గ్రీకు పెళ్ళి
సినీ సంచారం
గ్రీకు పెళ్ళి
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
గ్రీకు సంప్రదాయాల్లో కొన్ని భారతీయ సంప్రదాయాలతో పోలి ఉంటాయి. ముఖ్యంగా
అటువంటి ఓ పోలికను ఓ హాస్య సినిమాగా చూపించే సినిమానే 2002 లో విడుదలైన ‘My Big Fat Greek
Wedding.’ అమెరికాలో స్థిరపడిన గ్రీకు కుటుంబంలో పుట్టిన టూలాకు 30
ఏళ్ళు వచ్చిన వివాహం కాకపోవడం ఆమె తల్లిదండ్రులకు దిగులును కలిగిస్తుంది. పెళ్ళి
విషయంలో అమెరికా లాంటి దేశాల్లో పెద్ద పట్టింపు లేకపోయినప్పటికీ భారత దేశంలో
మాత్రం అది అతి ప్రాధాన్యతను సంతరించుకున్న అంశం అనడం అతిశయోక్తి కాదు. అదే మనస్థితి ఉన్న టూలా కుటుంబం గురించి, టూలా గ్రీకును కాకుండా అమెరికన్ ను వివాహం చేసుకోవడం అనే ప్రక్రియ వరకు ఈ
సినిమా నడుస్తుంది. మొదట్లో పెద్ద ప్రేక్షకుల దృష్టిని ఆకర్షి౦చకపోయినప్పటికీ
తర్వాత ఇది హిట్ సినిమాగా నిలిచింది. ఇదే కథా మూలం మనకు 2009లో చేతన్ భగత్ రాసిన
‘టూ స్టేట్స్ ‘లో కూడా కనబడుతుంది. రెండు వైవిధ్య కుటుంబ నేపథ్యాలు ఉన్న
ప్రేమికులు తమ కుటుంబాల్ని ఎలా ఒప్పించుకున్నారో అని చెప్పే ఈ నవల మూలాలు ఈ
సినిమాలో మనకు దర్శనమిస్తాయి.
టూలా
కుటుంబం గ్రీక్ నుండి అమెరికాలో స్థిరపడినప్పటికీ కూడా గ్రీక్ ఆచారాలు-సంప్రదాయాలు
పట్ల మాత్రమే అభిరుచి,గౌరవం కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో
స్త్రీలకు ఉన్న బాధ్యతలు పెళ్ళి చేసుకోవడం,పిల్లల్ని కనడం
మాత్రమే అని భావనలు ధృఢంగా ఉన్నాయి. టూలా తన కుటుంబం చికాగోలో నడుపుతున్న
రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటుంది.అక్కడే ఇలాన్ మిల్లర్ ను చూసి ఇష్టపడుతుంది.
రెస్టారెంట్ ను ఇంకా అభివృద్ధి పరచడానికి ,అంతా డిజిటలైజ్
చేయడానికి తాను కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మొదట్లో
తండ్రి దానికి ఒప్పుకోకపోయినా తల్లి అతన్ని ఒప్పిస్తుంది.
ఆ
కంప్యూటర్ కోర్సులో చేరాక టూలా తన వేషధారణను కూడా మార్చుకుంటుంది. అందంగా రెడీ
అవ్వడం,మేకప్ చేసుకోవడం వంటివి చేస్తుంది. ఆమె అత్త అయిన వూలాకు ట్రావెల్ ఏజెన్సీ
ఉంటుంది. దానిలో అయితే తన కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుందని భావించిన టూలా
దానిలో పని చేయడానికి అత్తను, తల్లిని ఒప్పించి వారి ద్వారా
తండ్రి ఒప్పుకునేలా చేసి అక్కడ పని చేస్తుంది. ఆమె హోటల్ లో ఉన్నప్పుడూ పెద్దగా
పట్టించుకోని ఇలాన్ మిల్లర్ ఆమెను ట్రావెల్ ఏజెన్సీ లో చూసి మారి ఉన్న ఆమెను
ఇష్టపడతాడు. వారిద్దరు ప్రేమించుకుంటారు.
వారిద్దరు
పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. టూలా తండ్రి ఇయాన్ గ్రీక్ కాకపోవడం వల్ల
మొదట్లో పెళ్ళికి ఒప్పుకోకపోయినా తర్వాత అయిష్టంగానే అంగీకరిస్తాడు. ఇయాన్ తన
తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాడు. తర్వాత ఈ పెళ్ళి కోసం ఇయాన్ ను బాప్తైజ్ చేసి
గ్రీకుగా మారుస్తారు. ఆ తర్వాత వారిద్దరి వివాహం జరుగుతుంది. వారి పెళ్ళి బహుమతిగా
ఓ ఇంటిని ఇస్తాడు టూలా తండ్రి. తర్వాత వారికి పుట్టిన కూతురిని కూడా టూలా గ్రీక్
స్కూల్ కి పంపడంతో సినిమా ముగుస్తుంది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది.
మంచి
హాస్య సినిమాగా, మనుషుల్లో తమ పుట్టుక గురించి ఉండే అతిశయం వంటి అంశాలతో
పాటు పెళ్ళికి ఇవేమీ అడ్డంకి కావని చివరకు ముగింపునివ్వడం ఎక్కువగా తెలుగు సినీ
నేపథ్యాల్లోనే ఉంటుంది. దానికి కారణం వివాహ విభేధాల వల్ల. అటువంటి నేపథ్యం గల ఈ గ్రీక్ కుటుంబ సినిమాను కూడా
తప్పక చూడండి.
* * *

Comments
Post a Comment