కారుణ్యమూర్తి

 చదువరి

కారుణ్యమూర్తి

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



   ఆమె తలిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి. వివాహం తర్వాత అదే యమునగా మారింది. రచయిత్రిగా ఆమె తన కోడలు హేమాదేవి పేరు మీద బొమ్మా హేమాదేవి పేరుతో ఎన్నో నవలలు రాశారు. వారి నవలల్లో తపస్విని లో ఓ అమ్మాయి జీవితంలో లోపాలను ఎంచకుండా ప్రేమించి, పెళ్లి చేసుకునే దశ నుండి, ఆ వివాహంతో ఎన్నో బాధలు పడి, ఆ తర్వాత ఆ వివాహం వల్ల బాధలు పడి ఆమె జీవితంలోకి వసంతం వచ్చే సమయంలో ఎలా తపస్వినిగా మారింది అన్నది ఓ నవలగా మలిచారు.

        బద్రీనాథ్, సుభద్ర భార్యాభర్తలు. వారికి నలుగురు పిల్లలు. భావన,కేశవ్, కృష్ణుడు,కీర్తన. వారు ఎంతో క్రమశిక్షణతో పెరుగుతారు.భావన బాల్యం నుండే పురుషుల మీద ఓ రకమైన  అసహ్యాన్ని పెంచుకుంటుంది. పెళ్ళి చేసుకోకూడనుకుంటుంది. లలిత్ అనే ఐపి ఎస్ సెలక్షన్ల్స్ లో ఉన్న అతను ఆమెను పెళ్ళి  చేసుకోవడానికి వచ్చిన తనకు ఆసక్తి లేదని చెప్తుంది.

        భావన చదువుకునే రోజుల్లో కాలేజీలో లెక్చరర్ గా ఉన్న ఝాని భావన ప్రేమిస్తుంది. అతనికి ఓ కన్ను గుడ్డి, ఓ కుంటి కాలు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా అతన్ని వారికి తెలియకుండా పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వారికి తెలియపరుస్తుంది. తండ్రి బద్రీనాథ్ తెలిసినవారిని పిలిపించి, ఆ వివాహం మళ్ళీ జరిపిస్తాడు. లలిత్ ఆ కుటుంబానికి ఆప్తుడవుతాడు.

        పెళ్ళయిన తర్వాత కొన్నాళ్లు ఓర్చుకున్నా, ఝూ తనను పెట్టె శారీరక,మానసిక హింసాలను భరించలేకపోతుంది భావన. బాధ వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేది. ఇద్దరు బిడ్డల తల్లవుతుంది భావన. లలిత్ కు కూడా పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడతారు. భావన తండ్రి సాయంతో బ్యాంకులో ఉద్యోగం సాధిస్తుంది. కానీ ఇంట్లో హింస మాత్రం తప్పదు.

        ఆ బాధలు భరించలేక పుట్టింటికి వచ్చినా, అక్కడికి కూడా వచ్చి ఆమెను హింసించేవాడు ఝూ. కేశవ్, కీర్తనలకు కుండమార్పిడి పెళ్ళిళ్ళు తెలిసినవారితోనే అయిపోతాయి. వారు తమ కుటుంబాలతో బావుంటారు. బద్రీనాథ్ భావనకు వేరే ఫ్లాట్ కొనిస్తాడు. భావన నుండి అప్పటికే ఇద్దరు పిల్లలను లాక్కుపోతాడు ఝూ. ఓ సారి భావన ఫ్లాటుకు వచ్చి ఆమెను ఏడిపించబోతే అతన్ని జెయిలులో వేస్తాడు లలిత్.

        లలిత్ భార్య విశాల లలిత్ ను మోసం చేసి తన బిడ్డల్ని అతని దగ్గరే వదిలి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డల్ని పెంచే బాధ్యత భావనకు అప్పగించే వారిని చూడటానికి వెళ్తూ ఉండేవాడు లలిత్. భావన ఓ తపస్వినిలా మారిపోతుంది. తనను పెళ్ళి చేసుకోమని లలిత్ అడిగినా ఆసక్తి చూపదు. భావన బిడ్డల్ని ఝూ ఎవరికో అమ్మేయ్యబోతుంటే వారిని తీసుకొచ్చి భావనకు అప్పగిస్తాడు లలిత్. భావనతో పెళ్ళి కోసం అలా నిరీక్షిస్తూనే ఉంటాడు లలిత్.

        స్త్రీ జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలు ఆమెను మధురమైన ఊహలకు దూరం చెయ్యడమే కాకుండా,ఆమెను తన ఏకాంతానికి పరిమితం చేసి ఆమెను ఓ తపస్వినిగా మారుస్తాయి కూడా. ఒక్కసారి ఆ స్థితి వచ్చాక ఆమె జీవితంలో మనుషుల మధ్య ఉండే అనుబంధాల్ని నమ్మే పరిస్థితుల్లో ఉండదు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న నవల.

   *    *    *

 

 

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ