కలహంలో మానవత్వం
సినీ సంచారం
కలహంలో మానవత్వం
-రచనశ్రీదత్త (శృంగవరపు
రచన)
మనుషుల్లో సాటి మనిషిని కాపాడాలనే మానవత్వం ఏ సమాజ శ్రేయస్సుకైనా ముఖ్యం,
అదే అసలైన నాగరిక నిర్వచనం. ముఖ్యంగా దేశంలో అంతర్గ కలహాలు చెలరేగుతున్న సమయంలో ఆ
పౌరుల జీవితాలు ఎలా చిక్కుల్లో పడతాయోతెలియజేస్తూ యుద్ధ సమయంలో కూడా మనుషుల్లో
మానవత్వం ఎంత ముఖ్యమో తెలిపే సినిమానే ‘Tears Of The Sun.’
నైజీరియాలో
మిలిటరీ కూప్ వల్ల దేశంలో అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంది. ఆ దేశపు రాష్ట్రపతి మరియు
అతని కుటుంబం హత్య చేయబడ్డారు. ఎత్నిక్ క్లీనింగ్ పేరుతో ముస్లింలు క్రిస్టియన్లను
హత్యలు చేస్తున్నారు. ఆ సమయంలో నైజిరియాలోని శరణార్ధులకు వైద్యసేవలు అందించడానికి వచ్చిన
అమెరికన్ సెనేటర్ కోడలు అయిన డాక్టర్ నేనాను తిరిగి అమెరికాకు తీసుకురావడానికి అమెరికన్
న్యావి సీల్ టీం ను పంపిస్తుంది. ఆ టీం లూయీటెంట్ అయిన వాటర్స్ ఇంకో ఏడుగురితో
కలిసి నేనాను తీసుకువెళ్ళడానికి నైజీరియా వస్తారు. ఆమెతో పాటు ఓ ప్రీస్ట్ ను ,ఇద్దరు
నన్స్ ను కూడా వారు అమెరికాకు తిరిగి తీసుకువెళ్ళాలి.
డాక్టర్
నేనా దగ్గరకు వెళ్ళి పరిస్థితి చెప్పి ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్తాడు
వాటర్స్. తన రోగులను వదిలి తాను రానని వాళ్ళను కూడా తనతో పాటు తీసుకువెళ్తేనే తాను
కూడా వస్తానని పట్టు పడుతుంది డాక్టర్ నేనా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారిని
కూడా తీసుకువెళ్దామని మాట ఇచ్చి ఆమెను బయల్దేరేలా చేస్తాడు వాటర్స్.
ప్రీస్ట్,నన్స్
మాత్రం మిగిలిన రోగులను చూసుకోవడానికి తాము ఉంటామని చెప్పి రావడానికి
నిరాకరిస్తారు.నేనా రోగులను,నేనా ను తీసుకుని టీం ఆ రోజు
రాత్రి బయల్దేరుతుంది. ఆ మిగిలిన శరణార్ధులను మధ్యలోనే వదిలేసి వాటర్స్ కేవలం
డాక్టర్ నేనాను మాత్రమే ప్లేన్ లో ఉంచుతాడు. వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో ఏ
చర్చ్ నుండి డాక్టర్ నేనాను తీసుకువచ్చారో అక్కడి ప్రీస్ట్ ను,నన్స్ ను .అక్కడి రోగులను హత్య చేసి ఆ చోటును కాల్చేయడం చూస్తారు. దానితో
పశ్చాత్తాపం పొందిన వాటర్స్ వెనక్కి వెళ్ళి వదిలేసిన వారిని మళ్ళీ తమతో పాటు
తీసుకువెళ్ళడానికి తిరిగి వస్తాడు. వారిని కూడా తీసుకుని ప్రయాణం కొనసాగిస్తారు.
అలా
పయనిస్తున్న సమయంలో తమ టీం ను కూడా రెబెల్స్ ట్రాక్ చేస్తున్నట్టు వాటర్ టీం
గమనిస్తుంది.అది ఎందుకో వారికి అర్ధం కాదు. అలా వారు వెళ్తున్న సమయంలో ఓ గ్రామంలో
ప్రజలను దారుణంగా హింసిస్తూ వారిని హత్య చేస్తున్న రెబెల్స్ ను అడ్డుకుని మిగిలిన వారిని కాపాడతారు
వాటర్స్ టీం వాటర్స్ ఆజ్ఞపై. అక్కడి
రెబెల్స్ చర్యలు ఎంత దారుణంగా ఉంటాయో ఓ ఉదంతం ద్వారా స్పష్టం అవుతుంది. ఓ బిడ్డను
కన్న తల్లి రొమ్ములు కోస్తాడు ఓ రెబెల్. ఆమెను కాపాడటానికి ప్రయత్నించినా ఆమె
మరణిస్తుంది.
ఆ గ్రామం దాటాక వాటర్స్ తమ బృందంలో ఉన్న
ఓ వ్యక్తి దగ్గర ఉన్న ట్రాన్స్ మీటర్ ద్వారా
తమను ట్రాక్ చేస్తున్నారని అర్ధమవుతుంది
వాటర్స్ టీం కు. మధ్యలో ఆ టీం లో కలిసిన ఓ వ్యక్తి డబ్బు కోసం రెబెల్స్ చెప్పినట్టు ఆ ట్రాన్స్
మీటర్ పెట్టుకుని వారితో ఉన్నట్టు తెలుస్తుంది. వారు ఆ టీం ను ట్రాక్ చేయడానికి
కారణం చనిపోయిన ప్రెసిడెంట్ కు ఉన్న ఏకైక కొడుకు అయిన ఆర్థర్ వారితో ఉండటమే అని ఆ వ్యక్తి ద్వారా
స్పష్టం అవుతుంది. అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అతన్ని షూట్ చేస్తారు.
ఆ ప్రెసిడెంట్ కొడుకు ఉన్న విషయం
తెలిసిన కూడా తమకు చెప్పనందుకు డాక్టర్ నేనా మీద కోప్పడతాడు వాటర్స్. ఆ తర్వాత
రెబెల్స్ తో పోరాటం చేసి ఆ శరణార్ధులను నైజీరియా బోర్డర్ దాటిస్తాడు వాటర్స్. ఈ
ఆపరేషన్ లో నలుగురు బృంద సభ్యులా ప్రాణాలు కూడా పోతాయి. మిగిలిన వారితో కలిసి
డాక్టర్ నేనాను అమెరికా తీసుకువెళ్తాడు వాటర్స్.
యుద్ధం దేశాల మధ్యే కాదు ఓ దేశంలోని
పౌరుల్లో ఉండే ఏదో ఒక రకమైన ఉన్మాద స్థితి వల్ల కూడా సంభవించవచ్చు. ఆ ఉన్మాద
స్థితి ఆధారంగా దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అంతర్గత యుద్ధాలను జరిగేలా
చేయవచ్చు. కానీ దీని వల్ల మనుషుల్లో మానవత్వం,దేశంలోనే పౌరుల్లో ఒకరి మీద ఇంకొకరికి నమ్మకం సన్నగిల్లి పోవచ్చు కూడా. యుద్ధ
ప్రాతిపాదికన వచ్చే సినిమాలు కాల్పనికమైనా సరే ఆ ఉదంతాల్లో వ్యక్తులు మారిన సంఘటనల
క్రమం మాత్రం కచ్చితంగా ఏదో ఒక దేశ చరిత్ర పుటల్లో ఉండే ఉంటుంది.
డై హార్డ్ ఫ్రాంచైజ్ తో ప్రసిద్ధి
పొందిన బ్రూస్ విల్స్ ఈ సినిమాలో వాటర్స్ గా నటించారు. ఇటాలియన్ నటి అయిన మోనికా
డాక్టర్ నేనాగా నటించారు. ఈ సినిమాలో అంతర్గత యుద్ధాలకు ఓ కారణం మతం కూడా
అవ్వవచ్చని, ఆ మూలంగా మొదలైన
హింసాకాండ ఎలా మనుషులను హతమారుస్తుందో వివరిస్తుంది. వార్ సినిమాలు మీకు ఇష్టమైతే
తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
*
* *

Comments
Post a Comment