మరపు
మరపు
కొరియన్ సినిమాల్లో థ్రిల్లర్స్ కు ప్రత్యేక స్థానముంది. ప్రేక్షకులు ఊహించని మలుపులు, ఇన్వాల్వ్ చేసే ఎమోషనల్ బాండింగ్ తో అలా నడిపిన సినిమానే 'Forgotten.'
జిన్ సూక్ తన అన్న, అమ్మా నాన్నలతో కలిసి కొత్త ఇంటికి వెళ్ళడంతో సినిమా మొదలవుతుంది.ఆ కుటుంబంలో ఉన్న ఆత్మీయత ప్రేక్షకులకు అది ఎంతో మంచి కుటుంబం అన్న భావనను కలిగిస్తుంది.
ఓ రోజు అన్నదమ్ములు రాత్రి వాన పడుతున్న సమయంలో వాకింగ్ కు వెళ్తారు. ఇంతలో తండ్రి నుండి కాల్ రావడంతో అన్న సూ సూక్ అక్కడి నుండి బయలుదేరాతాడు. సూ సూక్ ని ఆ సమయంలో ఎవరో అతన్ని కిడ్నాప్ చేస్తారు.ఆ తర్వాత 19 రోజుల తర్వాత సూ సూక్ తిరిగి వస్తాడు. కానీ ఆ 19 రోజుల్లో ఏం జరిగిందో అతనికి గుర్తు ఉండదు.ఆ తర్వాత సూ సూక్ అర్ధరాత్రి బయటకు వెళ్ళినప్పుడు అతన్ని జిన్ వెంబడిస్తాడు. అక్కడ ఎవరో అతన్ని కలవడం, అక్కడ జిన్ ను పట్టుకోవడం,ఉదయం లేచేసరికి అతను ఇంట్లో ఉండటం గమనిస్తాడు. ఆ తర్వాత అతనికి అది తన కుటుంబం కాదని అర్ధమవుతుంది. పోలీసుల దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు, అతనికి ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. అది 1997 వ సంవత్సరం తనకు 21 అని అనుకుంటున్న జిన్ కు అది 2017 అని తనకు 41 అని తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి వారిని అడిగినప్పుడు ఇంకొన్ని విషయాలు వారి ద్వారా తెలుస్తాయి.
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఓ స్త్రీ, ఆమె కూతురు హత్యకు గురవుతారు. పోలీసులు ఆ హంతకుడిని పట్టుకోలేకపోతారు. కానీ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆ హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలని
వారు ప్రయత్నిస్తే జిన్ అని తెలుస్తుంది. వారు అతన్ను పట్టుకునేసరికి అతను జరిగింది అంతా మర్చిపోతాడు.ఎన్ని విధాల ప్రయత్నించినా అతనికి జరిగింది గుర్తుకు రాదు. ఆ సమయంలో అతన్ని ఆ సమయంలోకి హిప్నటైజ్ చేసి తీసుకువెళ్తే అప్పుడు ఉన్న వాతావరణం అతని చుట్టూ ఉండేలా చేయగలిగితే జరిగింది గుర్తుకు రావచ్చని అతని తల్లిదండ్రులు, అన్నగా నటిస్తూ అతనితో ఉంటారు. కానీ ఆ హిప్నటైజింగ్ ప్రభావం తగ్గిపోవడం, అనుకోకుండా అంతకు ముందు వాన పడిన రోజు ఆ రెండు హత్యలు జరిగాయి కనుక ఆ రోజు గుర్తుకు వస్తుందని ప్రయత్నిస్తే అదే సమయంలో అతని అన్నగా నటించిన వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్లడంతో ఆ పథకం పని చేయదు. ఆ తర్వాత మెల్లగా హిప్నటైజేషన్ ప్రభావం పోవడం వల్ల అతనికి అనుమానం వస్తుంది.అలా ఆ పథకం బయటపడిపోతుంది. ఇక మొత్తానికి జరిగింది గుర్తుకు వస్తుంది.
జిన్ తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్న సమయంలో ఓ యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు మరణిస్తారు.అన్న కూడా ప్రమాదంలో ఉండి, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఆ సమయంలో ఆ డబ్బు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ స్త్రీని హత్య చేస్తే ఆ డబ్బు ఇస్తామన్నా ఆఫర్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అన్నని బ్రతికించుకోవాలనుకుంటాడు. అలా హత్య చేయడానికి వెళ్లిన అతను ఆ స్త్రీతో పాటు ఆమె కూతురిని కూడా హత్య చేస్తాడు ఆమె గట్టిగా అరుస్తూ ఉండటంతో. బాబును మాత్రం చంపడు.
ఆ స్త్రీ భర్త ఆ హత్య చేయించాడని అతను తన అన్నను ట్రీట్ చేస్తున్న డాక్టర్ అని, భార్య మీద ఎన్నో ఇన్సూరెన్సు పాలసీలు తీసుకున్నాడని, తన పిల్లలు బ్రతకడానికి ఆ డబ్బు పనికి వస్తుందని ఆ పని చేయించానని, కానీ తన కూతురిని చంపాడు కనుక ఇక డబ్బు ఇవ్వనని చెప్పి, జిన్ తో ఘర్షణకు దిగుతాడు. ఆ సమయంలో ఆ డాక్టర్ బిల్డింగ్ మీద నుండి పడి మరణిస్తాడు. ఇదంతా జిన్ కు గుర్తుకు వస్తుంది. అదే సమయంలో అన్నాళ్ళు ఈ నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించింది ఆ డాక్టర్ కొడుకు అని తెలుస్తుంది. నిజం చెప్పి తండ్రి మీద ద్వేషం కలిగించడం ఇష్టం లేక తానే అంతా చేసానని చెప్తాడు. కానీ అసలు విషయం అర్ధం చేసుకున్న అతను ఆత్మహత్య చేసుకుంటాడు. తన హంతకుడిని, ఓ కుటుంబాన్ని నాశనం చేశాను అన్న నిజం తెలుసుకున్న జిన్ కూడా చచ్చిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో మూడు కథలు ఉన్నాయి. ఒకటి జిన్ కథ. ఇంకొకటి హత్యకు గురైన కుటుంబం కథ. మరొకటి నటనగా ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు విభిన్న పరిస్థితుల్లో ఒక్క కుటుంబంగా చెందే పరిణామం కథ. ఈ మూడు కథల్లోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. జిన్ కుటుంబంలో ఆకస్మిక మరణాలు, అన్నను కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఇంకో పక్కన డాక్టర్ కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల భార్య హత్యను ప్లాన్ చేసే సందర్భం, ఆ సందర్భం వల్ల ఈ రెండు కుటుంబాలు క్రాస్ అవ్వడం, మొదట జిన్ కుటుంబాన్ని ప్రేక్షకులకు నటుల ద్వారా పరిచయం చేయడం, ప్రస్తుతంలో కుటుంబాన్ని కోల్పోయి అనాధశ్రమంలో పెరిగిన ఆ బాలుడి బాధ నుండి పుట్టిన ప్రతీకారం,నిజాన్ని ప్రస్తుతంలో బ్రతికి ఉన్న ఈ రెండు కుటుంబాలోని కొడుకులు జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవడం, ఇన్ని ఘటనలు-పరిణామాలు ఎక్కువ డీటేయిల్స్ ఇవ్వకుండా ప్రేక్షకులకు చెప్పడం సాధ్యం కాదు.
ఇంత పెద్ద కథను థ్రిల్లర్ గా మలచడం, ఇరవై ఏళ్ళ క్రితం జరిగినదానికి ప్రేక్షకులు ఇప్పుడు జరుగుతున్నట్టు భావించేలా స్టోరీని నిర్మించడం ఈ సినిమా స్క్రీన్ ప్లే మహిమ. కొరియన్ థ్రిల్లర్స్ లో చూడాల్సిన సినిమా.
* * *
Comments
Post a Comment