బ్లౌజ్
లఘు చిత్ర లోకం
బ్లౌజ్
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
లఘు చిత్రాల్లో ఎన్నో వినూత్న
ఆలోచనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వినూత్న ఆలోచనతో నిర్మించిన ఓ హాస్య లఘు
చిత్రమే ‘బ్లౌజ్.’ స్కూల్ టీచర్ శ్యామ్. అతని భార్య రూప.
స్కూల్ వేరే ఊరిలో ఉండటం వల్ల అక్కడికి ఉంటూ మధ్యలో సెలవుల్లో ఇంటికి వస్తూ ఉంటాడు
శ్యామ్. అతని భార్య రూప.
భర్తల క్షేమం కోసం భార్యలు చేసే ఉత్సవమే
కర్వా చౌత్. దానికి తను తర్వాతి నెలలో చేస్తున్నానని,
దానికి బహుమానంగా శ్యామ్ వెళ్ళే ఊరిలో ప్రసిద్ధి పొందిన దర్జీ అయిన బాబు దగ్గర
తనకు బ్లౌజ్ కుట్టించుకు రమ్మని అడుగుతుంది రూప. భర్త బయలుదేరేటప్పుడు ఆది బ్లౌజ్
కూడా ఇస్తుంది.
శ్యామ్ ఆ ఊరికి వెళ్ళాక చూసుకుంటే ఆ ఆది
బ్లౌజ్ కనిపించదు. బ్లౌజ్ బాబు దగ్గర కుట్టించకుండా తీసుకువెళ్తే భార్య
బాధపడుతుందని ఏదైనా ఉపాయం ఉందేమోనని ఆలోచిస్తున్న సమయంలో శ్యామ్ కు బాబు ఓ ఉపాయం
సూచిస్తాడు.
ఆ ఊరిలోని స్త్రీలు అందరూ బాబు దగ్గరే బ్లౌజులు
కుట్టించుకుంటారు. ఆ షాపు దగ్గర కూర్చుని ఎవరైనా స్త్రీ అతని భార్య బట్టల కొలతలకు
దగ్గరగా ఉంటే చెప్తే తాను కుడతానని చెప్తాడు బాబు. అతని షాపు దగ్గరకు వచ్చే వారిలో
ఎవరు తన భార్యకు దగ్గరగా లేరని చెప్పడంతో, బాబు అతన్ని ఆ ఊరిలో ఏ
స్త్రీ అయినా అలా ఉందేమో చూడామని సలహా ఇస్తాడు.
బాబు అలా వెతుకుతున్న సమయంలో అతనికి ఓ
స్త్రీ అలానే అనిపించడంతో ఆమెను మూడు రోజులు చూసే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. ఆమె
ఇల్లు కనుక్కోవడంతో బాబుకు చెప్పడంతో ఆమె తన భార్యేనని బాబు చెప్తాడు. ఆ రోజు
రాత్రి వచ్చి తమ కిటికీ గుండా ఆమెను చూడమని చెప్తాడు బాబు. దానికి సరే అని ఆ రోజు
వెళ్ళినా కరెంట్ పోవడంతో చూడలేకపోతాడు. తర్వాతి రోజు చూస్తుండగా ఆమెకు
పట్టుబడతాడు. ఆమె అతన్ని తిడుతుంది. బాబు జరిగింది చెప్పడంతో అతనికి భార్య మీద
ఉన్న ప్రేమను అర్ధం చేసుకుంటుంది.
అలా మొత్తానికి భార్యకు బ్లౌజ్ కుట్టించి
ఇంటికి కర్వా చౌత్ రోజు భార్యకు ఇస్తాడు. అంత కష్టపడి తీసుకువచ్చాక భార్య
సంతోషించకపోగా, ఆది బ్లౌజు ఇంట్లో మర్చిపోయిన అతను ఎవరి కొలతలతో దానిని
కుట్టించాడని అపార్ధం చేసుకోవడంతో ఈ లఘు చిత్రం ముగుస్తుంది.
భార్యను అమితంగా ప్రేమించే భర్త తన భార్య
సంతోషం కోసం ఏమైనా చేస్తాడనే అంశం స్పష్టం చేసే
హిందీ లఘు చిత్రం ఇది.
* * *

Comments
Post a Comment