హీరోయిజం జన్మించేది ఇక్కడే!

 హీరోయిజం జన్మించేది ఇక్కడే!

-శృంగవరపు రచన


మనుషులకు, మనుషులకు మధ్య ఉండే దూరానికి కారణానికి మూలాలు ఆలోచిస్తే అవి వారి జీవన శైలుల్లో ఉండే వ్యత్యాసం మొదలుకుని, తమకున్న బలాన్ని నిరూపించుకునే ప్రక్రియతో పయనిస్తూ నిరంతరం ఘర్షణతో తరాలకు అది వారసత్వంగా కొత్త రంగులను సంతరించుకుంటుంది.అవే యుద్ధాలు అవుతాయి.కానసంట్రెషన్ క్యాంప్స్ ను మొదట స్పానిష్ వారు ప్రవేశపెట్టినా, దానిని అమలు చేసింది మాత్రం హిట్లర్.1933-45 మధ్య కాలంలో వెయ్యికి పైగా క్యాంప్స్ నిర్వహించి, కొన్ని కోట్ల మంది ప్రాణాలు బలిగొన్న రక్తపు మరకలున్న చరిత్ర ఈ క్యాంప్స్ కు ఉంది. మొదట కమ్యూనిస్టులను, తర్వాత నేరస్థులను, ఆ తరువాత యూధులను ఎవరైనా తన అభిప్రాయలతో విభేధించేవారిని, సహజంగా నచ్చనివారిని ఎవరినైనా క్రూరంగా హింసించి, చంపే ప్రక్రియ ఇది.
యూధులను ముఖ్యంగా ఏదైనా పని చేయగలిగిన వారి చేత పనులు చేయించుకుని, ఆ ప్రాంతపు యుధుల సంపదను దోచుకున్నాక వారిని నిర్దాక్షణ్యంగా గ్యాస్ తో చంపడం, వారిని తమ వినోదం కోసం నానా హింసలు పెట్టడం, ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేస్తే మిగిలిన యోధులలో కొందరిని చంపడం వంటివి ఆ సమయంలో సహజంగా మారిపోయాయి.
జర్మనీ యూరప్ దేశాలను ఆక్రమిస్తూ క్యాంప్స్ ను నిర్వహిస్తున్న సమయంలో పోలాండ్ లో సాబిబర్ లో ఓ క్యాంపును నిర్వహించింది.ఆ క్యాంపులోని కొందరు ఆ జర్మనీ ఆఫీసర్లను హతమార్చి కొందరిని కాపాడగలగడం ఆ కొందరి హీరోయిజం.400 మందిలో 100 మంది ఆ ప్రయత్నంలో మరణిస్తే, ఇంకో 150 మందిని అక్కడి వారు మరలా పట్టించగా, మొత్తం మీద ఇంకో 150 మంది మాత్రం తప్పించుకోగలిగారు.
ఆయుధ బలం, అధికార బలం అన్ని ఉన్న ప్రత్యర్థులైనా వారితో వారి బందీలుగా ఉన్నవారు పోరాడి గెలవడటం బ్రతుకు కోసం చేసిన హీరోయిజం.దానికి బ్రతకాలి అన్న కోరిక బలంగా ఉండటమే కారణం. ఈ ఉదంతాన్ని ఆధారంగా తీసిన సినిమానే 'సాబిబర్.' హింసలో ఉండే రకాలు, హింసించడంలో ఇగోలు తృప్తిపడటాలు ఈ సినిమాలో స్పష్టమవుతాయి. మనుషుల్లో ప్రతికార మూలాలు కూడా ఇందులో కనిపిస్తాయి.
* * *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ