ఆమె మరణం
సినీ సంచారం
ఆమె మరణం
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
బాలీవుడ్ సినిమాల్లో
సైకాలజికల్ థ్రిల్లర్ ను సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తో సమ్మేళనం చేసి ఘన విజయం సాధించిన సినిమా తలాష్. గోల్డ్
లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకురాలు,నటి,సినీ రచయిత్రి అయిన రీమా కాగ్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్
సినిమాలో మనకు కనిపించని జీవితాలను మిస్టరీగా చూపిస్తూనే, ఇంకో
పక్క సమాధానం మనం కనుక్కోవడానికి వీలుగా ఉండేలా స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఇది. అమీర్
ఖాన్,కరీనా కపూర్ ,రాణి ముఖర్జీ ముఖ్య పాత్రలుగా
వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లోనే ఓ కొత్త తరహా కాంబినేషన్ సినిమా.
ప్రముఖ
నటుడైన అర్మాన్ కపూర్ ఎవరు లేని ప్రాంతంలో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ అదుపు తప్పి
పక్కనే ఉన్న సముద్రంలో కారుతో సహా పడిపోయి మరణిస్తాడు.సుర్జన్ సింగ్ (అమీర్ ఖాన్) తన
అసిస్టెంట్ అయిన దేవ్రత్ తో కలిసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు.ఇది సుర్జన్
వృత్తి జీవితం.
వ్యక్తిగతంగా
సుర్జన్ జీవితంలో మర్చిపోలేని వ్యథ అతని కొడుకు మరణం. ఓ రోజు కొడుకుతో కలిసి ఆడుకోవడానికి
భార్య తో కలిసి వెళ్ళినప్పుడు సుర్జన్,అతని భార్య అక్కడ రిలాక్స్
అవుతున్న సమయంలో అతని కొడుకు కరణ్ తన స్నేహితుడితో కలిసి నీటిలో డ్రైవింగ్ కు వెళ్ళి
ఆ నీటిలో మునిగి చనిపోతాడు. కరణ్ స్నేహితుడిని సుర్జన్ రక్షించగలుగుతాడు తప్ప కరణ్
ని మాత్రం కాదు. ఆ రోజు తాను నిర్లక్ష్యంగా ఉండకపోతే కొడుకు మరణించి ఉండేవాడు కాదని
అపరాధ భావంతో ఉంటాడు సుర్జన్. ఇంకో పక్క అతని భార్య రోష్ని (రాణి ముఖర్జీ ) కొడుకు
మరణంతో పూర్తిగా క్రుంగిపోయి,అప్పటి నుండి ఎంతో ముభావంగా ఉంటుంది.
సుర్జన్, భార్యతో
కలిసి కొత్త ఇంటికి మారతాడు. వారి పక్క ఇంట్లో ఉండే ఫ్రెన్ని తాను ఆత్మలకు మీడియం గా
వ్యవహరించగలనని,కరణ్ ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్తుంది.
సర్జన్ దీనిని పూర్తిగా వ్యతిరేకించినా రోష్ని మాత్రం ఫ్రెన్ని ఇంటికి వెళ్ళి ఆమె ద్వారా
కొడుకు తనను తన మరణం గురించి బాధ పడవద్దని చెప్తున్నాడని అర్ధం చేసుకుంటుంది. దానితో
పాటు తన తండ్రితో కూడా మాట్లాడాలనుకుంటున్నాడని ఆమె తెలుసుకుంటుంది. సర్జన్ కు వీటి
మీద నమ్మకం ఉండదు.
అర్మాన్
కపూర్ మరణించిన రోజు రెండు మిలియన్ల డబ్బును తనతో పాటు తీసుకుని శషి అనే అతనికి ఇచ్చాడని అతనికి తెలుస్తుంది. శషి విలాసవంతులకు,పెద్ద
వారికి అమ్మాయిలను సప్లై చేస్తూ ఉంటాడు.మూడేళ్ళ క్రితం ఓ అమ్మాయిని
అర్మాన్ మరియు అతని మిత్రుడైన సంజయ్ కోసం పంపిస్తాడు. అది ఆ హోటల్ సిసిటీవి ఫుటేజ్
లో ఉంటుంది. దానిని ఆసరాగా తీసుకుని అర్మాన్ ను అతను డబ్బుల కోసం వేధిస్తూ ఉండేవాడు.
అలా ఆ రోజు అతనికి డబ్బులు ఇచ్చిన అర్మాన్ తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు అలా మరణించాడో
సర్జన్ కు అర్ధం కాదు.
ఈ
కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో సర్జన్ కు రోసి అనే వేశ్య తారసపడుతుంది. ఆమెతో
క్రమేపీ అతనికి పరిచయం పెరుగుతుంది. తనను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న శషి అక్కడి నుండి ఆ డబ్బుతో సహా పారిపోతాడు. శషి మల్లికను వేశ్యా వృత్తి నుండి తప్పించి ఆమెను
విడిపించడానికి కావల్సిన డబ్బు ఇచ్చి ఆ తర్వాత ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. శషిని అర్మాన్
మిత్రుడైన సంజయ్ అతన్ని హత్య చేయిస్తాడు. అదే అదనుగా తీసుకుని శషి దగ్గర పని చేసే టిముర్
ఆమెను మళ్ళీ ఆమెను తిరిగి ఆ మేడమ్ దగ్గరకు పంపిస్తాడు. శషి ఫోన్ సిమ్ టిముర్ దగ్గర
ఉండటం వల్ల అతని రహస్యం కొంతమేరకు అర్ధమైన అతను సంజయ్ కు ఫోన్ చేసి మళ్ళీ డబ్బు ఇవ్వమని
లేకపోతే అతని రహస్యం బయటపడుతుందని బెదిరిస్తాడు. ఆ రహస్యం ఆ సిసి టీవి ఫుటేజ్ ఉన్న
డివిడి.
ఆ
డివిడిను ,ఆ డబ్బును శషి శవంతో
పాటు కనుగొన్న సర్జన్ ఆ డివిడి ద్వారా అందులో ఉన్న రోసిని గుర్తిస్తాడు. ఆమెను అడిగితే
నిజమేనని మూడేళ్ళ క్రితం తనను అర్ధరాత్రి అర్మన్, అతని స్నేహితులు
సంజయ్,నిఖిల్ తీసుకువెళ్ళారని చెప్తుంది.అంతకు మించి ఆమె ఏమి
చెప్పదు. రోసి మంచితనాన్ని గుర్తిస్తాడు సర్జన్. రోసి మల్లికను ఆ వృత్తి నుండి తప్పించమని
అడిగితే అలానే చేస్తాడు. టిముర్ సంజయ్ డబ్బు ఏ;ఆ ఇవ్వాలో సూచనలు
ఇస్తాడు.ఇప్పుడే టిముర్ ను అంతం చేయకపోతే ఇక ఎప్పటికీ ఈ బెదిరింపులు ఆగవని భయపడిన సంజయ్
అతనికి డబ్బు ఇచ్చి ఆ తర్వాత అతన్ని హత్య చేయడానికి తన మనుషుల్ని పురమాయిస్తాడు. వారి
తోటా దెబ్బలతో ప్రాణం పోకుండా ఉన్న టిముర్ అక్కడ కనిపించిన రోసిని చూసి షాకై ఆ భవనం
పై నుండి కింద పడి మరణిస్తాడు.
ఇన్వెస్టిగేషన్
లో సంజయ్ చేసింది తెలుసుకున్న సర్జన్ అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు
వస్తున్న సమయంలో వారికి ఎదురుగా రోసి రావడంతో పట్టు తప్పి కార్ ఆ సముద్రంలో పడిపోవడం
సంజయ్ మరణించడం,సర్జన్ ను రోసి కాపాడటం జరుగుతుంది.అప్పుడు రోసి ఆత్మ అని
తెలుసుకుంటాడు సర్జన్.
మూడేళ్ళ
క్రితం రోసిని ఆ ముగ్గురు కారులో తీసుకువెళ్తుండగా వెనుక సీటులో ఉన్న నిఖిల్ ఆమెను
బలవంతం చేయబోతుండగా ఆ కార్ డోర్ సరిగ్గా మూసుకోకపోవడం వల్ల వారిద్దరు ఆ కారులో నుండి
క్రింద పడిపోతారు. రోసిని అలానే వదిలేసి నిఖిల్ ను మాత్రం హాస్పటల్ లో జాయిన్ చేస్తారు.అతనికి
బ్రెయిన్ డెడ్ అవుతుంది. రోసిని శషి హాస్పటల్ కు తీసుకువెళ్తే అందరికీ తెలిసిపోతుందని
ఆమెను అక్కడే వైద్యం చేయించాలనుకున్నా ఆపాటికే ఆమె ప్రాణం పోతుంది. ఆమె శవాన్ని శషి
పూడ్చి పెడతాడు. సర్జన్ కు ఫ్రెన్ని అన్న మాటలు గుర్తుకు వస్తాయి.’దుఃఖంగా
ఉన్నవారే ఆత్మలను ఆకర్షిస్తారు' అని.అందుకే రోసి ఆత్మ తనతో సంభాషించిందని సర్జన్ కు అర్ధమవుతుంది.రోసిని పూడ్చిపెట్టి ఉన్న
స్థలానికి వెళ్ళి ఆమెకు అంతిమ దహన సంస్కారాలు చేస్తాడు. అప్పటి వరకు ఆత్మలను నమ్మని
అతను అప్పుడూ నమ్ముతాడు.కొడుకు తనను బాధ పడవద్దని రాసిన ఉత్తరం చదువుతాడు. సర్జన్ ,అతని భార్య కొత్త జీవితం ప్రారంభిస్తారు.
సినిమా
మొదలైనప్పటి నుండి చివరి వరకు ఎంతో ఉత్సుకతతో చూడాలనిపించే సినిమా ఇది.రోసి ఆత్మ అన్న విషయం కూడా
చివరి వరకు తెలియకపోవడం వల్ల ఎక్కడ కూడా కథలో థ్రిల్లర్ అంశం దెబ్బ తినకుండా అదే సస్పెన్స్
సినిమా అంతా కూడా సాగింది.సర్జన్ కొడుకు మరణం అనే అంశాన్ని అతని వృత్తి జీవితంలో జరిగిన
అనుభవం వల్ల అతను కూడా ఆత్మలను నమ్మడం అన్నది
ఓ లాజికల్ పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేయడం ఈ కథకు ముఖ్య బలంగా నిలిచింది. ఏ సినిమా బలమైనా
ఘర్షణను చివరకు సమన్వయ పరచడం. ఈ సినిమాలో ఏ ఒక్క సీన్ కూడా అవసరం మీరి ఉండదు. ఇప్పటి వరకు చూడకపోతే తప్పక ఈ సినిమా చూడండి.
* * *

Comments
Post a Comment