ఆశలు-జీవితాలు
ఆశలు-జీవితాలు
-శృంగవరపు రచన
థ్రిల్లర్ సినిమాల్లో మోటివ్ తో ప్లాన్ ప్రకారం చేయడం, యాక్సిడెంటల్ గా జరిగిపోవడం అనే రెండు రకాలుగా ఉంటాయి.యాక్సిడెంటల్ గా జరిగే కథలు కలిగించే అనుభూతికి, ప్లాన్ చేసే వాటిని కథలుగా చూసినప్పుడు కలిగే అనుభూతికి తేడా ఉంటుంది.ఆ తెలియనితనంలో చేసిన హత్యకు ఇంకా బలమైన అంశాలు జోడిస్తేనే యాకైడెంటల్ థ్రిల్లర్స్ ఆ ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించగలుగుతాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే 2019లో వచ్చిన 'Blow the man down.'
మయానే లోని ఓ ఫిషింగ్ టౌన్ లో ప్రిస్కిల్లా, మేరీ బెత్ అనే అక్కాచెల్లెల్లు ఉంటారు. వారి తల్లి మరణించాక జరిగే కార్యంకు అందరూ రావడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆ కుటుంబానికి ఓ చేపల కొట్టు ఉన్నప్పటికి తల్లి చేసిన అప్పుల వల్ల ఇల్లు పోయే పరిస్థితి ఉందని మేరీ బెత్ కు అప్పుడే తెలుస్తుంది. కోపంగా బార్ కు వెళ్తుంది.అక్కడ గొర్స్కి ను కలుస్తుంది. అతనితో కలిసి వెళ్తుంది. ఆ సమయంలోనే అతను చనువు తీసుకోబోతున్న సమయంలో ఆ కారు నుండి దిగుతుంది. ఆ కారు వెనక డిక్కీలో రక్తం, జుట్టు ఉంటుంది.ఆ తరువాత అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని హత్య చేస్తుంది. ఇక్కడే సినిమాలో మనకు జరిగిన రెండో హత్య ఆ కారులో ఉన్న రక్తం, జుట్టు ద్వారా దర్శకుడు స్పష్టం చేస్తాడు పరోక్షంగా. ఇంటికి వచ్చిన మేరీ బెత్ జరిగింది అక్కకు చెప్తుంది. ప్రిస్కిల్లా ఆ శవాన్ని చెల్లెలి సాయంతో ఓ కూలర్ బాక్స్ లో అతని చేతులు పట్టకపోతే కత్తితో కట్ చేసి ఆ బాక్స్ లో పెట్టి సముద్రంలో పడేస్తుంది.
పైన చెప్పింది ఓ కథ. ఇంకా సినిమాలోని ఇంకో కథ ప్రిస్కిల్లా తల్లి, ఆమె స్నేహితురాళ్లకు సంబంధించినది.డోరిన్, సూసి, గ్యాలీ, ఎనిడ్ ప్రిస్కిల్లా తల్లి స్నేహితురాళ్లు. జాలరులు బాగా ఉండే ఆ ప్రాంతంలో 'ఓషన్ వ్యూ' పేరుతో ఎనిడ్ ఓ వేశ్య గృహాన్ని ప్రారంభిస్తుంది. దీనిని మొదట్లో ఆమె స్నేహితురాళ్లు ప్రోత్సహించినా తరువాత దానిని తప్పుగా భావించి ఎనిడ్ కు కూడా వారు దూరమైపోతారు.ఎనిడ్ ప్రస్తుతం కూడా ఆ గృహాన్ని నడుపుతూ ఉంటుంది. ఆమె దగ్గర పని చేసిన వ్యక్తే గొర్స్కి.
ఓ రోజు పోలీసులకు సముద్రంలో డి అనే అమ్మాయి శవం దొరుకుతుంది. ఆమె ఎనిడ్ దగ్గర ఉండే అమ్మాయి. ఆమెకు చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఎనిడ్. అందుకే గొర్స్ కి ద్వారా ఆమె డి ని హత్య చేయించింది అన్న విషయం ప్రేక్షకులకు ఎనిడ్ స్నేహితురాళ్ళ సంభాషణలు, ఆ కారులో రక్తం ఆనవాళ్ళ ద్వారా స్పష్టం అవుతుంది.
అదే సమయంలో ప్రిస్కిల్లా కు తాము ఆ శవం చేతులు నరికిన కత్తి అక్కడే మర్చిపోయినట్టు గుర్తుకు వచ్చి గొర్స్కి క్యాబినెట్ కు చెల్లెలును పంపిస్తుంది. అక్కడ డబ్బు చుసిన మేరీ బెత్ కత్తి విషయం పక్కన పెట్టి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తుంది. తర్వాత అక్కడికి వచ్చిన ఎనిడ్ ఆ కత్తిని తీసుకువెళ్ళి జరిగిన విషయం అర్ధం చేసుకుని, వారు డబ్బు తిరిగి ఇస్తే ఆ కత్తి ఇస్తానని చెప్తుంది.ఆ డబ్బు ఇచ్చాక ఆ డబ్బు ఉంచుకుని తన దగ్గర చేరమని అడుగుతుంది. దానికి వారు నిరాకరించి ఆ కత్తి తీసుకుని డబ్బు ఇచ్చి వెళ్ళిపోతారు.ఆ తర్వాత డి స్నేహితురాలు మరియు ఎనిడ్ దగ్గర ఉండే ఇంకో అమ్మాయి అయిన అలెక్స్ ఎనిడ్ ను హత్య చేసి అక్కడి నుండి ఆ డబ్బుతో వెళ్ళిపోతుంది.
పోలీసులకు మేరీ బెత్ ఆ రాత్రి గొర్స్కి తో వెళ్లిందని తెలిసినా సాక్ష్యాలు లేకపోవడం వల్ల అనుమానం ఉన్నా ఏం చేయలేకపోతారు. ఆ తర్వాత ఆ కూలర్ నుండి బయటకు వచ్చిన రక్తన్ని సూసి కడిగేస్తుంది. దానిని బట్టి వారికి తెలిసిన ఆ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉన్నారని ప్రేక్షకులకు అర్ధమవుతుంది.
వాతావరణం-కథ సామాన్యంగా ఉంటూనే అక్కడి జీవితాలను, జీవన విధానాలను చూపిస్తూనే థ్రిల్ ఉండేలా సినిమాను రూపొందించడం కష్టమే అయినా దర్శకుడు ఈ సినిమాను ఓ మేరకు బాగా తీసాడనే అనుకోవచ్చు.
* * * *
Comments
Post a Comment