ఆమె తప్పిపోయింది!
ఆమె తప్పిపోయింది!
-శృంగవరపు రచన
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో డేవిడ్ ఫించర్ శైలే వేరు.'సెవన్','ద గర్ల్ విత్ ద డ్రాగన్ ట్యాటు' ఏ సినిమా గమనించినా స్లో స్టోరీ లైన్ ను కొంచెం కొంచెంగా వేగం పెంచుతూ కథలో మనుషుల నేర ప్రవృత్తి మోటివులను విభిన్నంగా ఉండేలా చూసుకుంటూ, అందుకు అనుకూలంగా ఉండే నవలలను లేదా కథలను మాత్రమే ఎన్నుకుని తీసే దర్శకుల్లో ఫించర్ విశిష్ట వ్యక్తి.'గాన్ గర్ల్' సినిమా ఇందుకు ఓ ఉదాహరణ.
యాని ఓ ప్రసిద్ధ రచయిత్రి. ఆమె భర్త నిక్.వారిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఆమె కనిపించకుండా పోతుంది.ఆ ఇంట్లో పగిలిన బల్ల, కిచెన్ లో రక్తపు మరకలు ఉంటాయి. ఏం జరిగిందో అర్ధం కానీ నిక్ పోలీసులకు తెలియజేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలోనే నిక్, యాని జీవితాలను మనకు దర్శకుడు పరిచయం చేస్తాడు.
యాని ఓ కాలేజ్ లో క్రియేటివ్ రైటింగ్ టీచర్ గా పని చేసేవాడు. తన స్టూడెంట్ తో సంబంధం పెట్టుకుంటాడు. యాని డబ్బుతోనే బార్ పెడతాడు. మధ్యలో ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. కథలో ముందు ఫస్ట్ హాఫ్ అంతా మనకు నిక్ గురించే చూపిస్తారు. నిక్ మీద అనుమానం వచ్చేలా యాని వదిలిన డైరీ, కొన్ని క్లూస్ పోలీసుల కంటబడతాయి. డైరీలో నిక్ తనను చంపదల్చుకున్నాడని యాని రాయడంతో నిక్ మీద అనుమానం పెరుగుతుంది. ఇది నిక్ వైపు చూపించే కథ.దీనితో పాటు అతను సంబంధం పెట్టుకున్న అమ్మాయి కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తుంది.
తన డబ్బుతో వ్యాపారం పెట్టడం, ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం నచ్చని యాని అతన్ని తన హత్య కేసులో ఇరికించడానికే ఆధారాలు ఉండేలా వదిలి వెళ్ళిపోతుంది. యానికి గతంలో రెండు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి. అందులో ఒకతన్ని ఆమె రెచ్చగొట్టి శారీరక సంబంధాన్ని కలిగి ఉండి, రేప్ &అసాల్ట్ కేసు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. రెండో అతన్ని (దేశి కోలింగ్స్)తన వివాహమయ్యాక కూడా ప్రోత్సహిస్తూ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఎవరికి కనబడని చోటులో కేవలం డబ్బు వాడుతూ గడుపుతూ ఉన్న సమయంలో ఆమె పక్కింటిలో ఉన్న జంట ఆమె దగ్గర ఉన్న డబ్బును దోచుకుంటారు.డబ్బు లేని సమయంలో మరలా దేశి కోలింగ్స్ ను వాడుకుంటుంది. అతనితో శారీరకంగా దగ్గర అయ్యి అతన్ని హత్య చేస్తుంది.ఆ హత్య తరువాత మళ్ళీ నిక్ దగ్గరకు తిరిగి వస్తుంది. తనను కొల్లింగ్స్ కిడ్నాప్ చేసి రేప్ చేసాడని ఆరోపిస్తుంది. నిక్ అంతకు ముందు ఫర్టీలిటి క్లినిక్ కు ఇచ్చిన స్పెర్మ్ ద్వారా గర్భవతి అవుతుంది. యాని నుండి విడిపోదామనుకున్న నిక్ విడిపోకుండా అన్ని ఉచ్చులు వేస్తుంది యాని.
తన హత్యలో భర్తను ఇరికించడానికి ఆ వీధిలో ఉండే ఓ గర్భిణి స్త్రీతో స్నేహం పెంచుకుని, తన భర్త తనను ఎలా హింసిస్తాడో చెప్పి, ఆమె యూరిన్ శ్యాంపిల్ ను తన శ్యాంపిల్ గా ఉంచి తాను మరణించేనాటికి తాను గర్భవతి అని, నిక్ కు గర్భం ఇష్టం లేదని నమ్మిస్తుంది. తాను తిరిగి వచ్చినా తన మీద సానుభూతి ఉండేలా చూసుకుంది.
యాని పాత్ర చిత్రణ తెలివైన నేరస్థునికి దగ్గరగా ఉంటుంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు అస్సలు మిస్ అవ్వకూడని సినిమా ఇది.
* * *
Comments
Post a Comment