఆమె సవతి తల్లి ఎందరో మగవాళ్ళతో సంబంధం పెట్టుకోవడం,వారిలో ఒకతను ఆమెను  మోటుగా బలవంతంగా ముద్దు పెట్టుకోవడం,ఆ విషయం తల్లికి చెబితే ఆమె అలా జరగాలని ఊహించుకుని ఉంటుందని అంటుంది.తర్వాత ఆమెను హాస్టల్లో ఉంచి డిగ్రీ వరకు చదివిస్తుంది.తర్వాత తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది.

     తర్వాత ఆమె స్కూల్ టీచర్ సాయంతో హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే అమరావతి నుండి అక్కడకు వెళ్తుంది.అక్కడ ఒంటరిగా ఓ అద్దె ఇంటిలో ఉంటూ,ఆ ఇంటి ఓనర్ గోపీరెడ్డి,అతని కొడుకు కిషన్ నుండి కాపాడుకుంటూ ఉద్యోగం చేస్తూ జీవితం సాగిస్తుంది.కానీ పెళ్ళి కానీ ఆమె మీద తమకు తోచినట్టు రూమర్స్ పుట్టించుచుని పైశాచికంగా సంతోషిస్తారు ఆఫీస్ కోలీగ్స్.

    సేవ చేయాలనే కోరిక బలంగా ఉంటుంది గాయత్రికి.కలకత్తాలో ఓ సేవాసదన్ లో ఆమెకు ఉద్యోగం వస్తుంది.ఆమె మామయ్య(సవతి తల్లి అన్న)ఓ సారి బొంబాయి వచ్చి తనను కలవమని రాస్తాడు.అలా వెళ్ళిన ఆమెకు అక్కడ మేనమామ భార్య మరణించడం,వారసులు లేకపోవడం, వారసురాలిగా ఆమె అర్హతను అప్పటిదాకా పరిక్షీస్తూ ఉండడం జరిగిందని గాయత్రికి తెలుస్తుంది.అలా ఆమె వారసురాలై,శాంతి సేవా సదన్ ను నడుపుతుంది.అక్కడి డాక్టర్ సందీప్ ని పెళ్ళి చేసుకుంటుంది.

     శాంతిసేవా సదన్ సక్సెస్ అవుతుంది.కానీ ఆమె కూతురు ధృవ తండ్రి గారాబం వల్ల చెడిపోయి సిగరెట్స్ ,డ్రగ్స్ కు అలవాటు పడ్తుంది.సందీప్ మరణిస్తాడు.

   సురేష్ అనే స్నేహితుడి చేతిలో ధృవ మోసపోయాక ఆమె తల్లి విలువ తెలుసుకుంటుంది. గర్భవతి అవుతుంది.అప్పటికే సిగరెట్ల వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది.ధృవ బిడ్డను కని 22 ఏళ్ళకే మరణిస్తుంది.ఆ బిడ్డకు నీతి అని పేరు పెట్టుకుని ఆమెను వారసురాలిని చేస్తుంది.

          గాయత్రి జీవితం ద్వారా స్త్రీ తన జీవితాన్ని జయించాలంటే తన బలహీనతలను ఎప్పటికప్పుడూ అధిగమిస్తూ తన జీవితంలో విజయం వైపు పయనించాలని, జీవితంలో ఆటుపోట్లు సహజమే అంతర్లీన అంశంతో ఈ నవల చదివింపజేసే నవలే.

                  *     *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ