బ్లూ హెల్మెట్

 లఘు చిత్ర లోకం

బ్లూ  హెల్మెట్

                                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          చెప్పాలనుకున్న అంశాన్ని అతి తక్కువ సమయంలో, ఓ పద్ధతిని ఎన్నుకుని చెప్పాలి లఘు చిత్రాలలో. ఈ సమయ పరిమితే లఘు చిత్ర విశిష్టతను స్పష్టం చేస్తుంది. రోడ్ యాక్సిడెంట్ల వల్ల మరణించే వారి సంఖ్య భారత దేశంలో అధికమవుతున్న క్రమంలో ఈ అంశం పట్ల అవగాహన కల్పించడానికి హిందీలో వచ్చిన లఘు చిత్రమే బ్లూ హెల్మెట్.దాదాపు పది నిమిషాల ఈ లఘు చిత్రంలో మాటలు ఉండవు.

          ఓ మధ్య వయసు స్త్రీ ప్రధాన పాత్రగా ఈ లఘు చిత్రం నడుస్తుంది. ఆమె ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు తినేటప్పుడు,తాగేటప్పుడు తప్ప ప్రతి సారి ఓ హెల్మెట్ ను ధరిస్తుంది. ఆమె పరధ్యానంతో అన్నిటికీ తగలుతూ ఉండటం వల్ల ఆమె దానిని పెట్టుకుంటుందని మనకు అనిపిస్తుంది. ఆమె మార్కెట్ కు వెళ్ళేటప్పుడు కూడా రోడ్ మీద నడుస్తూ,ఆటోలో ఉన్నప్పుడూ కూడా ఆమె ఆ హెల్మెట్ ను ధరిస్తుంది. ఆమెను చూసి ఎందరు నవ్వినా ఆమె పట్టించుకోదు.

          ఆమె కొడుకు మరణించడం,ఆమె కొడుకు స్మృతిగా ఆమె ఆ హెల్మెట్ ను ధరిస్తూ ఉంటుందని మనకు తర్వాత స్పష్టం అవుతుంది. ఓ తల్లికి,బిడ్డ మీద ఉండే ప్రేమను చూపుతూనే, హెల్మెట్ లేకుండా బండ్లను నడపడం వల్ల జరిగే ప్రమాదాల మీద కూడా అవగాహన కల్పించడం అన్నది ఈ దర్శకుని ఉద్దేశ్యంగా మనకు అర్ధమవుతుంది.

          ప్రమాదాల్లో మరణించే వారి కుటుంబాలు ఎంతటి బాధను అనుభవిస్తాయో స్పష్టం చేస్తూ, చివరిలో దానిని ముగింపుగా చేయడం ఈ లఘు చిత్రం బావుంది అనిపించేలా చేస్తుంది.

 *   *   * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ