పీడకల

 సినీ సంచారం

                                    పీడకల

                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



  సైకలాజికల్  హారర్ సినిమాల్లో ఓ కొత్త పంథాకు మార్గం చూపిన సినిమా 'ద సైలెన్స్ ఆఫ్ ల్యాంబ్స్.' ఈ సినిమాను కథ పరంగా చూస్తే సంఘటనలతో ప్రవహించే సినిమా మాత్రం కాదు. ఈ సినిమా వాస్తవానికి  మానవుని సైకాలజీ ను ఇంకో కోణంలో చూపించే సినిమా.థామస్ హారిస్ 1981 నుండి 2006 వరకు హాన్నిబల్ లెక్టర్ అనే ముఖ్య పాత్ర చిత్రణతో రెడ్ డ్రాగన్(1981) ,సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్(1988) , హాన్నిబల్(1999) ,హాన్నిబల్ రైజింగ్(2006) రాసిన నవలలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. అందులో మొదటి సినిమాగా వచ్చిన 'సైలెన్స్ ఆఫ్ ల్యాంబ్స్ ' సినిమాకు వచ్చిన ఖ్యాతి ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలకు రాలేదనే చెప్పాలి. సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ ను పుస్తకాల వరుస నుండి చూస్తే అది రెండోది అయినప్పటికీ ,ఈ సినిమాలో హాన్నిబల్ పరిచయం లేకపోయినప్పటికీ ఈ సినిమా ఓ కొత్త శైలికి మార్గం వేసింది అనడంలో సందేహం లేదు.

            క్లారీస్ స్టార్లింగ్ ఎఫ్ బి ఐ ట్రెయినింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడూ ఆ బ్యూరో బిహేవియరల్ సైన్స్ యూనిట్ లో ఉన్న జాక్ క్రా ఫోర్డ్ ఆమెను ఆ ట్రెయినింగ్ నుండి తన డిపార్ట్మెంట్ కు మార్పించి హానిబల్ లెక్టర్ ఇంటర్ వ్యూ తీసుకొమ్మని చెప్తాడు. హానిబల్ లెక్టర్ గతంలో ఓ సైకియాట్రిస్ట్, ఆ తర్వాత అతను మనుషుల్ని తినే కానిబల్ మరియు సీరియల్ కిల్లర్ గా మారతాడు. అప్పటికే నగరంలో బఫెలో బుల్ అనే నేరస్థుడు యవ్వనంలో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారి చర్మం వలుస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి హానిబల్ ఉపయోగపడతాడని భావించిన క్రా ఫోర్డ్  క్లారీస్ కు ఇంటర్ వ్యూ పని అప్పగిస్తాడు.

 

              సినిమా మొత్తాన్ని  పరిశీలిస్తే ఇది హానిబల్ మనస్తత్వాన్ని ఓ వైపు చూపిస్తూనే ,అతను ఎదుటి వారి వ్యక్తిగత జీవితంలోకి జొరబడే మార్గాల్లో ఒకటిగా అతను వారిని వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం, అందులోనూ వృత్తి రీత్యా సైకియాట్రిస్ట్ అవ్వడం వల్ల వారి ఆ వ్యక్తిగత అంశాలను బట్టి వారి మనస్తత్వాన్ని అంచనా వేయడం ఇదంతా కూడా ఈ సినిమాలో హానిబల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నమే.

            బాల్టిమూర్ స్టేట్ హాస్పటల్ లో నేరస్తులు, అలాగే మానసికంగా ఇలా ఇబ్బంది పెడుతున్న వారిని ఉంచే చోట హానిబల్ ను ఉంచుతారు. క్లారీస్ అతని దగ్గరికి మొదటి సారి రాగానే ఆమెకు సరిగ్గా సమాధానాలు చెప్పకుండా పంపించేస్తాడు. కానీ వెళ్తున్నప్పుడు ఇంకో నేరస్థుడు తన సెల్ నుండి సీమెన్ ఆమె వైపు విసరడంతో ఆ పనిని అసహ్యకరమైన పని అని ,మళ్ళీ రమ్మని పిలిచిన హానిబల్ ఆమెకు తన పాత పేషెంట్ వివరాలు ఇస్తాడు. ఆ వివరాల ప్రకారం వెళ్ళిన క్లారీస్ కు అక్కడ ఒక స్టోరేజ్ రూమ్ లో ఓ జార్ లో ఓ మనిషి తల ఉంటుంది. తిరిగి వచ్చిన ఆమెకు హానిబల్ అతను బఫెలో బూల్ కు సంబంధించిన వ్యక్తి అని చెప్తాడు. ఈ లోపు బఫెలో బుల్ ఇంకో అమ్మాయిని హత్య చేసి ఆమె గొంతులో ఓ కీటకాన్ని పెడతాడు. అతని ప్రతి హత్యలో కూడా ఈ కీటకానికి  కచ్చితంగా ఎక్కడో ఓ చోట స్థానం  కల్పిస్తాడు.

            క్రాఫోర్డ్  హానిబల్ ను ఆ జెయిల్ నుండి వేరే జెయిల్ కు మారుస్తామని చెప్పమని తద్వారా అతని నుండి వివారాలు రాబట్టమని చెప్తే స్టార్లింగ్ అతనికి నచ్చిన చోటుకు వెళ్ళే అవకాశం కల్పిస్తానని ఆ డీల్ ను మార్చేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఆ జెయిల్ డాక్టర్ చిల్టన్ ఆమె వేరే డీల్ చేసిందన్న విషయం క్రాఫోర్డ్ కు తెలియజేస్తాడు.

            హానిబల్ తను ఒక విషయం చెప్పగానే స్టార్లింగ్ వ్యక్తిగత జీవితం గురించి అడిగేవాడు. అలా ఆమె బాల్యం గురించి తెలుసుకుంటాడు. ఆమె తండ్రి మరణించడం ఆ తర్వాత బంధువుల దగ్గర పెరగటం గురించి తెలుసుకుంటాడు. ఇంతలో బఫెలో బుల్ సెనేటర్ కూతుర్ని హత్య కిడ్నాప్ చేస్తాడు. హానిబల్ ను సెనేటర్ ను కలిసే ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా స్త్రీ అయిన ఆ సెనేటర్ కు ఒక్కో వివరం చెప్తున్నా ,ఆమెను ఇబ్బందికర వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు హానిబల్. దానితో అతనితో ఆ మీటింగ్ అలా బెడిది కొడుతుంది. అతన్ని తెనిసే ప్రిజన్ కు మారుస్తారు.

            అతన్ని స్టార్లింగ్ కలవడానికి వెళ్తుంది. బఫెలో బుల్ కు సంబంధించిన వివరాలు చెప్పినా, ఆమె ఆ కేసు ఎందుకు సాల్వ్ చేయడానికి అంతా కష్టపడుతుందో ఆమె చెప్పిన వ్యక్తిగత వివారాల బట్టి గ్రహిస్తాడు హానిబల్. ఆమె బాల్యంలో బంధువుల దగ్గర పెరిగినప్పుడు వారికున్న గొర్రెలను వారు మాంసం కోసం చంపుతున్న దృశ్యం చూసిన ఆమె ఉదయాన్నే లేచి కనీసం ఒక్క గొర్రెను అయినా కాపాడుదామనే ప్రయత్నంతో ఒక  గొర్రెతో పారిపోతుంది. కానీ దాని బరువు మొయ్యలేక మధ్యలోనే వదిలేస్తుంది. ఆ అపరాధ భావం వల్ల ఆమెకు ఎప్పుడు పీడ కలలు వస్తూ ఉంటాయి. దాని నుండి విముక్తి పొందడానికి ఆమె ఈ అమ్మాయిల్ని కాపాడటం మార్గంగా భావిస్తుందని హానిబల్ కు అర్ధమవుతుంది. ఆ వివరాలతో బఫెలో బుల్ ను కనుక్కోవడానికి సిద్ధమవుతుంది స్టార్లింగ్ . అదే సాయంత్రం అక్కడి గార్డ్స్ ను చంపి అక్కడి నుండి తప్పించుకుంటాడు హానిబల్.

            ఆ వివరాల ఆధారంగా బఫెలో బుల్ చంపిన మొదటి అమ్మాయి అయిన ఫ్రెడ్రికా ఇంటికి వెళ్తుంది. ఫ్రెడ్రికా ,బఫెలో బుల్ ఇద్దరు స్నేహితులను, టెయిలర్స్ అని తెలుసుకుంటుంది. దానితో పాటు అమ్మాయిల చర్మంతో అతను సూట్ కుట్టడానికే వారిని అలా కిడ్నాప్ చేసి హత్య చేస్తున్నాడన్న విషయం కూడా తెలుసుకుంటుంది. ఈ లోపు క్రాఫోర్డ్ హానిబల్ హాస్పటల్ లో దొరికిన సమాచారం ఆధారంగా జేమ్స్ గంబ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటానికి బయల్దేరతాడు. అతను ఆ కీటకాలను అమెరికాలోకి సప్లై చేస్తున్నట్టు ఆధారాలు ఉంటాయి. అదే విషయం స్టార్లింగ్ కు కాల్ చేసి కూడా చెప్తాడు క్రాఫోర్డ్. ఆ సమయంలో ఫ్రెడ్రికా స్నేహితుల్ని ఇంటర్ వ్యూ చేస్తూ ఉంటుంది స్టార్లింగ్. క్రాఫోర్డ్ జేమ్స్ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. జేమ్స్ ఓ ట్రాన్స్ సెక్సువల్.

            అదే సమయంలో స్టార్లింగ్ అలా కనుక్కుంతున్న క్రమంలో గోర్డన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఉన్న కీటకాల ఆధారంగా అతనే జేమ్స్ అని తెలుసుకుంటుంది. సెనేటర్ కూతురు క్యాథరిన్ ను కాపాడే ప్రయత్నంలో అతన్ని షూట్ చేస్తుంది స్టార్లింగ్. ఆ తర్వాత సంతోషం గా గ్రాడ్యుయేషన్ పార్టీలో ఉన్నప్పుడూ హానిబల్ కాల్ చేస్తాడు. తన ప్రామిస్ తాను నిలబెట్టుకోలేకపోయానని స్టార్లింగ్ అంటుంది. తను ప్రస్తుతం తన పాత స్నేహితుడితో డిన్నర్ కోసం ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హానిబల్.అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ చిల్టన్ ను హానిబల్ వెంబడించడంతో సినిమా ముగుస్తుంది.

            ఈ సినిమా ఐదు ఆస్కార్లు పొందింది. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం మనిషిలో ఉండే బలహీనతలు,భయాలు,ఆశయాలు ప్రతి అంశం ఊరికే ఏర్పడదు. కచ్చితంగా దాని వెనుక ఓ బలమైన సంఘటన ఉంటుంది. అది జీవితంలోని ఏ దశలో అయినా కావచ్చు. ఈ సినిమాలో స్టార్లింగ్ ఆశయానికి పునాది ఎక్కడి నుండి ఉద్భవించిందో అన్న అంశం ఈ సినిమాకు నిజంగా ఉన్న ప్రత్యేకత, ఎందుకంటే సాధారణంగా సినిమాల్లో ఎవరైతే ప్రతి నాయకులు ఉంటారో వారు హత్యలు చేయడానికి వెనుక ఉన్న కారణాలను శోధించే సినిమాలే ఎక్కువ. కానీ నాయకుల ఆశయాల తత్వం ఎక్కడ జన్మించిందో తెలిపే సినిమాలు అరుదు. అందులోనూ ఆ తత్వాన్ని ఓ ప్రతినాయకుడు,మానవ హంతకుడు అయిన హానిబల్ తెలుసుకున్న తీరు కూడా ఈ సినిమాకు ఘన విజయాన్ని సొంతం చేసింది. ఫిలడెల్ఫియా లాంటి వినూత్న సినిమాలు తీసిన జొనాథన్ డెమ్మీ ఈ సినిమాకు దర్శకులు.

            *     *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ