మనకు తెలియని మనవాళ్ళు

మనకు తెలియని మనవాళ్ళు
-శృంగవరపు రచన





భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ఇలా జీవితంలో సన్నిహితులైన వారి గురించి తెలుసనుకోవడం సహజం. కానీ మనకు తెలిసిన వారిలో తెలియని వారిని చూసే పరిస్థితులు ఎదురుకున్నాకే మనిషికి జీవితంలో ఏర్పడిన అగాధం స్పష్టమవుతుంది. తన కూతురు గురించి తెలుసనుకున్న తండ్రి, తన కొడుకునే కాపాడుకునే ప్రయత్నంలో తల్లి ఏం చేసారో స్పష్టం చేసే సినిమానే 'సెర్చింగ్.'
డేవిడ్ , పామ్ భార్యాభర్తలు. వారి కూతురు మార్గట్.ఈ సినిమా మొత్తం కంప్యూటర్ మరియు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారానే నడుస్తుంది. సినిమా ప్రారంభంలో డేవిడ్ తన కంప్యూటర్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు ద్వారా కూతురు, భార్యతో ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేస్తాడు. పామ్ మరణించిన విషయం కూడా అలానే ప్రేక్షకులకు తెలుస్తుంది. మార్గట్ హై స్కూల్ లో ఉంది.
ఓ రోజు రాత్రి తండ్రికి కాల్ చేస్తుంది మార్గట్. అర్ధరాత్రి నిద్రలో ఉండి ఆ కాల్స్ అటెండ్ చేయలేకపోతాడు డేవిడ్ . ఆ రోజు నుండి ఆమె మాయమైపోతుంది. ఆ కేసుకు డిటెక్టివ్ రోస్ మేరీ కి అప్పగించబడుతుంది. డేవిడ్ కూతురు ఫెస్ బుక్, టoబ్లర్ వంటివన్నీ చెక్ చేస్తాడు. ఆమె అంతకుముందు రోజు వెళ్లిన స్టడీ గ్రూప్ ను కనుక్కుంటాడు. మొత్తానికి ఆమె బార్బోసా లేక్ దగ్గరకు వెళ్తూ ఉందని ఆమె ఫోటోల ద్వారా తెలుసుకుంటాడు. కార్ లొకేషన్ ను అనుసరించి ఆమె అక్కడ చివరి సారి ఉందని తెలుసుకుని డిటెక్టివ్ కు తెలియజేస్తాడు. అక్కడకి వెళ్ళాక ఆ కారు తీయిస్తారు. ఆ కారులో మార్గట్ మాత్రం ఉండదు.
ఆ కార్లో 2500 డాలర్ల డబ్బు ఉంటుంది. అంతే కాకుండా అప్పటికే మార్గట్ వేరే పేరు మీద ఫోర్జెడ్ కార్ లైసెన్స్ తీసుకుందని చెప్తుంది రోజ్ మేరీ. అలాగే తన కూతురు పియానో క్లాసుకు వెళ్తున్నానని చెప్పి డబ్బు తీసుకున్నా ఆమె ఆ క్లాసులకు కూడా ఆరు నెలల నుండి వెళ్లడం లేదని తెలుస్తుంది. అలాగే తన తమ్ముడితో ఆమె సిగరెట్లు కాలుస్తుందని కూడా అప్పుడే డేవిడ్ కి తెలుస్తుంది.
ఆ ప్రాంతం అంతా వెతికిస్తారు. కానీ ఎక్కడ కూడా మార్గట్ జాడ ఉండదు. ఇది న్యూస్ లో కూడా సెన్సేషనల్ అవుతుంది. ఆ తరవాత జైలు నుండి విడుదల అయిన ఓ రేపిస్ట్ తానే మార్గట్ ను హత్య చేసానని కన్ఫెషన్ ఇచ్చి మరణించడంతో ఆమె మరణించిందని అందరూ నిర్దారిస్తారు.
అయితే డేవిడ్ మెమోరియల్ సర్వీస్ లో పెడుతూ ఉండగా అక్కడ ఉన్న ఫోటో తన కూతురు సోషల్ ననెట్ వ ర్కింగ్ సైట్ లో ఓ స్నేహితురాలు పిక్ గా ఉండటం చూస్తాడు. అంతకు ముందే రోజ్ మేరీ ఆమెను ఇన్వెస్టిగెట్ చేశానని చెప్తుంది. ఓ హోటల్ లో వెయిట్ రెస్ గా ఉన్న ఆమె ఇక్కడ మెమోరియల్ సర్వీస్ ఎలా నడుపుతుంది అన్న అనుమానం వచ్చిన డేవిడ్ కాల్ చేస్తే తాను వెయిట్ రెస్ కాదని, తనని ఎవరూ ఇన్వెస్టిగెట్ చేయలేదని స్పష్టం చేస్తుంది. అనుమానం వచ్చిన డేవిడ్ రోజ్ మేరీ కి ఫోన్ చేస్తే ఇంకో ఆఫీసర్ అటెండ్ చేస్తుంది.రోజ్ మేరీ తానే ఆ కేసు వాలంటీర్ గా చేసిందని చెప్పడంతో ఆమె ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు, కన్ఫెషన్ ఇచ్చిన వ్యక్తితో ఆమె ఫొటోలో ఉండటం గమనిస్తాడు డేవిడ్. వెంటనే పోలీసులకు తెలియజేస్తాడు.
అరెస్ట్ అయిన రోజ్ మేరీ అప్పుడు నిజం చెప్తుంది. తన కొడుకు రాబ్ ఓ రాత్రి ఫోన్ చేసి తాను ఓ అమ్మాయిని అనుకోకుండా ఓ లోయలోకి తోసేసానని చెప్పాడని తానే ఆ విషయం ఎవరికి చెప్పవద్దని అతనికి చెప్పానని చెప్తుంది. తన స్కూల్ లో చదువుతున్న మార్గట్ అంటే ఇష్టం ఉన్న రాబ్ ఆమెకు దగ్గర అవ్వడానికి వేరే పేరుతో వేరే పిక్ తో వెయిట్ రెస్ గా పరిచయం చేసుకుని, మార్గట్ తల్లి క్యాన్సర్ తో చనిపోవడం వల్ల తన తల్లికి క్యాన్సర్ ఉందని చెప్పి ఆమెకు దగ్గర అవుతాడు. ప్రశాంతత కోసం ఆమె బార్బోసా లేక్ దగ్గరకు వెళ్తుందని తెలుసుకుని ఆమెను వెంబడిస్తాడు.అప్పటికే 2500 డాలర్లు హాస్పటల్ ఖర్చులకు ఇవ్వడానికే డ్రా చేసింది మార్గట్. ఆమెను వెంబడించి, గొడవ అయ్యేసరికి ఆమెను కొట్టడం, కిందకు తోయడంతో ఆమె లోయలో పడిపోతుంది. వెంటనే తల్లికి ఫోన్ చేస్తాడు. కొడుకును కాపాడుకోవడం కోసం ఆమె ఆ కారును లేక్ లో పడేసి, మార్గట్ పడిన లోయ ఉన్న ప్రాంతం మాత్రం తప్పించి, మిగిలింది వెతికించి,ఆమె పారిపోయిందని నమ్మించడానికి ఫోర్జరీ లైసెన్స్ సృష్టిస్తుంది.ఆ తర్వాత ఇక ఆ కేసు క్లోజ్ చేయడానికి ఓ కన్ఫెషన్ ఇచ్చేలా చేస్తుంది.
అప్పటికే ఐదు రోజులు అయిన మధ్యలో వానలు పడటంతో నీరు దొరుకుతుంది కనుక మార్గట్ బ్రతికే అవకాశం ఉండవచ్చు అని భావించి ఆ లోయవు వెతికించడం, ఆమె దొరకడం, బ్రతకడం జరుగుతుంది.
అప్పటి నుండి ఆ తండ్రి కూతురితో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని అనుకుంటాడు. ఆమెకు తల్లి గుర్తుకు రావడం వల్ల ఆమె పియానో క్లాసులకు వెళ్లలేదని అర్ధమవుతుంది.
ఈ సినిమాలో మనుషుల మధ్య కనపడని దూరాలు, వాటి వల్ల అర్ధం చేసుకోలేని అపార్ధాలు ఎలా ఉంటాయో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. బహుశా ఆ దూరం దూరంగా ఉండాలనే కోరుకునే తరం అవతరించింది అనుకుంటా!

* * * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ