ఆమె ఓ చరిత్ర!
సినీ సంచారం
ఆమె ఓ చరిత్ర!
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
కొందరు తమ
పరిస్థితులు ఏవైనా సరే, తమ లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన
విజ్ఞానం లేకపోయినా తమ దృఢ సంకల్పంతో,పట్టుదలతో వాటిని
సంపాదించుకుని మరి విజయాన్ని సాధించి చరిత్రలో తమ ముద్రను గాఢంగా వేస్తారు.అటువంటి
వారిలో ఒకరు ఎరిన్ బ్రోకోవిచ్. ఒక మామూలు లా కంపెనీలో క్లర్కుగా పనిచేస్తున్న ఆమె పసిఫిక్
గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీతో తలపడి విజయాన్ని సాధించి ఎందరికో ఆదర్శంగా
నిలిచింది.ఆమె జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగానే 2000లో ‘ఎరిన్
బ్రోకోవిచ్’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఎరిన్ బ్రోకోవిచ్
గా నటించిన జూలియా రాబర్ట్స్ ఆస్కార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా దర్శకులు స్టీవెన్ సోడర్ బర్గ్ ఇదే సమయంలో తన ఇంకో సినిమా
అయిన ‘ట్రాఫిక్ ‘కు ఆస్కార్
దక్కించుకున్నారు.
1999
లో ఎరిన్ బ్రోకోవిచ్ ఓ నిరుద్యోగి,ముగ్గురు పిల్లల తల్లి.
సింగిల్ పేరెంట్ కూడా. ఓ రోజు ఆమెకు జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కు కారకుడైన ఓ
డాక్టర్ మీద ఆమె తన లాయర్ ఎడ్ మాస్రి
సాయంతో కేసు వేస్తుంది. ఆ కేసులో గెలిచే అవకాశాలు ఎంతమేరకు ఉన్నప్పటికీ,ఎరిన్ దురుసు ప్రవర్తన వల్ల ఆ కేసు ఓడిపోతుంది. ఆ తర్వాత తనను గెలిపించలేకపోయిన ఆ లాయర్ కు ఎన్నో సార్లు
ఫోన్ చేస్తుంది. అతను ఆ కాల్స్ అటెండ్ చేయడు.
ఆ
తర్వాత ఎడ్ ఆఫీసుకు వెళ్తుంది. తనకు ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలని
పట్టుపట్టి అతనికి ఇష్టం లేకపోయినా ఓ క్లర్కుగా ఉద్యోగం సాధిస్తుంది. పసిఫిక్
గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీ వారు కాలిఫోర్నియాలోని హింక్లి ప్రాంతంలో డోనా జాన్సేన్ ఇంటిని కొనుక్కోవాలి అనుకుంటున్న
ఓ రియల్ ఎస్టేట్ కేసు ఎరిన్ కు అప్పగించబడుతుంది.డోనా మెడికల్ రికార్డు చూసి
ఆశ్చర్యపోతుంది ఎరిన్.ఆమె ఇంటికి వెళ్తుంది.
తనకు
ట్యూమర్స్ ఉన్నాయని,తన భర్తకు లింఫోమా ఉందని తమకు పసిఫిక్
గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీ వారు ఎంతో వైద్య సాయం చేస్తున్నారని డోనా
చెప్తుంది. వారు ఎందుకు అలా ఉదారంగా సాయం చేస్తారని ఎరిన్ ప్రశ్నిస్తే దానికి కారణం
ఆ ప్రాంతంలో ఉన్న క్రోమియం అని సమాధానం చెప్తుంది డోనా.
ఎరిన్
ఈ అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభిస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ ప్రాంతంలోని
అండర్ గ్రౌండ్ వాటర్ అంతా క్రోమియం వల్ల కలుషితమయ్యిందని ఆమెకు అర్ధమవుతుంది.ఆమె
తిరిగి ఆఫీసుకు వచ్చేసరికి ఆమె గత వారమంతా ఆఫీసుకు రాకపోయేసరికి ఆమెను సస్పెండ్
చేస్తారు. ఉద్యోగం పోయిన కొన్నాళ్ళకి ఎరిన్ దగ్గరకు ఎడ్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్
ఫైల్స్ కోసం వచ్చిన సమయంలో ఆమె మళ్ళీ ఉద్యోగం గురించి అడగటం,అతను
ఒప్పుకోవడం,మళ్ళీ ఆఫీసులో చేరడం జరిగిపోతుంది.
మళ్ళీ
ఉద్యోగంలో చేరాక కూడా ఆమె అదే కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కొనసాగిస్తుంది. ఆ
ఇన్వెస్టిగేషన్ లోనే ఆమెకు ఆ ప్రాంతంలోని అందరికీ అనేక రోగాలు వస్తూ ఉండటం,దానికి ఆ కంపెనీ
వైద్యులే వైద్యం చేయడం వెనుక ఉన్న కుట్ర అర్ధమవుతుంది. ఆ క్రోమియం సురక్షితమైనది
కాదని,అది ప్రమాదకరమైన క్రోమియం హెక్సావ్యాలెంట్ అని ఆమెకు
స్పష్టమవుతుంది. ఈ విషయం ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ చెప్పి అందరినీ ఈ అన్యాయానికి
వ్యతిరేకంగా పోరాడటానికి ఆమె సమీకరిస్తుంది.
కానీ
పసిఫిక్ హెడ్ క్వార్టర్స్ తమకు ఆ విషయం తెలియదని,దాని గురించి కేవలం
సంబంధిత బ్రాంచ్ కు మాత్రమే తెలుసు అని చెప్పడంతో,అది ఎన్నో
ఏళ్ళు లాగబడే కేసులా మిగిలిపోయే పరిస్తితి వస్తుంది. అదే సమయంలో ఆమెను ఆ కంపెనీలో
పని చేసే చార్లెస్ అనే అతను ఆ కంపెనీ ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఆ బ్రాంచ్ కు
ఆర్డర్స్ ఇచ్చిందని,ఆ డాక్యుమెంట్స్ నాశనం చేయమని కూడా
ఆదేశించిందని,అది తాను చేయలేదని, తన
సోదరుడు కూడా ఆ క్రోమియంకే బలి అవ్వడం వల్ల తాను సహకరిస్తున్నట్టు ఆమెకు చెప్పి ఆ
డాక్యుమెంట్స్ ఇస్తాడు. వాటి సాయంతో చట్ట పరంగా నష్టపరిహారంగా 333 మిలియన్ డాలర్లు
ఆ ప్రాంతావసులకు వచ్చేలా చేస్తుంది ఎరిన్. ఈ కేసు విజయంతో ఎరిన్ జీవితం
మారిపోతుంది.
ఈ
సినిమాలో ఎరిన్ గా జూలియా రాబర్ట్స్ నటన అద్భుతంగా ఉంటుంది. దేన్ని లెక్కచేయని
ధైర్యం,ఏ పరిస్థితినైనా ఎదిరించగల మనోస్థైర్యం ఎరిన్ బ్రోకోవిచ్ నిజ జీవితంలో
లక్షణాలు అయినప్పటికీ వాటిని జూలియా రాబర్ట్స్ తన నటన ద్వారా స్పష్టం చేసిన తీరు
మాత్రం ఈ సినిమాను కచ్చితంగా చూసేలా చేస్తుంది.
గొప్ప
వారి జీవితాలు,పరిస్థితులు సాధారణమైనవే,కానీ వారి
స్పందన ఎలా అసాధారణంగా ఉంటుందో స్పష్టం చేసే జీవనచిత్రం ఇది.
* * *

Comments
Post a Comment