హంతకుడు
చదువరి
హంతకుడు
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
సిడ్నీ
షెల్డన్ రాసిన నవలల్లో ‘The Sky is
Falling’ ఓ క్రైమ్ థ్రిల్లర్ నవల. సిడ్నీ షెల్డన్ నవలల్లో కథకు,శైలికి మాత్రమే ఎక్కువ
ప్రాధాన్యత ఉన్న నవల ఇది. కానీ ఈ కథాంశంలో ఓ దేశం మీద ఇంకో దేశం ఆధిపత్యం మరణాయుధాలను
ఉత్పత్తి చేయడం వల్ల ఎలా సాధించుకోవాలనుకుంటుంది అన్న అంశం చివరి వరకు మనకు కనిపించదు. అది ఓ కారణంగా చివర్లోతేలిపోయే
ముడిలా ఉండి మొత్తం కథంతా హత్యా,హంతకుల మధ్యే తిరుగుతూ ఉంటుంది.
దీనిలో
ముఖ్య పాత్ర డానా ఇవాన్స్ ఓ జర్నలిస్ట్. ఆమె సారాజీవోలో జరిగిన యుద్ధాన్ని కవర్
చేయడానికి వెళ్తుంది. ఆమె అక్కడ ఆ యుద్ధాల వల్ల ఓ చేయి పోగొట్టుకుని అనాధగా
మిగిలిపోయిన కెమెల్ అనే అనే బాలుడిని కూడా తనతో పాటు తీసుకువస్తుంది. అతన్ని
స్కూల్ లో కూడా చేర్పిస్తుంది.
గారి
విన్త్రోప్ హత్యకు గురవుతాడు. అతను విన్త్రోప్ కుటుంబంలో ఆఖరివాడు. అతని కన్నా
ముందు అతని తల్లి,తండ్రి,చెల్లెలు కూడా
వివిధ యాక్సిడెంట్లలో మరణించారు. గారి దగ్గర కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి.
అతని దగ్గరకు దొంగతనానికి వచ్చినవారు నగలు,డబ్బు వదిలేసి
కేవలం పెయింటింగ్స్ లో కూడా విలువైనవి కాకుండా మాములువి తీసుకుని అతన్ని హత్య
చేయడం డానాను ఆశ్చర్యపరుస్తుంది. వీటి మిస్టరీ చేధించాలని నిర్ణయించుకుంటుంది.
దానిలో
భాగంగా గారి తండ్రి మిత్రుడైన రోగర్ హడ్సన్ ను కలుస్తుంది. ఇంకో పక్క కెమెల్
స్కూల్ లో బులియింగ్ కు గురవుతూ వాటిని ఎదుర్కునే క్రమంలో హింసాత్మక చర్యలకు
పూనుకుంటూ ఉంటాడు.ప్రిన్సిపల్ అతన్ని స్కూల్ నుండి ఎక్స్పెల్ చేస్తాడు. ఆ తర్వాత
డానా తన బాస్ సాయంతో కెమెల్ కు కృత్రిమ చేతిని అమరుస్తుంది. డానా ప్రేమించిన జెఫ్
కు తాను తిరిగి వచ్చే వరకు కెమెల్ బాధ్యత అప్పగించి తాను ఆ మర్డర్ మిస్టరీలు
చేధించడానికి బయల్దేరుతుంది. గారి సెక్రటరీ జోన్ అతని మీద కేసు వేసిందని,ఆమె
ఆ తర్వాత ఆ కేసు వెనక్కి తీసుకుందని తెలియడంతో ఆమెను కలిసే ప్రయత్నం చేయడం,ఆమె చివరకు ఒప్పుకోవడం,ఆమెను కలిసే రోజే ఆమె హత్యకు గురవుతుంది.
ఆ
విన్త్రోప్స్ కుటుంబం చనిపోతే వచ్చే ఆస్తి చారిటికి వెళ్తుంది కనుక డబ్బు కోసం
కాదని ఆమెకు అర్ధమవుతుంది.ఇంకా ఆ విషయం మీద స్పష్టత రావడం కోసం ఆ కుటుంబంలో వారు
మరణించిన ప్రదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. కానీ వారికి శత్రువులు ఎవరు
లేరనే అందరూ చెప్తారు. అదే సమయంలో జెఫ్ మొదటి భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడంతో
ఆమెను చూసుకోవడానికి జెఫ్ వెళ్ళడంతో ఆమె కెమెల్
ను చూసుకోవడానికి ఓ నానిని పెడుతుంది.
రష్యాకు
ఆమె వచ్చాక ఆమెకు సాషా అనే మిలిటరీ ఆఫీసర్ వారి హత్యలు ఎందుకు జరిగాయో చెప్తానని
కానీ దానికి ప్రతిఫలంగా తనను ఆ దేశం నుండి తప్పించమని అడుగుతాడు.క్రాస్నోయార్క్
-26 అనే అండర్ గ్రౌండ్ పట్టణానికి ఆమెను తీసుకువెళ్తాడు.అది కేవలం ప్లూటోనియమ్
మాత్రమే ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తల కోసం నిర్మించిన పట్టణమని,టేలర్
విన్త్రోప్ (గారి తండ్రి )ని అతని పార్టనర్ ఈ ప్లూటోనియమ్ కోసమే హత్య చేశాడని
చెప్తాడు. మిగిలిన విషయాలు తనను తప్పించాక చెప్తానని చెప్తాడు. కానీ ఆమె మళ్ళీ
అతన్ని కలుసుకోవడానికి వచ్చేసరికి అతను హత్య చేయబడి ఉంటాడు. వెంటనే రోగర్ హడ్సన్
కు ఆ విషయం చెప్పి అతని ద్వారా విమానంలో రిజర్వేషన్ చేయించుకుని తిరిగి వచ్చే
ప్రయత్నంలో ఉంటుంది డానా.కానీ ఆమెకు ఆలోచించాక రోగర్ టేలర్ పార్టనర్ అని,అతనే ఈ హత్యలన్నీ చేయించాడని,ఇప్పుడు తనను కూడా హత్య
చేసే ప్రయత్నంలో ఉన్నాడని అర్ధమవుతుంది.అప్పుడే ఆమెకు కెమెల్ కూడా గుర్తుకు
వస్తాడు.కెమెల్ దగగ్ర ఉంచిన నాని కూడా రోగర్ భార్య పమిలా తాను అడిగితే పంపిందని,తాను ఎప్పుడు ఫోన్ చేసినా కెమెల్ నిద్ర పోతున్నాడని చెప్పడం కూడా డానాలో
అనుమానాన్ని పెంచుతుంది.
అదే
సమయంలో కెమెల్ కు అనుమానం వచ్చి తప్పించుకుని స్కూల్ కు వెళ్ళినా అక్కడ ఆ రోజు
సెలవు కావడంతో అతన్ని వెంబడించిన వారు అతన్ని సెల్లార్ లో ఉంచి,
ఊపిరి ఆడకుండా గ్యాస్ వదులుతారు. డానాను చంపే పని హడ్సన్ తన పనివాడైన సీజర్ కు
అప్పగిస్తాడు. జెఫ్ తిరిగి వస్తాడు. సీజర్ లొకేషన్ ను కనిపెట్టి డానాను
రక్షిస్తాడు. ఆమె ద్వారా కెమెల్ ను కూడా రక్షిస్తాడు. కుటుంబంతో సహా అక్కడినుండి
ప్లేన్ లో తప్పించుకోవాలని ప్రయత్నించిన హడ్సన్ ప్లేన్ లో సాషా సోదరుడు బాంబు
పెట్టడం వల్ల వాళ్ళు కూడా మరణిస్తారు .
ఆ
తర్వాత జెఫ్ ను డానా వివాహం చేసుకుంటుంది. కెమెల్ కు ఓ టీవి షో లో అవకాశం
వస్తుంది. జెఫ్ మొదటి భార్య మరణిస్తుంది. హడ్సన్స్ చేసిన హత్యలను తమ క్రైమ్
ప్రోగ్రామ్ లో వేస్తారు డానా పని చేసే ఛానల్ లో. డానా ఇంకో మర్డర్ మిస్టరీ తన బాస్
ను అడగటంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ
నవలలో చెప్పిన క్రాస్నోయార్క్ కల్పితం కాదు,నిజమే.సిడ్నీ షెల్డన్
నవలల్లో కథాంశం కల్పనే అయినా సరే కొన్ని వాస్తవాలు మాత్రం వాటికి మూలాలుగా ఉంటాయి.
ఇంగ్లీష్ నవలా రచయితల్లో సింపుల్ ఇంగ్లీష్ తో ఆంగ్ల నవలలు చదవడం ప్రారంభంలో ఉన్నవారు
తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
* * *

Comments
Post a Comment