గత పాత్రలు

 చదువరి

గత పాత్రలు

                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



బలభద్రపాత్రుని  రమణి గారి నవలల్లో  ఏది నిన్నటి స్వప్నం లో గతం గురించి ఆలోచించే ఓ స్త్రీ అనుకోకుండా తన గతంలో ముఖ్య పాత్రలను ఎలా కలుస్తుందో స్పష్టం చేస్తుంది.

          ఈ కథలో ముఖ్యపాత్ర మైత్రి. ఆమె ద్వారానే కథ చెప్పబడుతుంది. ఆమె భర్త జయంత్. ఇద్దరు పిల్లలు-తేజా,శ్రేయా. శ్రేయా ఈ తరానికి ప్రతీక. స్నేహితులు-ఆకర్షణ-ఫోన్ ఉన్నాయి. మైత్రి తన స్నేహితురాలు మధుమతి గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా మధుమతితో ఏర్పడిన స్నేహం  ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా కొనసాగిస్తుంది మైత్రి. మధుమతి ప్రేమించిన వంశీ మరణిస్తాడు.తర్వాత విక్రమ్ అనే వివాహితుడు ఆమెకు స్నేహితుడిగా ఉంటాడు. ఓ సారి రైలు ప్రయాణంలో కార్తీక్ అనే కుర్రాడు మైత్రి వివరాలు తెలుసుకుందామని తొలి పరిచయం ద్వారా అనుకున్నా అతనికి ఇవ్వదు.

          తర్వాత  మైత్రికి జయంత్ తో వివాహంతో మధుమతికి దూరమవుతుంది మైత్రి. అనుకోకుండా రాంగ్ నంబర్ ద్వారా తమ కాలనీలోనే ఉంటున్న కార్తీక్ ను కలిసినా, అతనే కార్తీక అని గుర్తించదు. అతనికి అప్పటికీ పెళ్ళయి భార్య ప్రణతి మరణిస్తుంది. కార్తీక్ సోల్జర్. అస్సాంలో పోస్టింగ్ పడ్డాక యుద్ధంలో గాయపడి వస్తే నర్స్ ప్రణతి బాగా చూసుకుంటుంది. అది వారి పెళ్ళికి దారి తీస్తుంది. మత కలహాలు చెలరేగి  సరైన చికిత్స అందకపోవడం వల్ల గర్భవతి ప్రణతి మరణిస్తుంది.

          జయంత్ మేనకోడలు పప్పీ చదువుకోవడానికి వచ్చిన తర్వాత జయంత్ ఆమెతో అతి చనువుగా ఉండటం,పిల్లల్ని  పట్టించుకోకపోవడం జరుగుతుంది. చివరికి ఎలానో పప్పీని పంపించేస్తారు.కానీ తనకి మానసిక స్వేచ్చ కావాలని మైత్రి అడిగితే ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న జయంత్ మైత్రి కార్తీక్ తో కలిసి అప్పుడప్పుడు వెళ్ళడం చూసి ఏదైనా తనకి చెప్పి చేయమని చెప్తాడు. క్రమ క్రమంగా జయంత్ మారతాడు.

          మధుమతి గురించి సమాచారం రావడంతో ఆమెను కార్తీక్ సాయంతో ఎన్నో అడ్డంకుల తర్వాత కలుసుకోగలుగుతుంది మైత్రి. మధుమతికి స్నేహితుడిగా ఉన్న విక్రమ్ కూడా జబ్బుతో మరణిస్తాడు. వంశీ తండ్రి కోడలైన మధుమతికి ఆస్తి రాయడంతో ఆస్తి కోసం ఆమెను తీసుకువెళ్తాడు తమ్ముడు. అక్కడ పల్లెటూరి జనాల కోసం పాఠశాల,ఆసుపత్రి వంటివి మధుమతి కట్టించడం ఆమె కుటుంబానికి నచ్చదు. తర్వాత అక్కడి పొలాల్లో పావీ పండిస్తున్నారని తెలిసి,ఆమె ఎదిరించడంతో ఆమెను పిచ్చిదానిగా చిత్రీకరించి పిచ్చాసుపత్రిలో పెడతారు.

          చివరకు ఆమె చనిపోయిందని నమ్మింపజేసినా తప్పించుకున్న మధుమతి మైత్రి పెద్దమ్మ ఇంట్లో ఉండటం,అక్కడ మైత్రి ఆమె ఫోటో చూడటంతో అందరూ కలుస్తారు. మధుమతి ప్రత్యర్ధుల మీద కేసు ఫైల్ చేసి వారందరి సహకారంతో తన ఆశయం కోసం మళ్ళీ సన్నద్ధమవుతుంది.

          ప్రతి మనిషికి ఉండే గతంలో కొందరి ప్రాముఖ్యత ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. వారిని యాదృచ్చికంగా కలుసుకోవడం,అందులోనూ ఓ ముఖ్య పాత్ర వారి జీవితంలో మనం పోషించడం అన్నది ఎవరికైనా మధుర స్మృతే.

                      *     *    * 



Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ