గాలిలో మేడలు
లఘు చిత్ర లోకం
గాలిలో
మేడలు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఊహాలు,కలలు,కోరికలు మనిషికి బాల్యం నుండే ఆలోచనల్లో రూపుదిద్దుకుంటాయి.తమకు ఏ పని
ద్వారా సంతోషం కలుగుతుందో,దేని వల్ల తామేదో సాధించామన్న భావన
కలుగుతుందో తెలియని బాల్యంలో పిల్లలు తమకు తోచిన రీతిలో తమ స్వేచ్ఛను,ప్రత్యేకతను వెతుక్కుంటూ ఉంటారు.అలాంటి ఓ అమ్మాయి కథే హిందీలో 'ఖయాలి పులావ్ 'అనే లఘుచిత్రంగా వచ్చింది.
ఆశ స్కూల్ లో టాపర్.పరాకుగా ఉంటూ ఏవో
ఆలోచనల్లో ఉంటుంది.రోజు స్కూలు నుండి వచ్చే దారిలో ఆ ఊరిలోనే స్మార్ట్ ఫోన్ ఉన్న యువకుడికి
డబ్బులిచ్చి కొంత సేపు ఆ ఫోన్ తో సమయం గడుపుతుంది.ఓ నటి పేరుతో ఫేస్బుక్ అకౌంట్
క్రియేట్ చేసుకుంటుంది.ఇలా స్కూలు జీవితం పాటు ఇంకేదో కావాలని కలల్లో ఉంటుంది.
ఆ సంవత్సర గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేరే పాఠశాలతో పోటీగా హ్యాండ్ బాల్
ఆడాల్సి ఉంటుంది. అప్పటివరకు
ఎప్పుడు ఆటలు ఆడని ఆశ ఆ ఆట ఆడే టీంలో ఉండాలని ఆశపడుతుంది.స్కూల్ లో ప్రాక్ట్రీస్
చేసినా,ఆమెకు ఆట ఆడే నైపుణ్యం లేదని స్పోర్ట్స్ మాస్టర్ తేల్చేస్తాడు.అయినా
అభ్యర్థించి ప్రాక్ట్రీస్ చేస్తూ ఉంటుంది.
ఆడే
వారికి ఉండాల్సిన జాగురుకత ఆమెకు ఉండకపోవడం వల్ల,ఆమె ఊహల్లో ఉంటూ
పరధ్యానంగా ఉండటం వల్ల ఆమె అభ్యాసం ఆమెకు ఆటలో ఉపయోగపడకపోవడం వల్ల ఆమెను టీంలో ఆమె
ఉండదు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు ఆ ఆట ఆడాల్సిన సమయంలో ఆ టీంలో ఒకరు
గాయపడటం వల్ల ఆశను తీసుకుంటారు. మొదటి సారి ఆ స్పొర్ట్స్ దుస్తుల్లో తనను తాను
చూసుకుని మురిసిపోతుంది ఆమె. ఆశ టీం ఆటలో ఓడిపోతుంది. అయినా ఆమె మాత్రం అమాయకంగా
తాను ఆ స్పొర్ట్స్ డ్రస్ ఉంచుకోవచ్చా అని అడగటం ఆమె ఊహల లోకాన్ని,అమాయకత్వాన్ని సూచిస్తుంది.
ఈ
లఘు చిత్రంలో స్పోర్ట్స్ మాస్టర్ ఆశను.’వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ ఎందుకు చివరలో ఉంటుంది?’ అని మొదట్లో అడుగుతాడు. దానికి సమాధానం,’ కొందరు
వార్తా పత్రికను చివరి నుండి చదవడం ప్రారంభిస్తారు కనుక అది అక్కడ ఉంటుంది’ అని సమాధానం చెప్తాడు. జీవితంలో బాల్యంలో ఊహలు,ఆశల
వలయంలో జీవితాన్ని ఆఖరి అనుభూతుల సంద్రంగా చిత్రించే మనసును ఈ లఘు చిత్రంలో
అస్పష్టంగా చిత్రించడం జరిగింది.
బాల్యంలో
పిల్లల ఊహలు,ఆశలు,గాలిలో మేడలు ఎలా ఉంటాయో
స్పష్టం చేసే లఘు చిత్రం ఇది.
* * *

Comments
Post a Comment