అహల్య
లఘు చిత్ర లోకం
అహల్య
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
భారతీయ
షార్ట్ ఫిల్మ్ లలో టాప్ పదిలో ఉండే వాటిల్లో బెంగాలీ ఫిల్మ్ 'అహల్య'
కూడా ఒకటి.సస్పెన్స్ థిల్లర్ ను,పురాణాలను
కొత్తగా చెప్పే కథ ఇది.రాధికా ఆప్టే ప్రధాన పాత్రగా నటించిన ఇది తప్పకుండా
చూడాల్సిన లఘు చిత్రం.
అర్జున్ సాధు ఓ గొప్ప ఆర్టిస్ట్.మోడల్స్ బొమ్మలు చేస్తూ ఉంటాడు.అతన్ని
కలవడానికి పోలీస్ ఇనస్పెక్టర్ ఇంద్రసేన్ వస్తాడు.అర్జున్ సాధు వృద్ధుడు.అతని భార్య
అహల్య మాత్రం యువతి.అందగత్తె.అతను అక్కడకు రాగానే ఓ బొమ్మ కింద పడుతుంది.దానిని
అర్జున్ అనే మోడల్ గా గుర్తిస్తాడు ఇంద్రసేన్.అర్జున్ నెల నుండి మిస్సింగ్ అని
చెప్తాడు.దానికి అర్జున్ సాధు అతను నెల క్రితం తన దగ్గరకు మోడల్ గా వచ్చాడని,ఇలాంది
ఏదో జరుగుతుందన్న అనుమానం తనకు అప్పుడే కలిగిందని చెప్తాడు.దానికి కారణం అడిగితే
అది చెప్తే ఇంద్రసేన్ నమ్మడని సమాధానం ఇస్తాడు.చెప్పమని మళ్ళీ అడుగగా అప్పుడు
చెప్తాడు.
అప్పుడు
అక్కడ ఉన్న రాయిని చూపిస్తూ,ఆ రాయి ద్వారా ఏ రూపంలోకి కోరుకుంటే ఆ
రూపంలోకి మారవచ్చని చెప్తాడు.అర్జున్ అలా మారి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం
చేస్తాడు.దానిని ఇంద్రసేన్ నమ్మడు.ఇంతలో అహల్య ఫోన్ అక్కడ మరచిపోవడం వల్ల ఆ ఫోన్
అక్కడే రింగ్ అవుతూ ఉంటుంది.ఆ రాయిని తీసుకుని తనలా మారాలనుకుని ఆమె దగ్గరకు ఫోన్
తీసుకువెళ్ళమంటాడు సాధు.అలానే వెళ్తాడు ఇంద్రసేన్.అతను అక్కడికి వెళ్ళగానే అద్దంలో
అతనికి తన ప్రతిబింబం బదులు సాధుది కనిపిస్తుంది.
అక్కడ
అహల్య కూడా అతన్ని సాధుగానే భావిస్తుంది.ఆమె మాయలో పడి ఆమెతో గడుపుదామని అక్కడే
ఉంటాడు.అతను కళ్ళు తెరచేసరికి అతను బంధించబడి ఉంటాడు.అతనికి తన ఎదురుగా జరిగేది
కనిపిస్తూనే ఉంటుంది.ఎవరో ఇంట్లోకి రావడం,అతనతో తనతో సంభాషించినట్లే
సంబాషించడం,అదే సమయంలో తాను అరవడం,బొమ్మ
రూపంలో బంధించబడిన తను కిందపడటం అతనికి అర్థమవుతుంది.అతనికి అప్పుడు అర్జున్ ఎలా
మాయమయ్యాడో అర్థమవుతుంది.
ఈ
లఘు చిత్రాన్ని ఓ వినూత్న కోణంలో తీసుకురావడం వల్ల ఈ చిత్రం ఆదరణ పొందింది. నాడు
అహల్య శాపం వల్ల శిలలా అయితే,అదే అహల్య పురుషులను ఎలా శిలలను
చేసిందో అన్నది ఇతిహాసానికి ఇంకో కోణం. ఈ కోణంలో ఈ లఘు చిత్రాన్ని ఆవిష్కరించే
ప్రయత్నం దర్శకుడు చేశారనే విషయం మనకు శీర్షికతో స్పష్టం అవుతుంది.
*
* *

Comments
Post a Comment