ఒప్పైన తప్పు!
సీజనల్ సమీక్షలు
ఒప్పైన తప్పు!
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
ఇండియన్ సీజన్స్ హంగామా 2018లో
మొదలైంది. అందులో బ్రీత్ కు ఎంతో ప్రేక్షాకాదరణ దక్కింది. తండ్రి తన కొడుకుని
కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడో స్పష్టం చేసే నవల ఇది. హత్యలకు మోటివ్ పగ,మనిషిలోని
బలహీనతలే కాదు ప్రేమ కూడా కావచ్చు అని నిరూపించే కథాంశం ఇది. మాధవన్ తండ్రిగా
చేసిన నటన,అమిత్ సాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న సీన్లు
ఎప్పటికి ప్రేక్షకుల మనసుల్లో ఉండి పోతాయి.
డాని
ఓ ఫుట్ బాల్ కోచ్, అతనికి ఆరేళ్ళ కొడుకు. అతనికి లంగ్స్
ట్రాన్స్ ప్లాంటేషన్ జరగకపోతే ఐదు,ఆరు నెలల్లో మరణిస్తాడని
డాక్టర్లు చెప్తారు. తన కొడుకు నంబర్ నాలుగు దాతల్లో. ఇకపోతే కబీర్ సావంత్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భార్య రియా. యాక్సిడెంటల్ గన్ ఫైరింగ్ వల్ల అతని
కూతురు మరణిస్తుంది.అప్పటి నుండి అతను పూర్తిగా బాధలోనే ఉంటాడు. అతని భార్య
ప్రస్తుతం ఉంటున్న ఇంటిని అమ్ముదామనుకున్న దానిలో కూతురు జ్ఞాపకాలతో ఉన్న అతను
దానికి ఒప్పుకోడు. తన కొడుకుని కాపాడుకోవడానికి
దాతల్ని చంపడం ఒక్కటే మార్గమని భావిస్తాడు డాని.అందుకోసం అవసరమైన దాతల
లిస్టును సంపాదిస్తాడు. ఈ సీజన్ లో ఈ హతయ్లు చేసేది డాని అనే విషయం ప్రేక్షకులకు
ముందే అర్ధమైపోతుంది.
ఆ
లిస్టులో ఉన్న మొదటి వ్యక్తిని ఆస్త్మా రోగి. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేయాలని
నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతను మరణించడు కానీ కోమాలో ఉంటాడు. ఆ తర్వాత అతని
టార్గెట్ రాహుల్ అనే ప్రోగ్రామింగ్ మేనేజర్. అతను వర్షంలో ఓ రోజు వెళ్తుండగా అతని హెల్మెట్ దొంగతనం చేసి,అతనికి
యాక్సిడెంట్ చేసి హత్య చేస్తాడు డాని. ఆ తర్వాత అతని హెల్మెట్ అతని బైక్ కు లాక్
చేస్తాడు. దానితో అతను హెల్మెట్ ధరించకపోవడం వల్లే యాక్సిడెంట్ వల్ల మరణించాడని
అందరూ భావిస్తారు. రాహుల్ ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు.అతను కబీర్ ఆఫీసర్ కూడా. రాహుల్
పెళ్ళి కూడా నిర్ణయించబడింది.అందరూ అది యాక్సిడెంట్ అని భావించినా అతని ఫియాన్సీ
మాత్రం రాహుల్ సేఫ్టీ ఫ్రీక్ అని,అటువంటి వ్యక్తి హెల్మెట్
ఉంచుకుని కూడా ధరించకపోవడం అనే ప్రశ్నే ఉండదని,కచ్చితంగా అది
యాక్సిడెంట్ కాదని కబీర్ తో చెప్తుంది. కబీర్ భార్య రియా అతనికి డైవోర్స్ పేపర్స్
పంపిస్తుంది.
అలా జోష్,డాని కొడుకు లిస్టులో
నాలుగు నుండి మూడుకు వస్తాడు.ఇక డాని తరువాతి టార్గెట్ అనిత అనే నటి. ఆమె దగ్గరకు
సీన్ ఆడిషన్ కోసం అని ఓ ఆత్మహత్య సీన్ చేయించి దానిని రికార్డు చేయించి ఆమెను హత్య
చేస్తాడు. అలా అతని కొడుకు లిస్టులో మూడు నుండి రెండుకు వస్తాడు. అయితే ఈ కేసులు
ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కబీర్ కు మరణించిన ఈ ఇద్దరిదీ ఒకే బ్లడ్ గ్రూప్ అని,వారు ఆర్గాన్ డోనర్స్ అని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ డోనర్స్ లిస్టులో
ఉంది తన భార్య రియా అని కూడా తెలుస్తుంది.
రియాను
హత్య చేసే ప్రయత్నం చేసినప్పుడు కబీర్
ఆమెను కాపాడతాడు.కానీ డాని మొహం మాత్రం చూడలేకపోతాడు. ఆ తర్వాత హార్ట్ ఎటాక్
వచ్చేలా తనకు తాను చేసుకుని, మొదట ఐసియు లో ఉన్న అతన్ని కూడా హత్య
చేస్తాడు. దానితో జోష్ లిస్టులో రెండు నుండి ఒకటికి వస్తాడు. అదే సమయంలో ఎవరైతే
ఆర్గన్స్ స్వీకరించే వారిలో ఉన్నారో వారిని కబీర్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు
పెడతాడు.
కబీర్
కు డాని మీద అనుమానం కలుగుతుంది. అదే సమయంలో డానితో డేట్ లో ఉన్న అరుణ అదే హాస్పటల్ లో పని చేస్తూ ఉంటుంది. అతను
సునీల్ మెహతా పేరుతో హార్ట్ ఎటాక్ రోగిగా హాస్పటల్ లో జాయిన్ అయిన విషయం ఆమెకు
తెలుస్తుంది. ఆ తర్వాత జోష్ నంబర్ వన్ కు రావడం కూడా ఆమె గ్రహిస్తుంది. అదే
ప్రశ్నించినందుకు డాని ఆమెను కూడా హత్య చేస్తాడు. అది కూడా యాక్సిడెంట్ గానే
ఉండిపోతుంది. తన టార్గెట్ ను రియా నుండి నాయర్ కు మార్చుకుంటాడు.
తనను
కబీర్ ఫాలో అవుతున్న విషయం గ్రహించిన డాని బ్లైండ్ స్కూల్ లో ఫుట్ బాల్
నేర్పించడానికి వెళ్తాడు. తన బదులు తను వాడే పెర్ఫ్యూమ్ ఓ బొమ్మకు కొట్టి,వారు
సినిమా చూస్తుండగా ఆ సినీ సీన్ల రికార్డింగ్ పెట్టి నాయర్ ను స్విమ్మింగ్ పూల్ లో
హత్య చేసి తిరిగి బ్లైండ్ స్కూల్ కి వచ్చేస్తాడు. అదే సమయంలో తన నుండి కబీర్
దృష్టి ఇంకో ఆర్గాన్ స్వీకరించాల్సిన మాన్వి భర్త మీదకు మళ్ళిస్తాడు. అతనిలాంటి
వాయిస్,డ్రెస్సింగ్ తో వెళ్ళి సిసి ఫుటేజ్ లో అతని తల
కనబడకుండా అతనే అన్నట్టు నమ్మిస్తాడు డాని. అతన్ని పట్టుకుని అతన్నే హంతకుడిగా
భావించి, ఆ కేసు తర్వాత ముంబై వదిలి వెళ్ళిపోతాడు కబీర్.
తనను
కబీర్ ఫాలో అవ్వడం లేదనుకున్న డాని రియాను హత్య చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్
గా పట్టుకుంటాడు కబీర్. అతన్ని రెచ్చగొడతాడు డాని.చివరకు కబీర్ అతన్ని షూట్
చేస్తాడు. ఆ తర్వాత ఓ యాక్సిడెంట్ లో అదే బ్లడ్ గ్రూప్ తో మరణించిన ఓ వ్యక్తి
లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో జోష్ బ్రతికుతాడు.
బ్రీత్-1
హంతకుడు ఎవరో మొదట్లోనే తెలిసిపోయినా సరే ఓ తండ్రి తన బిడ్డను ఎలా కాపాడుకుంటాడు
అనే అంశం వల్ల డాని పట్ల ప్రేక్షకులకు సానుభూతి ఉంటుంది. అదే ప్రేమ ఈ సీజన్ ను
గ్రాండ్ హిట్ చేసింది. సినిమాలు చూసి బోర్ కొట్టి సీజన్లు చూడాలనుకుంటే తప్పక
దీనిని చూడండి.
*
* *

Comments
Post a Comment