కోరికలు
చదువరి
కోరికలు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
డి.కామేశ్వరి
గారి రచనల్లో ‘కోరికలే గుర్రాలైతే’ నవలలో ఓ మధ్యతరగతి
అమ్మాయి నవలలు చదివి, సినిమాలు చూసి అదే జీవితమనుకుని, వాస్తవంలో ఆ జీవీతం దక్కకపోయేసరికి ఎలా తన జీవితం నాశనం చేసుకుందే స్పష్టం
చేస్తుంది. ఈ నవల అదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది.
జ్యోతి బి.ఏ చదువుతూ ఉంటుంది. నవలలు,సినిమాలు
చూసిన ఆమె అదే జీవితం అనుకుంటూ అలాంటి అందగాడు,ఆస్తిపరుడు
అయిన భర్త వస్తాడని కలలు కంటూ ఉంటుంది.మధ్యతరగతి కుటుంబం అవ్వడం వలన ఓ బ్యాంకు
గుమాస్తా సుబ్బారావుతో ఆమె వివాహమౌతుంది.అతను అంత అందంగా ఉండకపోవటం,జీతం ఆరొందలు అవ్వడంతో తన ఊహాలకు,వాస్తవానికిఆంతర్యం
ఉండటంతో అతనితో ముభావంగా ఉండి,ప్రతి విషయానికి సాధించి,అతని అహాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది.అలాగే అదే పోర్షన్ లో పైన ఉండే ఆఫీసర్
భార్య శ్యామల వైభవం చూసి తమకు అలాంటివి లేవని దుఃఖిస్తుంది.అంతే తప్ప పక్క పోర్షన్
లో ఉండే సుశీల తనకొచ్చిన బట్టలపై పెయింటింగ్ కళతో ఉన్నదాంట్లో తృప్తిపడుతూ ఎలా కాపురం కొనసాగిస్తుందో గ్రహించదు.
సుబ్బారావు
స్నేహితుడు మురారి అనుకోకుండా అతన్ని కలుస్తాడు.అతని అందం,మూడు
వేల జీతం చూసి అతని ఆకర్షణలో పడూతుంది జ్యోతి.మురారికి ఆమె పట్ల అటువంటి అభిప్రాయం
ఉండదు.కేవలం స్నేహాతుడి భార్యని,సుబ్బారావుకి స్థోమత
లేకపోవడం వల్ల ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండటం వలన స్నేహాతుడితో కలిసి ముగ్గురు
సినిమాలకు వెళ్ళేవారు.ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని అవి కూడా ఇచ్చేవాడు.అలాగే ఓ రోజు
అతను వచ్చే సమయానికి సుబ్బారావు ఊర్లో ఉండడు.మురారి వెళ్ళబోతుంటే జ్యోతి బలవంతం
మీద సినిమాకూ,తన ఇంటికి తీసుకువెళ్తాడు.జ్యోతి మాత్రం మురారి
మీద ఆశలు పెంచుకుంటుంది.మర్నాడు ఆ విషయం జ్యోతి చెప్పకపోయినా,మురారి చెప్పడంతో తెలుస్తుంది.
తర్వాత
మురారి వచ్చినప్పుడు భర్తకు తెలియకుండా తనకో ఉద్యోగం చూడమంటుంది.ఆమె ఒట్టు
తీసుకోవడం వల్ల ఆ విషయం మురారి సుబ్బారావుకి చెప్పలేకపోతాడు.ఓ రోజు సుబ్బారావుతో
గొడవపడి,మురారి దగ్గరకు వెళ్ళిపోతానంటుంది.స్నేహాతుడు తనకు ద్రోహం చేసాడేమోనని
అనుమానించినా,సూటిగా తర్వాతి రోజు మురారి దగ్గరకు వెళ్ళి
జరిగింది చెప్తాడు సుబ్బారావు.
మురారి
ఇంటికి వచ్చిన ఆమెకు అతను వాస్తవాన్ని బోధపరిచే ప్రయత్నం చేసినా ఆమె అర్థం
చేసుకోదు.అలా పంతంతో రోడ్డు మీద ఆమె అతనికి దొరకకూడదని,దొరికితే
భర్తకు అప్పగిస్తాడని పరిగెడూతూంటే టాక్సీకి తగలడం వల్ల ఆమెకు యాక్సిడెంట్
అవుతుంది.దానితో ఆమె ఎడమకాలు దెబ్బతినడం వల్ల ఆ కాలు కుంటిదౌతుంది.దానితొ తను
అందగత్తెనని భర్తతో ప్రవర్తించిన తీరు,ఎగతాళి చేసిన పద్ధతి గుర్తుకొస్తాయి.దానితొ పాటు ఆమె మొహం
మీద ఏర్పడిన గాటుతో ఆమె అందం కూడా మరుగునపడటంతో ఆమె ఊహా లోకం నుండి వాస్తవలోకానికి
వచ్చి పశ్చాత్తాపపడుతుంది.
వాస్తవం
ఎప్పుడు ఊహాలోలా జరగడానికి ఆస్కారం ఉండని అంశం. మనం ఎంత తాపత్రయపడినా, అది
ఎండమావిగానే మిగిలిపోతుంది తప్ప మన ఊహలు వాస్తవానికి బహుదూరంగా ఉంటే మాత్రం వాటిని
సాధించుకునే అవకాశం ఉండదు. ఇది ఓ జీవిత సత్యమే. మనలోని అసంతృప్తులకు మూల కారణం మన ఊహలకు
వాస్తవం దూరంగా ఉండటమే అని మరోసారి స్పష్టం చేసే నవల ఇది.
*
* *

Comments
Post a Comment