ఆమె బతికే ఉంది!
సినీ సంచారం
ఆమె బతికే ఉంది!
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
స్వీడిష్
రచయిత స్టీగ్ లార్సన్ మిలీనియం సీరీస్ లో పది నవలలు రాద్దామనే కలతో ఉన్నప్పటికీ
కూడా మూడు నవలలు ఆ సీరీస్ లో రాసి ఆయన మరణించాడు. ఈ సీరీస్ లో వచ్చిన మూడు నవలలను
స్వీడన్ మూడు సినిమాలుగా తీసుకువచ్చింది, కానీ అమెరికా మాత్రం ‘The
Girl With The Dragon Tattoo’ ని మాత్రమే సినిమాగా మలచింది. ఇదే
పేరుతో ,అలాగే దీని సీక్వెల్స్ గా ఇంకో రెండు సినిమాలు కూడా
స్వీడన్ సినిమాల్లో దర్శనమిస్తాయి. ఈ రెండు సినిమాలు విజయవంతం అయినప్పటికీ కూడా ఈ
అమెరికన్ సినిమానే స్వీడన్ సినిమా కన్నా కూడా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది.
స్టాక్
హోల్ లో మైఖేల్ బ్లోమ్ష్విక్ అనే జర్నలిస్ట్ వెనర్ స్ట్రోమ్ అనే బిజినెస్ మ్యాన్
చేస్తున్న అవినీతిని బయట పెట్టినా దానికి వ్యతిరేకంగా వెనర్ పరువు నష్టం దావా
వేయడం, కోర్ట్ తీర్పు వెనర్ కు అనుకూలం గా రావడంతో అతను చిక్కుల్లో పడతాడు.
మైఖేల్ మిలీనియం అనే పత్రికను నడుపుతున్నాడు.అతనికి బిజినెస్ లో
భాగస్వామి మరియు పత్రికలో పని చేస్తున్న వివాహమైన ఎరికాతో అతనికి సంబంధం ఉంటుంది.
దీని వల్ల భార్యతో అతని సంబంధాలు బావుండవు. అతనికి ఓ కూతురు. ఆమె టీనేజ్ వయసులో
ఉంది.
లీసాబెల్
అనే అమ్మాయి యాంటీ సోషల్ అంటే నలుగురితో కలవలేదు, మనుషుల్ని అంతా
తొందరగా నమ్మలేదు, అనాథ ,ఫోస్టర్
హోమ్స్ లో పెరిగిన అమ్మాయి. కాని తెలివైన ఇన్వెస్టిగేషన్ నైపుణ్యాలు ఉన్న అమ్మాయి.
ఆమె చేత మైఖేల్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయిస్తాడు వ్యాంగర్ బిజినెస్ టైకూన్ అయిన
హెన్రీ వ్యాంగర్. హెన్రీ ఆ ఇన్వెస్టిగేషన్ తో సంతృప్తి చెంది, అతన్ని పిలిపిస్తాడు. 40 ఏళ్ళ నుండి మిస్టరీగా
మిగిలిన తన తమ్ముడి మనవరాలి గురించి అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేస్తే, అతనికి అది చేయడానికి ఎంత కాలం పడుతుందో అంత కాలానికి అతనికి వచ్చే
జీతానికి డబుల్ ఇస్తానని, దానితో పాటు వెనర్ కు వ్యతిరేకంగా
ఓ బలమైన సాక్ష్యాన్ని కూడా ఇస్తానని చెప్తాడు. దానికి మైఖేల్ ఒప్పుకుంటాడు.
అప్పటి
వరకు లీసాబెల్ కు గార్డియన్ గా వ్యవహరించిన హోల్గర్ పామ్ గ్రీన్ కు హార్ట్ ఎటాక్
రావడంతో ,అతనికి బదులుగా నిల్స్ ను ఆమె గార్డియన్ గా నియమిస్తుంది ప్రభుత్వం. కానీ
నిల్స్ శాడిస్ట్ . ఆమెకు వచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా ఆమె నుండి లైంగిక కోరికలు
తీర్చమని బెదిరిస్తూ ఉంటాడు. ఓ సారి ఆమెను దారుణంగా రేప్ చేస్తాడు. లీసాబెల్
దానిని వీడియో తీస్తుంది. తర్వాత వెళ్లినప్పుడు ఆ వీడియో చూసి అతన్ని బెదిరించి
అతని శరీరం మీద ‘నేను రేపిస్ట్ ‘ను అనే
ట్యాటూ వేసి ,తన ఆర్థిక భద్రతను సుస్థిరం చేసుకుని,అతను తన గురించి మంచి రిపోర్ట్ ఇచ్చేలా మాట్లాడి,
ఏమైనా తేడా వస్తే ఆ వీడియో బయట పెడతానని బెదిరించి వచ్చేస్తుంది.
మైఖేల్
అక్కడే కాటేజ్ లో ఉంటూ వ్యాంగర్ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుంటాడు. అతనికి
లీసాబెల్ తన గురించి చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి తెలుస్తుంది. ఆమె అతని గురించి
చేసిన ఇన్వెస్టిగేషన్ నచ్చి ఆమెను తన రీసెర్చ్ అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. ఆ
ఇన్వెస్టిగేషన్ లో వారికి హ్యారేట్ పుస్తకం నుండి కొన్ని పేర్లు నంబర్లు
కనిపిస్తాయి. ఆ పేర్లతో ఉన్న స్త్రీలు దారుణంగా హత్యకు గురైనట్టు ,ఆ
నంబర్లు బైబిల్ లో ఉన్న వర్సస్ అయినట్టు కనుక్కుంటారు. ఆ చంపబడిన వారు జ్యూ జాతికి
చెందిన స్త్రీలు అని ,వ్యాంగర్ ఫ్యామిలీలో కొందరు నాజీ లకు
అనుకూలంగా ఉన్నారు అని, వారిలో ఎవరో వారిని హత్య చేసినట్టు
గుర్తిస్తారు.ఈ సమయంలోనే హెన్రీ అనారోగ్యానికి గురవుతాడు.
తర్వాత
మైఖేల్ పెంచుకుంటున్న పిల్లిని ఎవరో చంపి ఇంటి ముందు పడేయడం,
తర్వాత అతన్ని చంపే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా హ్యారేట్ సోదరుడైన మార్టిన్ మీద
అనుమానం కలిగేలా చేస్తాయి.అదే విషయంలో సాక్ష్యం కోసం మార్టిన్ ఇంటికి అతను
లేనప్పుడు వెళ్తాడు మైఖేల్. కానీ మార్టిన్ తిరిగి వస్తాడు. మైఖేల్ మీద హత్యా
ప్రయత్నం చేయబోతాడు. తాను, తన తండ్రి ఎంతో మంది జ్యూ
స్త్రీలను రేప్ చేసి,హత్య చేశామని చెప్తాడు,కానీ హ్యారేట్ ను మాత్రం తాము చంపలేదని చెప్తాడు. ఈ లోపు లీసాబెల్ వచ్చి
మైఖేల్ ను కాపాడుతుంది. మార్టిన్ మరణిస్తాడు.
లీసాబెల్
కూడా ఈ హత్యలు చేసింది మార్టిన్ అనే ఆధారాలు సంపాదిస్తుంది. కానీ మైఖేల్ మాత్రం
హ్యారేట్ బ్రతికే ఉందని భావిస్తాడు. ఆమె కజిన్ అనిత లండన్ లో ఉండటంతో వెళ్ళి
కలుస్తాడు. అంతకు ముందు వెళ్ళి కలిసిన ఏమి ఆధారాలు లభించకపోవడంతో అప్పుడు మళ్ళీ
కలుస్తాడు. అప్పుడు అనితగా ఉన్న స్త్రీయే హ్యారేట్ అని తెలుస్తుంది.
హ్యారేట్
తండ్రి గోటిఫ్రెడ్ తనను లైంగికంగా వేధించేవాడని, అతని నుండి
కాపాడుకునే ప్రయత్నంలో అతన్ని హత్య చేశాక, తన సోదరుడైన మార్టిన్
అదే పని చేస్తుంటే తాను అక్కడి నుండి తప్పించుకుని లండన్ కు వచ్చిందని ,దానికి తన కజిన్ అనిత ఎంతో సాయం చేసిందని, తానే తనను
ఆ ఇంటి నుండి దాటేలా చేసిందని ,ఇది జరిగిన తర్వాత ఓ కార్
యాక్సిడెంట్ ఆమె భర్తతో సహా ఓ కార్ యాక్సిడెంట్ లో తర్వాత మరణించిందని, అప్పటి నుండి తాను మార్టిన్ కు భయపడి లండన్ లోనే అనితగా జీవిస్తున్నానని
చెప్తుంది. ఇక మార్టిన్ లేకపోవడంతో ఇంటికి తిరిగివస్తుంది హ్యారేట్.
అప్పటికీ
హెన్రీ కూడా కోలుకుంటాడు. అతనికి ఆమెను అప్పగిస్తాడు మైఖేల్. మాట ఇచ్చినట్టే వెనర్
కు వ్యతిరేకమైన సాక్ష్యాలు ఇచ్చినప్పటికీ అవి అవుట్ డేటెడ్ అవ్వడం వల్ల అవి మైఖేల్
కు పనికి రావు. లీసాబెల్ అప్పటికే వెనర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి,
తన వేషం మార్చుకుని స్విట్జర్లాండ్ వెళ్ళి రెండు బిలియన్ డాలర్లు డ్రా చేసి ,అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించి మైఖేల్ కు ఇస్తుంది. దాని మీద
సాక్ష్యాలతో సహా ఆర్టికల్ ప్రచురించి తన పత్రికను నిలుపుకుంటాడు మైఖేల్.
ఈ కేసు
విషయంలో శారీరకంగా కూడా ఒకటైన మైఖేల్ మీద ఇష్టం పెంచుకుంటుంది లీసాబెల్. ఆమె ఈ
కేసు పూర్తయ్యాక అతనికి ఓ క్రిస్మస్ బహుమతి ఇవ్వడానికి వెళ్ళేటప్పటికీ అతను
ఎరికాతో కలిసి ఉండటంతో తిరిగి వచ్చేస్తుంది. దీనితో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో
లీసాబెల్ గా నటించిన రూని మారా నటన ఈ సినిమాను చూసేలా చేస్తుంది. మనిషి మేధకు
పరిస్థితులు,మనస్తత్వాలు అడ్డంకి కాదని ఆమె పాత్ర స్పష్టం చేస్తుంది.
విభిన్నంగా గా ఉన్న పాత్ర చిత్రణ ఆధారంగానే ఈ శీర్షిక కూడా రచయిత పెట్టారు. ఈ
సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఓ పక్క, లీసాబెల్ జీవితం ఇంకో పక్క
కూడా ఆమె ఇన్వెస్టిగేషన్ లో భాగం అయ్యేవరకు నడుస్తూ ఉంటాయి.
ఈ మిలీనియం
సీరీస్ పబ్లిషర్ ఈ సీరీస్ ను ఇంకా కొనసాగించాలనుకున్నా రచయిత మరణించడంతో స్వీడన్
లో ఇంకో ప్రఖ్యాత రచయిత అయిన డేవిడ్ ల్యాగర్ క్రాంజ్ చేత ఇంకో మూడు పుస్తకాలు
ఇదే సిరీస్ లో రాయించారు.2019 లో మూడో
పుస్తకాన్ని పొడిగింపుగా (అంటే మిలీనియం సిరీస్ లో ఆరవది) రాశారు ల్యాగర్. ఓ రచయిత
మరణించినా ఆ రచయిత సృష్టించిన రచనలు ఇంకా ఇంకొకరి పరంపరలో కొనసాగడం కూడా ఆ రచన
దక్కించుకున్న పురస్కారమే.
క్రైమ్
థ్రిల్లర్ సినిమాల్లో ఉండే ట్విస్టుల కన్నా కూడా ఈ సినిమాలో పాత్ర చిత్రణ,
మానవ జీవితాలు ,బలహీనతలు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత
ఇవ్వడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల మనసులో ఓ ప్రత్యేక ముద్రను వేస్తుంది అనడంలో
ఆశ్చర్యం లేదు.
*
*

Comments
Post a Comment