అర్ధాగ్ని

 చదువరి

                అర్ధాగ్ని

                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

          మాజంలో  పురుషుడు తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి స్త్రీని ఎలా ఓ ఆయుధంగా మార్చుకుంటాడో స్పష్టం చేసే నవలే శాంతిస్వరూప్ గారి అర్ధాగ్ని.తన కొడుకు లోపాన్ని కప్పి పుచ్చడానికి తండ్రి,దానిని అవకాశంగా మార్చుకోవాలనుకున్న ఆమె బావ,చివరకు ఇవేమీ సాధ్యం కాకపోవడంతో ఆమెను చితి వరకు ఎలా నడిపించే ప్రయత్నం ఎలా చేశారో ఈ నవల స్పష్టం చేస్తుంది.

          సంగమేశ్వర సిద్ధాంతికి ఇద్దరు కొడుకులు కేశవదత్త,శివదత్త.ఒక కుమార్తె మంగళ. శివదత్తకు పేదింటి  పురోహితుడి కూతురైన  అనూహ్యతో వివాహం జరుగుతుంది. సంగమేశ్వర శాస్త్రి గారిది ఆగ్నేయపురం. ఆ ఊరంతటికి  ఆయన మాటే శిరోధార్యం. అనూహ్య వివాహం జరుగుతున్నప్పుడే  కేశవచిత్తుడి ఆరునెలల గర్భిణి భార్య అనారోగ్యంతో మరణిస్తుంది. అందుకే అనూహ్య అత్తారింటికి ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.

          అత్తారింట్లో అడుగు పెట్టిన అనూహ్య మొదటిరాత్రి నాడు ఆమె భర్త బదులు బావ కేశవచిత్తుడు వస్తాడు. తమ శాంబరి సంప్రదాయం ప్రకారం మొదట అగ్రజుని స్పర్శ తర్వాతే తమ్ముడు స్పృశిస్తాడని అతను చెప్తాడు. అనూహ్య అతన్ని నిరాకరిస్తుంది. రెండోరోజు అతన్ని వేడుకుని కాళ్ళు పట్టుకుంటుంది, కాళ్లతో ఆమెను విదిలించి వెళ్ళిపోతాడు. కాలి స్పర్శ కూడా స్పర్సేనని భావించిన అనూహ్య భర్తతో స్పర్శ జరిగిందని భర్తతో చెప్తుంది అనూహ్య. అనూహ్య అక్కడికి వచ్చాక ఆమె మధుపర్కం చీర ఉతకడానికి నదిలోకి వెళ్ళిన చాకలి కొడుకు అందులో మునిగి మరణిస్తాడు. తర్వాత నీటి కోసం ఆ ఊరిలో బావి తవ్వుతుంటే పుర్రెలు బయటపడతాయి. అదంతా అనూహ్య కాలుపెట్టడం వల్లే జరిగిందని భావిస్తారు. ఆ బావి చోటులో ఆలయం కట్టాలనే నిర్ణయం జరుగుతుంది.

          తర్వాత సంగమసిద్ధాంతి తమ ఆచారం ప్రకారం శివదత్తుడుని,అనూహ్యను రాజస్తాన్లో ఉన్న హోమాపూర్ గ్రామంలో ఉన్న శాంభవీ ఆలయానికి పంపుతాడు. అక్కడ ఆమె భర్త మగాడు కాదని ఆమెకు తెలుస్తుంది. కోపంతో అతన్ని దూషిస్తుంది.  ఈ లోపు ఊ ఆగంతకుడు వచ్చి ఆమెను ఆక్రమిస్తాడు. అది జరిగాక వచ్చిన శివదత్తుడు జరిగినదానికి ఎంతో సంతోషిస్తాడు. భార్యను తన కళ్ళముందే అనుబఃవిస్తే సంతోషించిన శివదత్తుదిని ఆ ఆగంతకుడు కొడతాడు. ఆ దాడిలో తలకు రాయి తగిలి శివదత్తుడు మరణిస్తాడు. అతనికి అక్కడే ఆ ఊరిపెద్ద సాయంతో దహనసంస్కారాలు చేసి అత్తారింటికి అస్థికలు తీసుకువెళ్తుంది అనూహ్య.

          శివదత్తుడి లోపం బయట పడుతుందని ఆ ఊరివారిని సతీసహగమనానికి ఒప్పిస్తారు సంగమేశ్వర సిద్ధాంతి,అతని పెద్ద కొడుకు. ఓ రోజు ముందు అనూహ్యకు తాను గర్భవతినని తెలుస్తుంది. బ్రతకాలనే కోరిక పుడుతుంది. ఆ ఊరిలో కాస్త ఆమె పట్ల అభిమానం చూపించే క్రాంతికి ఆ విషయం చెప్తుంది. తర్వాత చితి వరకు ఆమెను తీసుకువెళ్ళాక ఆమె గర్భవతి అని తెలియడంతో అది ఆగిపోతుంది.

          ఆగంతకుడైన శబరిశర్మ సంగమశాస్త్రిని అసలు విషయం చెప్పేస్తానని బెదిరిస్తాడు. పెద్ద కొడుకు వల్ల ఏం జరగకపోవడం వల్ల అందుకు తన శిష్యుడిని నియమిస్తాడు సంగమేశ్వర సిద్ధాంతి. చేసేది లేక వేదాల ప్రకారం నియుక్త భర్తగా అతనికిచ్చి అనూహ్యకు పునర్వివాహం నిర్ణయిస్తారు. ఆ చితిలో కేశవచిత్తుడు ఆత్మాహుతి చేసుకుని మరణిస్తాడు. మగవాళ్ళ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి స్త్రీలను ఎలా వ్యధలకు గురి చేస్తారో తెలిపే నవల ఇది.

                                 *     *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ