బ్లాక్ రెజిమెంట్

 సినీ సంచారం

    బ్లాక్ రెజిమెంట్

        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



           అమెరికాలో సివిల్ వార్ జరుగుతున్న సమయంలో అప్పటికే ఆఫ్రో అమెరికన్స్ ను బానిసలుగా పరిగణిస్తున్న దురాచారం జోరుగా ఆచరణలో ఉన్న సమయంలో అమెరికాలో బ్లాక్ రెజిమెంట్ లు ఏర్పడటం జరిగింది. 1861 నుండి 1865 వరకు జరిగిన ఈ యుద్ధంలో మొదటి బ్లాక్ రెజిమెంట్ 1862 ఏర్పడింది. ఈ కన్సస్ రెజిమెంట్ పాయిజన్ స్ప్రింగ్ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ కూడా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. దీని తర్వాత ఏర్పడిన రెండో రెజిమెంట్ 54 మసాచ్యుసెట్స్ రెజిమెంట్. ఈ 54 మసాచ్యుసెట్స్ రెజిమెంట్ ఆధారంగా తీసిన సినిమానే గ్లోరి.’1989 లో విడుదలైన ఈ సినిమా ఐదు ఆస్కార్లకు నామినేట్ చేయబడింది, అందులో మూడు ఆస్కార్లు సొంతం చేసుకుంది.

          ఈ సినిమా పూర్తిగా అర్ధం కావాలంటే అసలు అమెరికన్ సివిల్ వార్ ఎందుకు జరిగిందో ఓ స్పష్టత ఉండాలి. 19 వ శతాబ్దం మధ్యాంతరంలో అమెరికా విపరీతంగా  అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో అమెరికాలోని ఉత్తర ప్రాంతానికి ,దక్షిణ ప్రాంతానికి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండేవి. ఉత్తర ప్రాంతంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి చాలా తక్కువగా ఉంది ఆ భాగంలో. కానీ దక్షిణ ప్రాంతం యొక్క ఆదాయమంతా కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. పత్తి,పొగాకు వంటి పంటల ఆదయమే ముఖ్య ఆదాయంగా ఉన్న ఆ సమయంలో బానిసలైన బ్లాక్స్ కష్టం వల్లే ఆ పంటలు పండేవి. కానీ 1830 ల సమయం నుండి అమెరికన్ ఉత్తర ప్రాంతంలో బానిసత్వాన్ని నిర్మూలించాలనే ఆలోచన మొదలైంది. అదే కనుక జరిగితే తమ ఆదాయ పరిస్థితులు దిగజారుతాయని దక్షిణ ప్రాంతం భావించింది.

          ఈ ప్రథమ కారణంగానే అమెరికాలో ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏడు రాష్ట్రాలు అబ్రహం లింకన్ 1860 లో అధికారానికి వచ్చిన తర్వాత 1861 న ఓ ఫెడరేషన్ గా ఏర్పడి ఉత్తర ప్రాంతం మీద ప్రచ్చన్న యుద్ధం మొదలుపెట్టాయి. ఈ సివిల్ వార్ జరుగుతున్న సమయంలోనే 1862 లో లింకన్ ప్రొక్లమేషన్ 95 ను జారీ చేశాడు. దీని ప్రకారం బానిసలుగా ఉన్న వారికి స్వేచ్చను ఇవ్వడం. ఈ కారణం వల్లే అమెరికాలో సివిల్ వార్ ఉదృతమైంది. అమెరికన్ గడ్డ మీద జరిగిన యుద్ధాలలో ఎకువ ప్రాణ నష్టం కలిగించిన యుద్ధం ఇదే. చివరకు 1865 లో దక్షిణ ప్రాంత ఓటమితో ,వారు కూడా ఉత్తర ప్రాంతంతో ఐక్యంగా ఒకే దేశంగా ఏర్పడటంతో యుద్ధం ముగిసింది. ఈ సినిమా మొదలయ్యేటప్పటికే సివిల్ వార్ జరుగుతూ ఉంది.

          అమెరికన్ సివిల్ వార్ లో గాయపడ్డ కెప్టెన్ రాబర్ట్ షా మెడికల్ లీవ్ మీద తన స్వస్థలమైన బోస్టన్ కు వెళ్తాడు. షాను 54 మసాచ్యుసెట్స్ రెజిమెంట్ కు కల్నల్ గా నియమిస్తారు. తన స్నేహితుడైన ఫోర్బ్స్ ను సెకండ్ ర్యాంక్ అయిన మేజర్ గా తీసుకుంటాడు. ఎంతో మంది బానిసలుగా ఉంటున్న ఆఫ్రో అమెరికన్స్ స్వచ్చంధంగా ఈ రెజిమెంట్ లో ఎంతో ఉత్సాహంతో జాయిన్ అవుతారు.

          లింకన్ ప్రొక్లమేషన్ కు వ్యతిరేకంగా దక్షిణ కనఫెడరేషన్ బానిసలకు ఏ విముక్తి లేదని, ఆర్మీలో యూనిఫార్మ్ ధరించే బ్లాక్స్ మరియు వారికి శిక్షణ ఇస్తున్న వైట్ ఆఫీసర్స్ కూడా మరణ శిక్ష అనుభవిస్తారని ఆజ్ఞ జారీ చేస్తుంది. అవేమీ లెక్కచేయకుండా షా తన రెజిమెంట్ కు శిక్షణ ఇస్తూ ఉంటాడు.

          కానీ ఆ మిలిటరీ క్వార్టర్ మాస్టర్ (అంటే ఎవరైతే ఆర్మీకి కావల్సిన వస్తువులు స్టోర్ లో ఉంచుతారో ) మాత్రం బ్లాక్స్ అవ్వడం వల్ల వారికి యూనిఫార్మ్స్ ,షూస్ ఇవ్వకుండా ఏవో సాకులు చెప్తాడు. జాన్ రాలిన్స్ ,టిప్ ,షార్ట్స్,సీర్లెస్ అనే బ్లాక్స్ ఈ సినిమాలో చూపించబడే ముఖ్య సైనికులు. డెంజల్ వాషింగ్టన్ ఈ సినిమాలో టిప్ పాత్ర పోషించాడు. మోర్గన్ ఫ్రీమాన్ కూడా రాలిన్స్ గా నటించాడు. టిప్ షూస్ తెచ్చుకోవడానికి వెళ్తే పారిపోవడానికి ప్రయత్నించాడనుకుని శిక్షించినా నోరు మెదపకుండా అలానే భరిస్తాడు.

          షా మొత్తం మీద తన రెజిమెంట్ కు యూనిఫార్మ్స్ ,షూస్ వచ్చేలా చేస్తాడు. ఆ రెజిమెంట్ తమ శిక్షణను పూర్తి చేసుకున్నాక జనరల్ చార్లెస్ హర్కర్ కు ఆ రెజిమెంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తారు. కల్నల్ మొంటోగోమెట్రీ ఆజ్ఞపై  ఆ రెజిమెంట్ కేవలం చెట్లను కొట్టడం లాంటి పనులే వారికి అప్పగిస్తారు. ఎంతో ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొందామనే వారి ఆశలు అడియాసలు అవుతాయి.

          చివరకు షా తన రెజిమెంట్ సౌత్ కరోలినా జేమ్స్ దీవిలో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి అనుమతి సాధిస్తాడు. ఆ యుద్ధంలో తీవ్ర నష్టం కలిగి రాబర్ట్ షా తో సహా ఎంతో మంది మరణించినప్పటికీ ఎంతో ప్రమాదకరమని తెలిసినప్పటికీ ముందడుగు వేసి తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా యుద్ధంలో పాల్గొన్న ఈ 54 రెజిమెంట్ ధైర్యసాహసాలు మాత్రం ఎప్పటికీ అమెరికన్ వీరుల చరిత్రలో చిరస్మరణమయ్యాయి.

         దేశ చరిత్రలను దృశ్యాలుగా మలిచే సినిమాలు మన మనసును ఆ దేశాలకు,  సైనికులకు సన్నిహితం చేస్తాయి. మీరు చరిత్ర  అభిమానులైతే మాత్రం ఈ సినిమా మిస్ అవ్వద్దు.

                      *     *     *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ