రాజబంటు

 సినీ సంచారం

        రాజబంటు

           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   


          మితాబ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, విద్యా బాలన్ ,షర్మిలా టాగూర్,జాకీ ష్రాఫ్ వంటి స్టార్ కాస్టింగ్ తో 2007 లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమానే ఏకలవ్య-ద రాయల్ గార్డ్. ఈ సినిమా అమెరికా,నెదర్లాండ్స్,లండన్ లో కూడా విడుదలైనప్పటికీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టినా, 2007 లో ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ కు కూడా ఎంపికైంది. ఈ సినిమా కథ ఓ రాజవంశానికి సంబంధించినది. ఈ సినిమా వాతావరణం,అమితాబ్ బచ్చన్ నటన సినిమాకు ఆదరణ దక్కేలా చేసినప్పటికీ కథ కొంతమేరకు పాతగా ఉండిపోవడం వల్ల ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది.

          తొమ్మిది తరాల నుండి ఏకలవ్య కుటుంబం దేవిగర్ సామ్రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంది. ప్రస్తుతం దానికి రాజు  జయవర్ధన్,రాణి సుహాసిని దేవి.రాణి అనారోగ్యంగా ఉండి ఏకలవ్యను చూడాలనే చివరి కోరికతో ఉన్న జయవర్ధన్ అతన్ని కలవరిస్తున్నందుకు ఆమెను హత్య చేస్తాడు. జయవర్ధన్ కు హర్షవర్ధన్ అనే కొడుకు,నందిని అనే కూతురు ఉన్నారు. హర్షవర్ధన్ ఆ సమయంలో విదేశాల్లో ఉన్నాడు. నందిని మనస్థిమితం సరిగా లేని అమ్మాయి. రాణి మరణించాక హర్షవర్ధన్ ఆమె అంతిమసంస్కారాల కోసం తిరిగి వస్తాడు.

          అతని తల్లి అతనికి చనిపోయే ముందు ఓ ఉత్తరం రాస్తుంది. దాని ద్వారా హర్షవర్ధన్ తన తండ్రి జయవర్ధన్ కాడని, ఏకలవ్య అని తెలుసుకుంటాడు.ఏకలవ్యకు చూపు మందగించడం వల్ల అతన్ని చూసుకోమని ఆ ఉత్తరంలో తల్లి కోరికగా గుర్తిస్తాడు హర్షవర్ధన్. జయవర్ధన్ కు పిల్లలు కలగని కారణంగా రాజమాత తమ నమ్మకస్తుడైన ఏకలవ్య చేత సంతానం కోసం ఆ పని చేయిస్తుంది. ఆ నిజం మొదట్లో రాజా జయవర్ధన్ కు తెలియకపోయినా, తెలిసిన తర్వాత నుండి అతని మీద కోపం పెంచుకుంటాడు.

          తన తమ్ముడి ద్వారా ఏకలవ్యను హత్య చేయించాలనే పథకం వేస్తాడు జయవర్ధన్. ఏకలవ్య,జయవర్ధన్ కారులో వెళ్తున్న సమయంలో ఏకలవ్యను హత్య చేయాలనే పథకం ఉన్నప్పటికీ చివర్లో జయవర్ధన్ తమ్ముడు జ్యోతివర్ధన్ మాత్రం జయవర్ధన్ ను హత్య చేస్తాడు. ఆ హత్యను ఏకలవ్య చూడలేకపోయినా షూని బట్టి అది  జ్యోతివర్ధన్ కొడుకని గుర్తిస్తాడు ఏకలవ్య. తన రాజుని హత్య చేసిన వారి మీద ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు.కానీ హర్షవర్ధన్ తన తండ్రిని రాజుగా రాజ్యం వదిలి అతని ఊరికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి క్షేమాన్ని మనసులో ఉంచుకుని  ఆ పని చేస్తాడు హర్షవర్ధన్.  ఏకలవ్య మాత్రం ఆ ప్రతీకారం కోసం మొదట జ్యోతివర్ధన్ కొడుకుని హత్య చేస్తాడు. ఆ టాటా జ్యోతివర్ధన్ ను కూడా హత్య చేస్తాడు.కానీ తన అనన్ను చంపమని ఆజ్ఞ ఇచ్చింది హర్షవర్ధన్ అని చెప్తాడు జ్యోతివర్ధన్.

          హర్షవర్ధన్ ను కూడా హత్య చేయడానికి బయల్దేరతాడు ఏకలవ్య. సింహాసనం కోసం తండ్రినే హత్య చేశాడని భావిస్తాడు ఏకలవ్య.కానీ తనకు తండ్రైన ఏకలవ్యను కాపాడుకోవటం కోసం రాజా జయవర్ధన్ ఏకలవ్యను హత్య చేయడానికి ఇస్తానన్న దాని కన్నా ఎక్కువ డబ్బు ఇచ్చి అతన్నే హత్య చేయించానని చెప్తాడు హర్షవర్ధన్.

          ధర్మం కారణం,మేధ,ప్రజ్ఞ,మనఃసాక్షి ని అనుసరించి నడవాలని అదే సూత్రంతో తన ధర్మాన్ని తాను నెరవేర్చానని చెప్తాడు హర్షవర్ధన్.అతని అభిప్రాయంతో ఏకీభవిస్తాడు హర్షవర్ధన్. ఆ తర్వాత తన తండ్రి రాజుగా ఉన్నప్పుడూ ప్రజల దగ్గర నుండి లాక్కున్న భూములను వారికే తిరిగి ఇచ్చేస్తాడు హర్షవర్ధన్. ప్రజలందరి సమక్షంలో ఏకలవ్యను తన తండ్రిగా అంగీకరించడంతో ఈ సినిమా ముగుస్తుంది.

          సినిమాలో కథ బావుంది,నటుల నటన బావుంది.కానీ ఏదో మిస్ అయ్యింది. అదే ఏకలవ్య పాత్ర చిత్రణలో లోపం. సినిమా పేరు వినగానే ఆ పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటుందనే ప్రేక్షకులు ఆసిస్తారు. పాత్రలన్నీ ఎక్కువ సేపు ఉన్న భావన ఎక్కడ కలగదు.పాత్రలు పాత్రలుగానే వచ్చి తమ పాత్ర నిర్వహించి వెళ్ళిపోతున్నాయనే భావనే తప్ప వారి ముద్ర ప్రేక్షకుల మీద గాఢంగా ఉండదు.అందుకే స్టార్ కాస్ట్ ఉన్నా సరే పాత్ర చిత్రణ లోపం వల్ల ఈ సినిమా దాని స్థాయికి తగ్గట్టు అనిపించదు. కానీ బిగ్ బి నటన కోసమైనా ఓ సారి చూడాల్సిన సినిమా ఇది.

   *     *    * 

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష