ఆల్కహాల్ మంచిదే!

 ఆల్కహాల్ మంచిదే!

-శృంగవరపు రచన
(Another Round సినీ సమీక్ష)



సినిమాల్లో వైవిద్య అంశాలు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ సేవించడం నేడు సాధారణ అంశంగా మారిపోయింది. ప్రతి మనిషి 0.05% ఆల్కహాల్ సేవించడం ఆ మనిషి పని చేసే తీరును ఎంత గానో సానుకూలంగా ప్రభావితం చేస్తుందని ఫిన్ స్కార్ డేరూడ్ అనే సైకో థెరపిస్ట్, సైకీయాట్రిస్ట్ స్పష్టం చేసాడు. దీని మీద ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఈ అంశాన్ని కేంద్రంగా తీసుకుని తీసిన స్వీడన్ సినిమానే 'Another Round.'
ఓ నలుగురు స్నేహితులు హై స్కూల్ లో టీచర్స్ గా పని చేస్తుంటారు. మార్టిన్ హిస్టరీ టీచర్, టామ్ స్పోర్ట్స్ టీచర్, పీటర్ ఇంగ్లిష్ టీచర్, ఇంకో మిత్రుడు నికోలేజ్. అప్పటికే మార్టిన్ సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని ఫిర్యాదులు వస్తుంటాయి. ఆ నలుగురు మిత్రుల జీవితం నిస్సారంగా ఉంటుంది.నికోలేజ్ 40 వ పుట్టినరోజు సందర్బంగా కలిసిన ఈ మిత్రులు ఈ ఆల్కహాల్ ప్రయోగం చేద్దామని నిర్ణయించుకుని, రోజు స్కూల్ లో తాగి పాఠాలు చెప్తుంటారు. ఇది వారు పాఠాలు చెప్పే విధానాన్ని ఎంతో మెరుగుపడేలా చేస్తుంది. మార్టిన్ వ్యక్తిగత జీవితంలో భార్యా పిల్లలతో ఉన్న నిరాశక్తత కూడా దీని వల్ల దూరమై వారి వైవాహిక జీవితం కూడా మెరుగు అవుతుంది.
ఆ తర్వాత ఆ మోతాదును పెంచి అందరూ తాగుతారు. దాని వల్ల మార్టిన్ వ్యక్తిగత జీవితం దెబ్బ తిని అతని భార్య అనైక, పిల్లలు అతనికి దూరమవుతారు. ఆ తర్వాత టామ్ తాగి స్కూల్ లో దొరికిపోతాడు.దానితో అతని ఉద్యోగం పోతుంది. పీటర్ ఓ విద్యార్థికి పరీక్ష ముందు కాస్త తాగించి అతను మెరుగుగా సమాధానాలు ఇవ్వడం గమనిస్తాడు. టామ్ తన కుక్కతో కలిసి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి మరణిస్తాడు.మార్టిన్ భార్యాపిల్లలు మళ్ళీ దగ్గరవుతారు. ఆ స్కూల్ పిల్లలు ఫెర్వెల్ ఇవ్వడం, అందరూ సంతోషంగా ఉండటంతో సినిమా ముగుస్తుంది.
ఏదైనా మోతాదును మించి తీసుకుంటే అది మనుషుల జీవితాన్ని ఎలా తనకు బానిసగా మార్చుకుంటుందో స్పష్టం చేసే సినిమా ఇది. బ్లాక్ కామెడీ సినిమాగా మలచిన ఈ సినిమా స్లోగా నడుస్తుంది. కానీ వినూత్నమైన ఆలోచనతో సైన్స్ -కామెడీ -సైకాలజీ కలిపిన సినిమా కనుక చూడవచ్చు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ